అక్షర లిపి కవితా సమూహం
అంశం: ప్రేమ లేఖలు
రచన: లీలావతి
ఊరు: కర్నూలు
రాయ లేని ప్రేమలేఖ
నీకు నా ప్రేమను తెలుపుతూ
రాద్దామని కూర్చున్నాను
చీకటి గదిలో కూర్చుని
కళ్ళు తెరిచి మనసు తెరిచి
ఏం రాయాలో తెలియ క…..
కవితంటే నీకు ఇష్టం కదూ
రాస్తున్నాను ఒక కవిత
పొంగు తున్నాయి భావాలు
అంతరంగాన అలలు అలలుగా
కలుగుతోంది ఆరాటం
కాగితపు తీరం చేరాలని
చేరబోయి న తీరం సాగిందిదూరం….
నా అంతరంగము ఆగింది
క్షణకాలం…..
రాయ లేని ప్రేమ లేఖ
పుస్తకం లో దాగింది
మౌనంగా మన్నించమంటూ!!
హామీ పత్రం…..
ఈ కవిత నా సొంత మని హామీ ఇస్తున్నాను.
లీలావతి….. కర్నూలు