అదొక ప్రపంచం

 

అదొక ప్రపంచం

అసలు డబ్బులతో పనిలేదు.
ఆస్తులు అసలే అక్కరలేదు.
కష్టసుఖాలు అన్నీ ఒకటే.
ఎవరేమన్నారో అక్కరలేదు.
ఏదీ పట్టించుకునే పనే లేదు.
బంధుమితృల ఊసే లేదు.
ఆకలిదప్పుల అరాటం లేదు.
బట్టల గురించి పట్టింపు లేదు.
మంచి- చెడు అన్నీ ఒకటే.
ఏ పాపం పుణ్యం తెలియదు. అదొక విచిత్రమైన ప్రపంచం.
పిచ్చోడని హేళన చేస్తాం కానీ
మామూలు మనుషులకే పిచ్చి.
కొందరికేమో ఆ డబ్బు పిచ్చి.
మరికొందరికి వ్యసనాల పిచ్చి.
చాలా మందికేమో పేరు పిచ్చి.
పిచ్చి పలురకాల ఈ లోకంలో.

అదొక లోకం. అదొక జీవితం.

వెంకట భానుప్రసాద్ చలసాని.

అదొక ప్రపంచం

 

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *