అక్షర కొరకుఅంశం :⁠- చిత్ర కవితతేది:⁠- 18/11/2025శీర్షిక:⁠- ఓదార్పు, కళ, ఆరాధన

ఓదార్పు కావాలి మనసుకు
కన్నీటి తెర చాటున దాగిన బాధకు
చేతుల్లో మోము దాచి
ఆశలన్నీ ఆవిరై ఆగిపోయిన హృదయానికి
వెనుక నుండి వచ్చే ఒక స్పర్శ

ప్రేమతో నిండిన చిరునవ్వుతో
ఆత్మీయమైన నీ ఆలింగనంలో ఓదార్పు
జీవితం పంచుకునే బంధమిదే
వెలుగు పంచుకునే స్నేహమిదే
మరోవైపు సాగేను మధుర రాగం

వీణ తంతెపై పలికే కళా ప్రపంచం
పచ్చని చెట్ల కింద పద్మాల మధ్య
కూర్చుని ఆడేను సప్త స్వరాల సయ్యాట
పక్షుల కిలకిలలు వీణమ్మ నాదంతో
ప్రకృతితో కలిసిన పరమ శాంతి

మనిషి వేదనకు మందు ఈ సంగీతం.
ఆరాధనలో దొరికే అమృత భావం
గులాబీ రంగు చీరలో దైవత్వం
కళ్ల నిండా వెలుగు చేతిలో పూజా ఫలంతో
శుభాలను కోరే శుద్ధమైన మనస్సు

నమ్మకమే ఆమెకు సకల సంపద
దినమంతా శక్తినిచ్చే వేద సూక్తి
పవిత్రత భక్తి ఉల్లాసం నిండిన హృదయం
బాధలో భుజం భారంలో సంగీతం
ప్రశాంతతకై చేసేను ఈ ఆరాధన..
ఓదార్పు కళ ఆరాధనల కలయికే సత్యమైన జీవితం..!

మాధవి కాళ్ల..
హామీ పత్రం :⁠-
                      ఈ కవిత నా సొంతం అని హామీ ఇస్తున్నాను..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *