అందమైన జీవితం నాది.. ఆశల పొదరిల్లు నాది.

శీర్షిక : ఎవరు నేను

అందమైన జీవితం నాది..
ఆశల పొదరిల్లు నాది...
సంతోషాల హరివిల్లు నాది…
ఇవి నా హృదయాంతరపు కలలు…
కానీ తప్పవు ఊహకందని మలుపులు…

అమ్మ అని ఆరాధిస్తారు..
ఆడపడుచు అని ప్రాణం పెడతారు..
అర్ధాంగి అని ఆదరిస్తారు..

సమాజాన దేవతను…
కానీ స్వేచ్ఛ లేని జీవిని…
ప్రేమాలయంలో పూజింపబడతాను..
అదే ప్రేమలో ఆగమవుతాను..
శాశ్వతంగా కనుమరుగవుతాను..
సృష్టికి మూలం అంటారు..
మీ ఇంట పుడితే మట్టు పెడతారు..

నా కలం కన్నీరు కారుస్తోంది..
నా పక్షాన ఎవరూ లేరని
నా కల చెదురుతోంది..
చేయూత కరువైందని
ఇక ఈ భూమి పైన నా మనుగడ ముగిస్తోంది..
ఏల ఈ వివక్షత..
ఎందుకు ఈ సంధిగ్ధత..
ఎప్పటికీ నా ఈ పాత్ర కు కంటతడేనా.. కలవరమెనా..

హామీ పత్రము: ఇది నా స్వీయ రచన
రచన: కిరీటి పుత్ర రామకూరి
స్థలం: విజయవాడ

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *