అందాల నెరజాణ…………వయ్యారంగా వస్తున్న,

శీర్షిక: అందాల నెరజాణ
వేల్పూరి లక్ష్మీ నాగేశ్వరరావు
వైజాగ్.

 వయ్యారంగా వస్తున్న,
నా అందాల నెరజాణ, “

  ‘నీ కాలి అందియలు  ఘల్లు, ఘల్లు మన,        తడిసిన చీరలో నీ అందాలు, నా మనసు
నూరడించే,!!

‘చల్లచల్లని పైరుగాలికి,
నీ నునిమెత్తన ,చీర కొంగు రెపరెపలాడే,
నిన్ను మలచిన  ఆ ‘బ్రహ్మదేవుడే ‘నివ్వెర పోగా!
‘ఆ అతిలోక సౌందర్యం నీ సొంతమే గదా,!!

‘నిన్ను  చూసిన వసంత కోకిల లు కమ్మని పాడగా,!   ‘చిలిపి ఊహలు నీ కోసం నామదిలో మెలగగా!,
  ఆ ‘నవ మన్మధుడికే’
కంటి మీద కునుకు కరువాయనే!,
నేనంతవాడను,   నీ మనసు కోరగా,!
‘కలహంస లా నడిచి రావే, నా నాట్యమయూరి!!

“బాపు గారి కిన్నెరసాని, ఓంపుల వయ్యారి చిత్రమై’!
,
‘రవివర్మకే ‘అందని ఒకే ఒక అందానివో ప్రియా!,

  ‘నీ పసుపు రంగు పట్టు చీర,
‘ప్రకృతి మనకు ఇచ్చిన ‘మధుపర్కాల ‘!
‘మనమిద్దరం ‘వివాహ బంధంలో’ కరిగిపోదు మా ప్రియా!!**.

(ఈ కవిత నా స్వీయ రచన అని హామీ ఇస్తున్నాను.
వేల్పూరి లక్ష్మి నాగేశ్వరరావు.)

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *