అత్యాశ Greedy 4

అత్యాశ

 

ఇది విన్నారా అంటూ గబగబా లోనికి వచ్చింది పంకజం ,ఎక్కడ గడ్డం తెగుతుందో అని బయపడి ఆమె అరిచిన అరుపుకు రేజర్ కింద పారేసాడు కామేశం. ఇది విన్నారా అంది మళ్ళి పంకజం కామేశాన్ని చూస్తూ, ఎంటే నువ్వు చెప్పకుండా నేనేం వినాలి.

Selective focus of crop anonymous African American man wearing white turtleneck praying with open hands

ఎవరూ చెప్పాలి ఏంటో చెప్పి చావు అన్నాడు కామేశం ,ఆఫీస్ కి లేట్ అవుతుంది అనే బాధలో మీకేం తెలుసు మీరో వెర్రి మాలోకం మీకు ఆఫీస్ తప్పితే ఇంకేమి పట్టదులెండి అంది మూతి తిప్పుతూ, నీ ముతిలో మూతి పెట్టడం నా తప్పు కానీ ముందు విషయం చెప్తావా ,లేక ఇలాగె ఆఫీసు కి వెళ్ళిపోమంటావా ,పంకజం మొగుడికి పిచ్చేక్కిందని అందరూ అంటే నాకు మాత్రం సంభందం లేదు అన్నాడు.

మాటకు అతని అవతారాన్ని చూసింది లుంగీ మిద ఉన్న భర్త అలా బయటకు వెళ్తే చుట్టుపక్కన వాళ్ళు అలాగే అనుకుంటారు అని నిజం గ్రహించి,గొంతు తగ్గించి ,మరి భర్త తో చూసారా కాంతం మొగుడు దానికి తెలియకుండా ఒక లాటరి టికెట్ కొన్నాడు.దానికి అది వాళ్ళాయనను కొట్టిన కొట్టు కొట్టకుండా కొట్టింది.అంత కొట్టినా అతను టిక్కెట్ ని వదలకుండా పట్టుకోవడం తో ,వాళ్ళకు అనుకోకుండా అదే నెంబర్ కూ లాటరి తగిలి లక్ష రూపాయలు వచ్చాయి తెలుసా, మీకు తెలివి కూడా లేదు అంది పంకజం,కామేశాన్ని వాడెవడో అది కొంటె నేనేం చెయ్యాలి అని ఆనందు కామేశం గడ్డాన్ని తుడుచుకుంటూ….

Top view of opened red envelope with beautiful red carnations against white background symbolizing congratulation concept

అయ్యో రాత ఇంత చెప్పినా మీకు అర్ధం కాక పొతే ఎలా ,నేను కాబట్టి మీతో సంసారం చేస్తున్నా ,అదే ఇంకోతి అయితే మిమల్ని తన్నేది,అంటూ కామేశం రెండు బుగ్గలు పొడిచి,నేను మిమల్ని అలాగే కాంతం మొగుడు కొన్నట్టే మీరు లాటరి కొనండి, నేను మిమల్ని కొట్టాలి అది చినగకుండా మీరు దాచాలి,దాంతో మనకు లాటరి తగులుతుంది.అలా మీరు చెయ్యలేదో నేను మా పుట్టింటికిపోతా అని వార్నింగు ఇచ్చేసింది కామేశానికి.

అయ్యో పిచ్చిదానా వాడికి ఎదో అదృష్టం బాగుంది లాటరి తగిలిందే ,వాళ్ళలాగే మనము చేస్తే మనకి ఎందుకు తగులుతుంది అలా నువ్వు పొరపాటు పడకు ,దయచేసి ఇది ఆలోచన మానుకో అన్నాడు కామేశం ఇదిగో చూడండి మీరేం చెప్పినా నేను వినను , కాంతానికి బాగా పోగరేక్కింది లాటరిలో డబ్బు వచ్చిoది నన్ను చులకనగా  చూస్తుంది.

దానికంటే నేనే గొప్పా నాకు అయిదులక్షలు లాటరి లో రావాలి అది కుల్లుకుని చావాలి,అందుకే మీరేమి సందేహించకుండా నేను చెప్పినట్టుగా వినoడి అంతే ఇక దీనికి తిరుగు లేదు అని ఖరాఖండిగా చెప్పి ,వెళ్ళి పోతున్న భార్య వంక అయోమయంగా చూస్తూ ఉండి పోయాడు కామేశం.

అత్యాశ

తెల్లారిన తర్వాత ఎలాగో భర్తని బెదిరించిన పంకజం లాటరి వాడిని వెతికి పట్టుకుని,వాడి దగ్గర ఉన్న అయిదు లక్షల విలువ చేసే లాటరిని తీసుకుంది. వాడు ఎదో చెప్పబోతున్నా వినకుండా వాడి నోరు ముసి వాడికి అయిదు వేలు ఇచ్చి మరి కొన్నది లాటరిని ,ఇక దాన్ని చూసి లాటరి వచ్చినంత సంబర పడి పోతూ ఇంటికి వెళ్ళారు ఇద్దరు.అయితే కాంతం మొగుదిని కొట్టింది అని…

అందువల్లే లాటరి వచ్చింది అని భావించిన పంకజం భర్తని తర్వాత రమ్మని చెప్పి,తానూ ముందుగా ఇంటికి వెళ్ళి కామేశాన్ని కొట్టడానికి కావాల్సిన కర్రలు,అట్లకాడ,చపాతీ కర్రని రెడీ గా పెట్టుకుని కూర్చుంది.

