అనగనగా ఒక ఊరిని జమీందారు కుటుంబం పరిపాలిస్తూ ఉండేది.

శీర్షిక:⁠- మన బలహీనత

అనగనగా ఒక ఊరిని జమీందారు కుటుంబం పరిపాలిస్తూ ఉండేది.
ఆ కుటుంబానికి వారుసుడైన ప్రతాప్ వర్మ కొన్ని రోజుల తర్వాత ఆ ఊరి బాధ్యతలు తీసుకోబోతున్నారు.
ప్రతాప్ వర్మ కి పొగడ్తలు అంటే మహా ఇష్టం.
యువరాజా బలహీనత తెలిసిన మంత్రి జమీందారు భవనంలో అన్ని పనులకు తన మనుషులను నియమించాలని అనుకున్నారు.
మంత్రి ఒక అత్యాశ పరుడు. 
పక్క ఊరిలో ఉన్న రాజు అయిన రుద్రసేన ప్రతాప్ వర్మ ఊరిని అక్రమించుకుని పాలించాలని పన్నాగం పన్నుతున్నారు.

కొన్ని రోజులు తర్వాత ప్రతాప్ వర్మ ఊరి బాధ్యతలు చేపట్టారు.
అప్పుడప్పుడు  ప్రతాప్ వర్మ కి వెంటకి అడవికి వెళ్లడం అలవాటు. కానీ ఈసారి ఎవరికి చెప్పకుండా వెంట కోసం అడవికి వెళ్లతాడు.

ఈ విషయం తెలుసుకున్న మంత్రి పక్క ఉరి రాజు అయిన రుద్రసేనకి సందేశం పంపించాడు.
ఉదయమే ప్రతాప్ వర్మ తల్లి అయిన దేవి సులోచన యువరాజా గదికి వెళ్లి చూడగా…

యువరాజా కనిపించకపోవడం వల్ల భవనం మొత్తం వెతికి ప్రయోజనం లేకపోయింది.
అలా రోజులు గడిచే కొద్దీ దేవి సులోచన మనసులో భయం పట్టుకుంది.

ఎవరికి తెలియకుండా దేవి సులోచన మారువేషంలో ఉరి మొత్తం వెతకగా ప్రతాప్ వర్మ అడవికి వెళ్ళాడు అని తెలిసింది.
ప్రతాప్ వర్మని వెతుకుంటూ అడవిలోకి వెళ్ళింది దేవి సులోచన.

రుద్రసేన మనుషులు మారువేషంలో వచ్చి ప్రతాప్ వర్మని బంధించి తీసుకుని వెళ్ళిపోయారు.
తనని పొగడ్తలతో వలలో వేసుకుని బంధించి తీసుకుని వెళ్ళిపోయారు.

ఈ విషయం తన వాళ్ళకి ఎలా సందేశం చేరవేయలో అర్థం కావట్లేదు అని అనుకుని బాధ పడుతున్నాడు ప్రతాప్ వర్మ.
అడవి మొత్తం వెతికినా ప్రతాప్ వర్మ జాడ తెలియకపోవడంతో బాధతో భవనానికి వెళ్ళిపోయింది దేవి సులోచన.
రెండు రోజులు తర్వాత తన కొడుకు అయిన ప్రతాప్ వర్మ చనిపోయారు అని ఊరు మొత్తం తెలిసేలా చెప్పించింది దేవి సులోచన.
“ఇంకా ఈ ఊరిని నేను పాలించలేను పక్క ఊరి రాజు గారికి  ఈ ఊరి బాధ్యతలు అప్పగించాలని అనుకుంటున్నాను” అని మంత్రికి చెప్పారు దేవి సులోచన.
మారు మాట మాట్లాడకుండా ఈ విషయం సందేశం ద్వారా రుద్రసేనకి చేరవేశాడు మంత్రి..
ఆ రాత్రే ఎవరో కొందరు మనుషులు ముసుగులు వేసుకుని రుద్రసేన ఇంటికి దొంగచాటుగా వచ్చి ,
ప్రతాప్ వర్మ , రుద్రసేన లకు తీసుకుని వెళ్లిపోయారు.
తమ ఊరికి తల్లిలాంటి దేవి సులోచన గారు తన కొడుకుని ప్రాణాలతో కాపాడుకుని రుద్రసేనతో సంధి కుదిరించుకున్నారు.
ఇంకా నుండి ఈ రెండు ఊర్లు కలిసి మెలిసి ఉండాలని ఆజ్ఞాపించారు దేవి సులోచన.
నమ్మకునే వాళ్ళని మోసం చేస్తున్న మంత్రికి జైలు పాలు చేసింది దేవి సులోచన.
ప్రతాప్ వర్మకి ఉన్న తన బలహీనతే ఆసరాగా తీసుకొని ద్రోహానికి సిద్ధపడ్డ మంత్రి.
ఊరు అందరి సాక్షిగా ప్రతాప్ వర్మకి పట్టాభిషేకం చేసింది దేవి సులోచన.
ఊరి ప్రజలందరూ దేవి సులోచనకు నీరాజనాలు పలికారు.
మన బలహీనతే ఇతరులు బలంగా చేసుకొని నాశనం చేయాలనుకుంటాను.

మాధవి కాళ్ల

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *