అతి సర్వత్రా వర్జయేత్

అంశం: అతి సర్వత్రా వర్జయేత్

భరించలేని బాధ
రాఘవరావు గారు చాలా మంచివారు కానీ ఆ మంచి తనానికి అడ్డు ఆపు లేదు అది భరించలేనంత బాధాకరం.

ఒకసారి వారి ఇంటికి ఒక అతిథి వచ్చారు. అంతవరకు అతను ఎవరో పరిచయం లేదు తర్వాత మాటల్లో ఆయన వీరికి బంధువు అని బలవంతం చేసి భోజనానికి అట్టే పెట్టారు. ఆయన పక్కన కూర్చొని .రాఘవరావు గారు వద్దు వద్దు వద్దంటుంటే అతనికి బాగా తినిపించారు దాంతో వాంతులు పట్టుకున్నాయి అంతే ఒక పూట ఉందామన్నవాడు రెండు రోజులు డాక్టరు మందులు…..

ఇంకొకసారి ఆయన స్కూటర్ మీద వెళ్తూ ఉంటే తెలిసిన రాజన్న గారు స్కూటర్ పట్టుకొని నిలబడి ఉన్నారు.. ఆయన్ని చూసి ప్రేమతో ఆ బండి అక్కడ పెట్టేసి నా బండి మీద రండి అని బలవంతం చేసి తీసుకెళ్లారు తోవలోఈయన బండీ కాస్త పెట్రోలు
అయిపోయి ఆగిపోయింది.

నేను ఆటో మీద వెళ్ళిపోతాను బాబు అంటే రాజన్న గారు, రాఘవయ్య గారు ఒప్పుకోలేదు ఆఖరికి ఆయన కళ్ళనీళ్ళతో నాకు అర్జెంటు పని ఉందండి నేను వెళ్లి తీరాలి అని ఏడుపు గొంతుతో అడుక్కోవాల్సివచ్చింది . అప్పుడు గాని వదలలేదు.

ఇలాంటి వాళ్ళని తప్పించుకు తిరగాలి గాని
లేకపోతే ప్రాణాంతకమే. తస్మాత్ జాగ్రత్త!!!

ఇది నా స్వీయ రచన అని హామీ ఇస్తున్నాను
…కె.కె.తాయారు

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *