అనాదిగా ఆడవాళ్లపై అత్యాచారాలు, అమాయకమైన బార్యలపై భర్తల సాధింపులు జరుగుతూనే ఉన్నాయి

ప్రతిఘటన..

అనాదిగా ఆడవాళ్లపై అత్యాచారాలు, అమాయకమైన బార్యలపై భర్తల సాధింపులు జరుగుతూనే ఉన్నాయి..
బాల్య వివాహాలు అందుకు కొంత కారణం కావచ్చు..
అలాంటివే కాక సతీ సహగమనం కూడా జరిగేది ఆకాలంలో!
దానికి కూడా బాల్యవివాహమే కారణం అయి ఉంటది..

ఇవన్నీ ఆపే వాళ్లే లేకపోయారు కొంత కాలానికి బాల గంగాధర్ తిలక్, వీరేశలింగం పంతులు లాంటి దేశ నాయకులు నడుం కట్టి అలాంటివన్నీ ఆపించారు..
అయినా ఆడవాళ్లకు అన్యాయాలే ఎక్కువ జరిగాయి..

దాంతో భర్తల దగ్గర బార్యలను ఎదురు తిరగండి ప్రతిఘటించండి అని ఎంతో మంది నాయకులు హెచ్చరించగా ఎన్నో చట్టాలను అందుబాటులోకి తెచ్చాక ఆడవాళ్లకు కొంత స్వేఛ్చ లభించింది..
చాలా మంది ప్రతిఘటించడం నేర్చుకున్నారు..

గాంధీజీ కలలు కన్న స్వాతంత్రం వచ్చిందనుకుంటే ఆ స్వేఛ్చ కాస్త ఎక్కువై పోయి ఇప్పుడంతా జంబలకిడి పంబగా మారుతుందిఏంటో ఈ కాలం?

అంతా ప్రతిఘటనల కాలమే అయింది మరి..
నిజమా? కాదా?

ఉమాదేవి ఎర్రం

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *