ప్రజాస్వామ్యం అంటే ప్రజల కొరకు పాలన
నాయకుల ఎన్నిక కొరకు దురలవాట్ల లాలన
ఓటు ఎన్నిక నోట్ల కొరకు బ్రతుకుట
దీనావస్థకు లోనై ఎంత వింత కర్మపాటు
ఎట్ల గడియు జీవన సౌశీల్యము
బ్రతుకుట్టేందుకు గమన ఘనకార్యము
నీతి గలిగియుండి నిక్కము గను నగరి
దారుణాల సొగసు ఓటు కదువోయ్ మన వేటు
బానిసత్వం విడిచి మంచి మూర్తి మత్వంబు నిజము
చరిత్ర లందు గలుగు పుణ్య గతులు మార్గంబు
మరువ కుంటి రోజు మధుర నిమిషం
వ్యసన బానిస వద్దు వ్యాకులత ఇంకా వద్దు
నగరి క్షేమం కోరు సజ్జనుండు.
హామీ పత్రం
ఈ రచన నా యొక్క సొంత రచన