అక్షర లిపి రచయితల (కధ)

అక్షర లిపి రచయితల (కధ)

29_09 _2023: భానువారం
అంశం: చిత్రకవిత
రచన:కె.కె.తాయారు

ముదిమి లో వ్యాపకం

ముక్కోటి జనులున్న
తీర్చరాని, తీర్చలేని
ఆవేదనాక్రోశం ఒంటరి
గమనంలో తుంటరి బ్రతుకు !!

బతికి బట్ట కట్ట కావాలి
ఆధారం, అదే మనిషికి
జీవనాధారం ఆహారం
సంపాదించ మార్గాలనేకం!

ఊపిరి లేని రూకలకు
విలువ హెచ్చు, సంపాదించ
ఆశే,కానీ మార్గాన్వేషణ
చాలా అవసరం,

బలిమి కలిమి అవసరం
ముదిమికి ప్రాణ సంకటం
కానీ బ్రతుకు బండి నీడ్చ
పలు తెరగులు ప్రయత్నం!

హస్త నైపుణ్యాలు అనన్యం
ఉదర పోషణార్థం వేవేల
విధాలు, అందు ప్రధమం చేతి
పనులు విలువ హెచ్చు !!

చేయు పని తక్కువ ఏమి కాదు
ఉద్యోగాలు చేసిన ఊడిగాలు చేసిన
ఏదైనా పని యే సంపాదించ
కష్టే పలే కాన కాలే కడుపుకి
మండే బుగ్గి అన్నారు పెద్ధలు !

అందుకే తప్పదు సంపాదన
అందుకే ఎండనక వాననక
బతుకు బండి లాగాలి
జీవిత సత్య మిది నేర్చుకో !!!

ఇది నా స్వీయ రచన అని హామీ ఇస్తున్నాను.
__కె.కె.తాయారు.

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *