ప్రతి విద్యార్థి బాధ్యత

అక్షర శిల్పికి వందనం

అక్షర కొరకు
అంశం :⁠- ఉపాధ్యాయ దినోత్సవం(చిత్ర కవిత)
తేది:⁠- 02/09/2026
కవితసంఖ్య:⁠- 18
శీర్షిక:⁠- అక్షర శిల్పికి వందనం
@@@@@@@@@@@@@@@@@

అమ్మ జన్మనిస్తే
గురువు జీవితాన్ని ఇస్తాడు
పచ్చి మట్టి ముద్ద లాంటి మనసును
ఆలోచనల రంగులతో తీర్చిదిద్దుతాడు
ఓటమిని తట్టుకునే ధైర్యాన్ని

గెలుపును తలకు ఎక్కించుకుని వినయాన్ని
నేర్పించే ఆ నిరంతర శ్రామికుడు
మన భవిష్యత్తును మలిచే మహాశిల్పి
కఠినమైన రాతి లాంటి మనిషిని
జ్ఞానపు ఉలితో చెక్కి

సమాజం మెచ్చే అద్భుత శిల్పంగా
మార్చగల ఏకైక మహాన్నత శక్తి గురువు
జ్ఞాన భిక్షను పెట్టి
అజ్ఞానపు చీకట్లును తుడిచి
సన్మార్గంలో నడిపించే

అక్షర శిల్పికి వందనం
రాతిని సైతం రమణీయ శిల్పంగా మార్చే ఉలి గురువు అయితే
ఆ ఉలి దెబ్బల వెనక ఉన్న శిష్యుల భవిష్యత్తు
ఉపాధ్యాయులు నేర్పిన అక్షరాల సాక్షిగా వారు చూపిన ఆదర్శాల సాక్షిగా
నా ప్రతి విజయానికి పునాది అయిన నా గురువు దేవుడికి నా పాదాభిందనం…

డా. సరికొండ రమాదేవి
హామీ పత్రం :⁠-

                 ఈ కవిత నా సొంతమని హామీ ఇస్తున్నాను..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *