అదే జీవితం కాదు…!!!
మనిషి సృజనకు పరాకాష్టగా
రంగులద్దు కొన్న కరెన్సీ రాజ్యాలేలుతోంది…
మరణంలేనిది మనిషితో సంబంధమై..!!
కదలిన సమయం కారణాలకు రూపమని…
మర్మం తెలుసుకోన్న కర్మజీవుడు త్యాగమై
ఆజన్మాంతాన్ని డబ్బుకై పరుగెత్తిస్తున్నాడు
దక్కించుకోవాలనో దాహం తీర్చుకోవాలనో…
అదే జీవితం కాదు అదొక భాగం మాత్రమే
వయస్సుతో నిమిత్తం లేక శరవేగమై
ఆశకు పుడుతు కోరికలను తడుతూ…
డబ్బుతో ముడేసుకొన్న అనుబంధమై…
బోధపడని పరిస్థితులను మెలిదిప్పుతూ..!!
వెంబడించినా తీరానికి దొరకని ఎండమావని
దొరికినా దాహార్తిని తీర్చలేని సముద్రపు నీరని
తెలుసుకునే లోపలే తెలవారి పోతున్నావు…
మనిషి మనుగడకు అవసరమైనా
ప్రగతి చక్రాన్ని నడిపించే ఇంధనమైనా…
అవసరం కొద్ది వాడుకతో దారి నడుపాలి..!!
అదే లోకమని నీవు శ్వాసలను సలుపుతే…
కొనలేని ఆత్మగౌరవాలు వెర్రి ప్రదర్శనలే…
విరుచుకొన్న వర్తమానం పిచ్చి పోకడలే…
డబ్బు తొడిగిన మాయా పాషాన్ని విరిచేసి
నిజానికి నిలువుటద్దమై రేపటిని చూపించు…
డబ్బు కట్టిన కోటలపై విహారమై
అంతు చిక్కని ఆనందం సుడిగుండమై…
పంచభూతాలతో సత్సంబంధాలు లోపమై..!!
సాక్ష్యం చెప్పని శాసనం డబ్బుకు దాసోహమై
ఉడిగిన శక్తులతో ఉట్టికి స్వర్గానికి ఎగరలేక…
నమ్మకాన్ని కళ్ళెదుటే ముంచుకొంటున్నావు…
కనువిప్పైన వేకువలతో ప్రలోభాలకు లొంగక
కొనేవి కొన్నైనా కొనలేనివి ఎన్నోనని తెల్సుకో
పెద్దల మాటలను సద్దిమూటగా విప్పుకో…
దేరంగుల భైరవ