అదిరిందయ్యా చంద్రం Excellent Work Man 1

అదిరిందయ్యా చంద్రం

అదిరిందయ్యా చంద్రం
అదిరిందయ్యా చంద్రం

అదొక మారుమూల పల్లె,అక్కడ ఎవరికీ ఏమి కావాలన్నా వెంటనే గుర్తుకు వచ్చే పేరు ఒక్కటే అదే పేరు చంద్రం అనే పేరు మరి చంద్రం వాళ్ళకి ఎందుకు గుర్తుకురావడం అని అంటే వారికీ ఎ పని కావాలి అన్నా సిగరెట్టూ కావాలన్నా, నీళ్ళు కావాలి అన్నా చివరికి పశువుల పెడ ఎత్తాలి అని అన్నా చంద్రమే గుర్తుకు వస్తాడు.

మరి చంద్రానికి ఎవరూ లేరా? వీళ్ళoదరికి ఎందుకు చంద్రం తలలో నాలికలా ఉన్నాడు అంటే పాపం చంద్రం కి ఒకే ఒక్క ముసలి తల్లి తప్ప ఎవరూ లేరు అతనికి ఎ పని రాదు కాబట్టి ఇలా అందరికి ఎదో ఒక సహాయం చేస్తూ వారు ఇచ్చిన పదో పరకో డబ్బును తీసుకుని వెళ్లి తల్లికి ఇస్తే తల్లి ఎదో ఇంత ఉడకేసి పెట్టేది.

అలా ఊర్లో అందరి పనులు చేసి పెట్టె చంద్రంకు ఇంకా పెళ్ళికాలేదు కారణం చంద్రానికి పెద్దగా ఆస్థిపాస్తులు లేవు ఉన్నది ఒక్కాగానోక్క పెంకుటిల్లు అందులోను అది వర్షం పడితే మొత్తం కారడం మొదలు పెడుతుంది అందరికి చంద్రం అవసరానికి కావలి తప్పితే అయ్యో ఇల్లు ఇలా లేదని పట్టించుకునే వారు లేరు.

తల్లి కి కూడా వయస్సు మిద పడుతున్నా కొద్ది కొడుక్కి పెళ్ళి చేయాలనే కోరిక మనసులో పెరిగి పోతూ అందరికి తన కొడుక్కి పెళ్ళి చేయాలి అని అనుకుంటున్నా అని పిల్లని చూడండి అని చెప్తూ ఉండేది….

బయట అరుగు మిద కుర్చుని అలా ఆమె అందరికి చెప్పడం చంద్రానికి నచ్చేది కాదు అయిన తల్లి కోరికలో నిజం ఉందని గ్రహించడానికి ఎక్కువ సమయం పట్టలేదు చంద్రానికి, ఎందుకంటే తల్లికి చూపు సరిగ్గా లేక కూరల్లో ఉప్పుకారాలు, అన్నంలో గంజి అలాగే ఉంచుతూ ఉంది. అలాoటి తిండి తినలేక చంద్రం తాను కూడా పెళ్ళి చేసుకోవాలి అని అనుకున్నాడు.

అనుకున్నదే తడవుగా అందరికి తనకు పిల్ల కావాలి అని చెప్పసాగాడు. వాడి అమాయకమైన మొహం చూస్తూ, వాడికి పెళ్ళి మిద ఉన్న కోరికని చూస్తూ ఊర్లో ఉన్న కొంటె కుర్రాళ్ళు వాడిని పిలిచి నీకు ఎలాంటి అమ్మాయి భార్యగా రావాలని కోరుకుoటున్నావు అని అడిగే వారు.

పాపం మన చంద్రం అమాయకంగా వాడి మనసులో ఉన్న కోరికని తెలియ చేస్తూ“మరే అండి నాకేమో అప్సరస లాంటి అమ్మాయి కావాలండి ఆమె ముడితే మాసి పోయేలా తెల్లాగా ఉండాలి, మరే మరే వంట చాలా బాగా చెయ్యాలి, నాకు రకరకాల పిండి వంటలు చేసి పెట్టాలి.

అదిరిందయ్యా చంద్రం

బోలెడన్ని నగలు, డబ్బు ఉండాలి, నేను కాలు మిద కాలు వేసుకుని పడుకుంటే, ఆమె నా కాళ్ళు నొక్కుతూ ఉండాలి అని కళ్ళు మూసుకుని అవన్నీ తనే అనుభవిస్తున్నట్టుగా భావించి, మరో లోకంలో ఉన్నట్టుగా చెప్పేవాడు తన్మయత్వంతో.

వాడి కోరికలు విన్న కుర్రాళ్ళు విరగ బడి నవ్వుతుంటే చంద్రం మాత్రం బిక్క మొహం వేసి అక్కడ నుండి వెళ్లి పోయేవాడు, ఒరేయి నీకు ఏమి లేకున్నా ఇన్ని కోరికలు ఉన్నాయి ఏంట్రా అని అంటూ వెక్కిరించే వారు.

చంద్రం కోరికలు విన్న తధాస్తు దేవతలు తధాస్తు అని అన్నారేమో ఒక రోజు అతని కోరిక నెరవేరే సమయం వచ్చింది.

చంద్రం ఉన్న ఊరి మునసబు గారు ఎదో పని బడి పక్కూరి మునసబు గారికి ఒక ఉత్తరం రాసి మన చంద్రానికి ఇచ్చి వెళ్లి అక్కడి మునసబు గారికి ఇచ్చి,తిరిగి జవాబును తెమ్మని అన్నాడు ఎంత సమయం అయినా వేచి ఉండమని గట్టిగా చెప్పడంతో చంద్రం ఆ ఉత్తరాన్ని తీసుకుని బయలు దేరి వెళ్ళాడు.

అక్కడ ఆ ఊరి మునసబు గారికి ఉత్తరాన్ని ఇచ్చిన చంద్రం జవాబుని అడిగితె అతను బాబు సాయంత్రం నీకు ఇస్తాను, అంత వరకు నువ్వు ఈ ఊర్లో ఉన్న సత్రంలో విశ్రoతిని తీసుకో అని చెప్పితన మనుషులని ఇచ్చి, పంపించడంతో చంద్రం వెళ్లి ఎదో తినేసి, కాసేపు వాళ్ళు చూపించిన సత్రంలో విశ్రాంతి తీసుకుంటూ ఉండగా,అదే సత్రంలో పక్కగది నుండి మాటలు వినిపించాయి గుసగుసగా…

మన చంద్రానికి ముందే ఆసక్తి ఎక్కువ కదా కాబట్టి ఆ మాటలు విన్నాడు రహస్యంగా, ఆ మాటలు మాట్లాడుతుంది.

ఆ ఊరి మునసబు గారి శత్రువైన నారాయణ తన మనుషులతో మునసబు గారి ఏకైక కుమార్తె అప్సరను ఆ సాయంత్రం తోటలో చంపాలని కొందరు మనుషులని ఏర్పాటు చేస్తూ, వారు ఎలా చంపాలో వివరించడం విన్న చంద్రం ఆమెని ఎలాగైనా కాపాడాలని అనుకుని, వెంటనే వెళ్లి ఎవరూ చూడకుండా తోటలోకి వెళ్లి చెట్ల చాటుగా కూర్చున్నాడు.

సాయంత్రం ఆరు గంటలు అవుతూ ఉండగా తన స్నేహితులతో ఆ తోట లోకి అడుగు పెట్టిన అప్సర పువ్వులు కోసుకో సాగింది. ఆమె స్నేహితులు ఆమెని వదిలి కొంచం దూరంలో వేరే పువ్వులు కోస్తూ నిలబడ్డారు.

అదిరిందయ్యా చంద్రం

అదే అదునుగా నారాయణ మనుషులు ఆమెని చంపడానికి ముందుకువచ్చారు అది చూసి అప్సర భయంతో బిగుసుకుని పోయింది ఇంతలో చంద్రం తను అప్పటికే సంపాదించి ఉంచిన ఏవో ఆకులూ కొన్ని వారికీ అంటించి వారి చేతిలో ఉన్న కత్తులను తన దగ్గర ఉన్న కర్రతో పడవేస్తూ పారిపొండి పారిపొండి అని అరవసాగాడు అప్సరను చూస్తూ కానీ అప్సర భయంతో అక్కడ నుండి కదలలేదు.

ఆమె స్నేహితులు వారిని చూసి ఎప్పుడో పారి పోవడంతో వారిని కొడుతున్న చంద్రం దాటికి తట్టుకోలేక అతను అంటించిన ఆకులూ కూడా దురద పెట్టడంతో గోక్కుతూ, దెబ్బలని తప్పించుకోలేక పోతున్నారు..

ఈ హడావుడి అంతా జరుగుతూ ఉండగానే స్నేహితులు వెళ్లి మునసబు గారికి విషయం చెప్పడంతో అతను, అతని మనుషులతో సహా వచ్చి వారిని పెడ రెక్కలు విడిచి పట్టుకున్నారు.

వారితో పోరాడిన చంద్రానికి దెబ్బలు తగిలాయి అతన్ని తీసుకుని వెళ్లి వైద్యం చేయించిన మునసబు గారు తన కూతుర్ని కాపాడిన చంద్రానికి ఉన్న తెగువ, బలం, సమయస్పూర్తిని చూసి ముచ్చట పడి తన కూతురికి ఇంతకన్నా మంచి వాడిని ఆమెని కాపాడే వాడిని తేలేను అని గ్రహించి, చంద్రాన్ని పెళ్ళి చేసుకుంటావా అని అప్సరను అడిగాడు.

కూతుర్ని అతన్ని చూడగానే ప్రేమలో పడిన అప్సర సిగ్గుతో తల ఉపడంతో చంద్రం తల్లిని పిలిపించి ఊరంతా పందిరి వేసి, ఘనంగా, పెళ్లుమంటూ పెళ్ళి జరిపించారు మునసబు గారు.

అందరూ చంద్రం అదృష్టానికి అసూయా పడ్డారు అని అనడంలో సందేహం లేదు. అతని అమాయకమైన కోరిక విన్న కొందరు నిజంగా మన చంద్రం అనుకున్నట్టు గానే అప్సరస లాంటి అందమైన భార్య, ఆస్థి, రుచిగా వంట చేయగలిగే అమ్మాయి రావడం చూసి “అదిరిందయ్యా చంద్రం“ అని అనుకున్నారు అతని కోరికలో నిజం ఉందేమో కానీ ఆతను బలంగా కోరుకున్న విధంగానే కొన్ని రోజుల్లో పెళ్ళి జరిగిపోయిoది.

కళ్ళు కనిపించని అతని తల్లి కూడా చాలా సంతోషించింది తన కొడుకు అదృష్టానికి మురిసి పోయింది కూడాబాగా ఆస్తితో పాటు, అందమైన భార్యకూడా వచ్చేసింది మన చంద్రానికి…  

Related Posts