నర్తించనీ
నీడెప్పుడూ అందమే
నిప్పులా కాలుస్తుంది కూడా
అందం వెనకే మచ్చ ఉన్నట్టు
గోడ ఎప్పుడూ రక్షణే
గోడెప్పుడూ భక్షణే
నలుపు తెలుపులదీ జీవితం
తలపుల తలుపులు తెరిచి చూడు
అందం..మరకలు..నీడా..గోడా..
అన్నీ కనిపిస్తాయి.. గోడును వినమంటాయి
అడ్డుగోడలా నిలిచిన ‘గోడు’
గతం నీడై భాసిస్తుంటుంది
అందుకే వర్తమానమే నీలో నర్తించనీ
సి.యస్.రాంబాబు