అనాధ
అమ్మ లేని వాల్లంతా అనాధలే
అమ్మ ఉన్న వాల్లంతా అధృష్టవంతులు
పసితనంలోనే అమ్మను కోల్పేతే
వాల్లకు నరకమే కనపడుతుంది
దేవుడు ఈ బంధాలు, అనుబంధాలు
ఎందుకు పెడతాడో కానీ ఈ సృష్టి లో
ప్రతి జీవికీ కావలసింది అమ్మనే!
అమ్మ ఉంటే ఆకలి తెలియదు అమ్మ
ఉంటే బిడ్డకు ప్రపంచమే గెలిచిన
అనుభూతి! అమ్మ తోడుగా ఉంటే
లోకాన్నే జయించవచ్చనే ధీమా!గర్వం కూడా!
అమ్మ ఒక అధ్బుతం! అమ్మ ఒక అమృతం!
అమ్మ ఒక అమెాఘం!కావాలి అందరికీ
అమ్మ అనే వరం! ఉన్న వాల్లకు తెలియడం
లేదు! లేని వాల్లకు దొరకడం లేదు అమ్మ ప్రేమ!
దయచేసి అమ్మ ఉన్నవాల్లు అమ్మలను అనాధ
లను చేయకండి! ఉన్నప్పుడే వాల్లను సంతోష
పెట్టండి!
ఉమాదేవి ఎర్రం