అందమైన సెలయేరులు

శీర్షిక :: చిత్ర కవిత

భువనానికి అందం తెచ్చే అందమైన సెలయేరులు ..

సెలయేరుకు అందం తెచ్చే మరింత అందమైన ప్రకృతి…

స్వచ్ఛమైన నీటికి ఈ సెలయేరులే నిదర్శనాలు కాపాడుకోవాలి మన జల సంపద ఎప్పటికప్పుడు ముందు తరాలకు ముచ్చటగా అందివ్వగా..

ప్రకృతి నుండి వచ్చే స్వచ్ఛమైన పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు..

ఈ ప్రకృతులేని జీవించును ఎన్నో జీవరాసులు పక్షులు, జంతువులు, వనం మృగాలు.

ప్రకృతి నడుమ పారే నీటిలో ఎన్నో ఔషధ గుణాలు ఈ నీటిని వాడుకున్న ఏ రోగాలు అంటవు..

ఈ నీటితో పంటలు పండిన ఎంతో శ్రేష్టమైన ఫలితాలు మనకు అందుతాయి పంట ద్వారా.

ప్రశాంతమైన వాతావరణం ఈ ప్రకృతి వల్ల ,స్వచ్ఛమైన గాలి .

ఈ నీటిని చూస్తుంటే కార్తీక స్నానాలు అక్కడికే చేయాలన్నంత ఆశగా ఉన్నది..

నిర్మలమైన ఆ నది ఒడ్డున గలగల పాటలలో జలకాలాటలలో అంటూ కాసేపైనా వయసు మరచి ఆడాలని ఉంది..

నదీ జలాలను ప్లాస్టిక్ కవర్లతోటి అపరిశుభ్రం చేస్తున్నాము . మన ముందు తరాలకు మనము ఏమి అందిస్తున్నాము అనీ ఇళ్ల చుట్టూ ఉండే కాలవలను చూసి మనము ఆలోచించాలి…

ఆలోచించాలి ఆచరణలో పెట్టాలి
ప్లాస్టిక్ ని అరికట్టాలి ..

ఇలా స్వచ్ఛమైన జలాలను ఆశ్వాదించాలి …

ఆలపాటి వారి అమ్మాయి సత్యవతి
నా స్వీయ రచన నా హామీ..

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *