అక్షరలిపి కథలు- రాధ కోరిక

అక్షరలిపి కథలు- రాధ కోరిక

రాధ కోరిక

“రాధ నువ్వు పై చదువులు చదవడం నాకు ఇష్టం లేదు. ఇకనైనా అక్కకి తోడుగా ఇంట్లో ఉండు” అని చెప్పింది జ్యోతి.

“నాన్న అమ్మ పై చదువులు చదవొద్దు అంటుంది. నువ్వే చెప్పు నాన్న అమ్మకి” అని దిగులుగా చెప్పింది రాధ.

“నువ్వు పై చదువులు చదవడం నాకు ఇష్టమే. నేను చదివిస్తాను మీ అమ్మని నేను ఒప్పిస్తాను” అని చెప్పాడు నరేష్.

“ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది నాన్న. వెంటనే నేను ఇంటర్ కాలేజ్ కి వెళ్లి జాయిన్ అవుతాను” అని చెప్పింది రాధ.

“ఈరోజు వద్దు రేపు మనిద్దరం కలిసి వెళ్దాం సరేనా” అని చెప్పాడు నరేష్.

“ఏంటండీ మీరు కూడాను నేహా ఒక సంవత్సరం నుండి ఇంట్లోనే ఒంటరిగా ఉంటుంది. దానికి తోడుగా రాధ ఇంట్లో ఉండి పనులు చేసుకుంటూ ఇద్దరు కలిసి ఉంటారు” అని చెప్పింది జ్యోతి.

“నేహా కి చదువు మీద అసలు శ్రద్ధ లేకపోవడం వల్ల పై చదువులు చదవలేదు.  అంతే తప్పించి తనకు తోడుగా రాధ ఎందుకు ఉంటుంది? తాను చదవాలని అనుకుంటుంది చదవని.
రేపు ఉదయం నేను రాధని కాలేజీలో జాయిన్ చేసుకొని వస్తాను” అని చెప్పండి నరేష్.

“సరే మీ ఇష్టం…” అని చెప్పింది జ్యోతి.
జ్యోతి నరేష్ మేస్త్రి పని చేస్తారు. వాళ్లకి ఇద్దరు కూతుర్లు నేహా , రాధ.
నేహా చిన్నప్పుడు పోలియో రావడం వల్ల సరిగ్గా నడవలేకపోయేది. ఎలాగోలాగా 10 వరకు చదివిన ఆ పై చదువులకు శ్రద్ధ చూపించడం లేదు.
మరుసటి రోజు నరేష్ రాధని తీసుకొని కాలేజ్ కి వెళ్లి జాయిన్ చేయించాడు.
ఇంటర్ పూర్తి చేసిన కొన్ని రోజులు తర్వాత ఇంట్లో పరిస్థితులు బాగాలేకపోవడం ఒక ఫార్మసీ కంపెనీలో జాయిన్ అయింది రాధ.
రాధ ఆ కంపెనీ లో జాయిన్ అయిన దగ్గర నుండి జ్యోతి , రాధ ల మధ్య ఏదో ఒక విషయంలో గొడవ జరుగుతూనే ఉండేది.
అన్ని పరిస్థితులను రాధ తట్టుకుంటూ ఆరు నెలల తర్వాత ఉద్యోగం మానేసింది. ఓపెన్ డిగ్రీ కి అప్లికేషన్ పెట్టింది.అక్షరలిపి కథలు- రాధ కోరిక 
మొదటి సంవత్సరం కాలేజీకి వెళ్లి బుక్స్ తెచ్చుకుంది.
అలా అనుకోకుండా రాధకి పెళ్లి కుదరడం వల్ల  నిశ్చితార్థం ఉన్న టైం లోని పరీక్షలు ఉండడం వల్ల రాయలేకపోవడం.
పెళ్లి తర్వాత పరీక్షలు రాసింది కానీ రెండు సబ్జెక్టుల్లో ఫెయిల్ అయిపోయింది.
తర్వాత కొన్ని రోజులకు రాధ ప్రెగ్నెంట్ అని తెలిసింది.
తనకి డెలివరీ అయిన టైం లోని మళ్లీ పరీక్షలు వచ్చాయి.
చిన్న బాబు వదిలేసి వెళ్ళలేక పరీక్షలు రాయడం మానుకోండి.
బాబు పుట్టినరోజు ఆరు నెలల తర్వాత ,
“నేను పరీక్షలు రాయాలనుకుంటున్నాను. ఫీజు కట్టండి రాధ అడిగితే…

“ఇప్పుడు ఏం చదివి నువ్వు ఎగ్జామ్స్ రాయలేవు ఇంట్లో ఉండి బాబు ని చూసుకో” అని చెప్పారు తన భర్త.

నరేష్ చేత తన భర్తకి నచ్చింది ఎగ్జామ్ రాయించేలా చేసింది రాధ.
ఈసారి అన్ని ఎగ్జామ్స్ బాగా చదివి రాయడం వల్ల డిగ్రీ సంపాదించాలని రాధ కోరిక నెరవేరింది.
సర్టిఫికెట్ పెట్టుకొని ఎక్కడైనా జాబ్ చేయొచ్చు అనే ధీమాతో ఉంది.
తన కోరిక నెరవేర్చుకోవడానికి ఎన్ని ఓటమిలు చూసిన , ఎంతో మంది దగ్గర తలవంచిందో తనకే తెలుసు ఈ విజయానికి తన అనుభవంతో ముందు అడుగులు వేసింది.

మాధవి కాళ్ల

అక్షరలిపి కథలు- రాధ కోరిక

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *