అనుకోకుండా ఒక రోజు.
ఆరోజు ఆదివారం. ఎప్పటిలాగా కాకుండా అందరం ఎనిమిది గంటలకు లేచాము. కానీ మా నాన్న అంతకుముందే లేచి బయటకు వెళ్ళాడు అంట మా అమ్మ తర్వాత చెప్పింది. ఆదివారం కూడా పొద్దున్నే వెళ్లిపోయాడా అని ఆలోచిస్తూ అలా డల్ గా కూర్చున్న నాకు నాన్న రావడం కనిపించింది. అలా నాన్న రావడం చూసిన నేను మా అక్క త్వర త్వరగా వెళ్లి నాన్న చెంత చేరాము. మా అక్క నాన్నతో, “ఏమైంది నాన్న ఈరోజు ఆదివారం కదా మాతో సమయం గడిపడకుండా ఎక్కడికి వెళ్లావు?” అని అడిగింది ఇంతలో మా అమ్మ వస్తు నాన్న చేతిలో ఉన్న బ్యాగు తీసుకుని కిచెన్ లోకి వెళ్ళింది. అప్పుడే నాన్న మాతో,”మీ అమ్మ వెనకాల వెళ్లి చూడండి రా మీకే అర్థమవుతుంది” అన్నాడు మేమిద్దరం ఎంతో ఆత్రుతతో అమ్మ వెనకాల వెళ్లి చూశాము. అప్పుడు మొదటిసారి చూసాము ఆ నల్లని చాపని. అయితే మేము గత కొన్ని రోజులుగా చాపా తినాలని ఉంది చాప అంటే ఎలా ఉంటుంది అని నాన్నని విసిగిస్తూ ఉన్నాము చివరికి ఆదివారం అంటే ఈరోజు తెచ్చాడు నాన్న. అయితే అమ్మ ఆ చేపని అలా కడుగుతూ ఉంటే ఆ చాప ఎగరడం చూసి మాకు చాలా భయం వేసింది. ఆ చాప ఎలా ఎగురుతూ ఉంటే మేము అలా తప్పించుకుంటూ ఉన్నాము. మా వెనక నుండి నాన్న మమ్మల్ని చూసి చాలా నవ్వాడు. తర్వాత అమ్మ వంట స్టార్ట్ చేసింది. ఉప్పు కారం పసుపు ఇంకా ఏవేవో పొడులు వేసి బాగా కలిపి కూర చేస్తుంది. ఇంతలో మేమిద్దరం ఆడుకోసాగాము. పొయ్యిమీద చాప ఉడుకుతుంటే మాకు కమ్మటి వాసన వచ్చింది. ఈరోజు ఎలా అయినా సరే ఓ పట్టు పట్టాల్సిందే అని ఇద్దరము అనుకుందాం. ఇంతలో నాన్న మమ్మల్ని పిలిచి వంట అయింది తిందాము రండి అన్నాడు. అందరము గిన్నెలు, కంచాలు నీళ్లు అన్ని పెట్టుకొని కూర్చున్నాము. సరిగ్గా అప్పుడే తలుపును ఎవరో గట్టిగా బాధరు. ఎవరా అని అనుకున్నాము అమ్మ వెళ్లి గడియ తీసి చూసింది అయితే వాళ్లు మా దగ్గర బంధువులట తిండి పెట్టడం మానేసి వాళ్లని లోపలికి పిలిచి కూర్చోబెట్టి మాట్లాడ సాగారు ఇద్దరు. నాకు మా అక్కకు చాలా కోపం వచ్చింది. అమ్మ నాన్న మా ఇద్దరినీ గమనించి బయటకు వెళ్లి కొద్దిసేపు ఆడుకొని రండి అని పంపించారు. సరేలే అని మేము కాసేపు వెళ్లి ఆడుకుని వచ్చాము. ఇంతలో ఆ దగ్గర చుట్టాలు వెళ్ళిపోయారు. సరే అని మేము వెళ్లి అమ్మ బాగా ఆకలిగా ఉంది అన్నం పెట్టమ్మా అని అడిగాను. మా అమ్మానాన్నలు మమ్మల్ని చూస్తూ అది ఇంతకుముందే చాపల పులుసు అయిపోయిందమ్మా అని చెప్పారు. మేమిద్దరం ఆశ్చర్యపోయాము. అలా ఎలా అవుతుందమ్మా మేము ఇంకా తినలేదు కదా ఎలా అయిపోతుందమ్మా…. కొంపదీసి అని అన్నాము…. మా అమ్మ వాళ్లు మనకి బాగా కావాల్సిన వాళ్ళు రా వాళ్ళకి ఆకలి అవుతుంది అంటే వాళ్లకే వడ్డించాను. అని బుజ్జగిస్తూ చెప్పింది. మా ఇద్దరికీ సర్రున కోపం వచ్చింది. వెంటనే పరుగున బయటకు వెళ్లి రాయి తీసుకుని వాళ్లకోసం చూశాం కానీ వాళ్ళు లేరు మాకు భయపడి పారిపోయినట్టున్నారు…. మా ఇద్దరినీ చూసి మా నాన్న మా వెనకాలే వచ్చాడు.. తను వచ్చి మాతో మళ్లీ ఎప్పుడైనా తెచ్చుకుందాం లేరా దీనికే ఇలా అయిపోతే ఎలా? అయినా మీ అమ్మ చేపల పులుసు బాగా చేయలేదంట అలాంటి బాగాలేని వంటని మీకు ఎలా పెడతారు చెప్పు… అని నాన్న బుజ్జగిస్తూ లోపలికి తీసుకెళ్లి పచ్చని మెతుకులతో మా కడుపుని నింపాడు. అయితే ఈ విషయం నాకు ఇప్పుడు నేను మా నాన్నకి చాపలో ముల్లులు తీసి ఇస్తూ ఉంటే గుర్తుకు వచ్చింది. అనుకోకుండా ఒక రోజు అలా జరిగింది. మొత్తానికి చిన్నప్పటి రోజులు గుర్తుకు వచ్చాయి. శుభరాత్రి.
కే. శారదా దేవి.