కామేశం రాగానే కాంతం ఎలా భర్తని ప్రశ్ని oచిందో ,అలాగే కామేశాన్ని కూడా అడిగింది ,కామేశం కూడా అదే తిరుగ సమాధానం చెప్పాడు,ముందు రోజు పంకజం ఇచ్చిన ట్రెయినిoగు ఇవ్వడం తో,అలాగే చెప్తే , మాటలకూ లేని కోపాన్ని,కాకుండా భర్త మిద ఉన్న కోపాన్నంతా చూపించే అవకాశం రావడంతో కంఠం మొగుడికి ఎక్కడెక్కడ దేబ్బలు తగిలయో, అక్కడక్కడ నె కాకుండా,వాళ్ళది ఇంకా ఎక్కువ డబ్బు రావాలి అని అనుకుని కామేశాన్ని పిచ్చ కొట్టుడు కొట్టింది.

Brown Jest for You Box

దాంతో కమేశానికి ఎక్కడెక్కడో దేబ్బలతోపాటు తల కూడా పగిలి,రక్తం వరదలు అయ్యింది ,దాంతో పరిస్థితి విషమించింది అని భావించిన పంకజం భర్తని అంబులెన్సు లో ఆసుపత్రికి తీసుకుని వెళ్ళింది.అది సూపర్ స్పెషల్ ఆసుపత్రి కావడం తో వాళ్ళు పట్టిన పట్టుకు ,దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యింది పంకజానికి .

అయినా బిల్లు బాగా అయ్యి,దూల తీరింది పైగా దెబ్బలు చూసి అటెంప్ట్ మర్డర్ కింద కేసు పెట్టాలి అని డాక్టర్ గారు అనడం తో,తన దగ్గర డబ్బు  కూడా లేకపోవడం తో తండ్రికి ఫోన్ చేసి పిలిపించింది పంకజo,కూతురు పనులు తెల్సిన తండ్రి ఏంటి ఎదవ పనులు చెయ్యడం.

అయినా మొగుణ్ణి కొడితే డబ్బులు వస్తాయి అని నీకు ఎవరూ చెప్పారు,ఎవరికో ఎదో  వాళ్ళ అదృష్టం బాగుండి డబ్బ్బు వస్తే నీకు కూడా అలా వస్తాయని పిచ్చిగా నమ్మి మంచివాడు అయినా నీ భర్తని అలా కొడతావా,అతను మంచివాడు కాబట్టి నీ పిచ్చి తనానికి ఏమి అనకుండా ఉండడం నీ అదృష్టం అని కూతురుకు బుద్ది చెప్పాడు .

అత్యాశ

భర్తకు అంతా బాగా  అయ్యాక మెల్లిగా లాటరి ఏదండి అని అడిగింది పంకజం ,అంత జరిగినా భార్యకు భయపడి లాటరిని జాగ్రత్తగా దాచిన కామేశం దాన్ని తీసి భార్యకు ఇచ్చాడు.పంకజం దాన్ని తీసుకుని పరుగెత్తి వెళ్ళి హల్లోఉన్న పేపర్లో చూసింది,కానీ దాని నెంబర్ అందులో లేదు,ఇంతలో తండ్రి లాటరి అమ్మిన వాడిని తీసుకుని వచ్చాడు.

పంకజం వాణ్ణి చూసి గుర్తు పట్టి ,దగ్గరగా వెళ్ళి,ఏరా వెధవ నాకు డొక్కు లాటరిని అంట గడతావా అంటూ అడిగింది,వాడు పంకజం తండ్రి నుండి విడిపించుకుంటూ ,ఏంటమ్మా రోజు నేను దాని తేది అయిపోయింది అని చెప్ప బోతున్న వినకుండా మిరే కదా దాన్ని లాక్కుని మరి వెళ్ళారు ,నా తప్పేమి ఉంది అని అంటూ అతనీ చేతి ని తప్పించుకుని వెళ్ళిపోయాడు వాడు.

పంకజం అటూ లాటరి పోయినందుకు,భర్తని కొడితే అయిన ఆసుపత్రి బిల్లు ని,పైగా లాటరి వాడికి టిక్కెట్ కంటే ఎక్కువ ఇచ్చిన డబ్బు అయిదు వేలు గుర్తొచ్చి ,తన అత్యాశ తనకు తెచ్చిన నష్టాన్ని,ఎవరో ఎదో చేసారని,వారికేదో జరిగింది తనకు కూడా అదే జరుగుతుందని భావించి,అత్యాశకూ,అసూయకు పోయినందుకు తనకు తగిన శాస్తి  జరిగినది అని  గుర్తు చేసుకుని బోరు మంది….

దురాశ దు:ఖానికి చేటు

Related Posts