అనుకోని అతిధి

మాకు పెళ్ళైన కొత్తలో జరిగిన విషయాన్ని తలుచుకుంటే ఇప్పటికి నవ్వొస్తుంది. నాకు సుజాతకు పెళ్ళై 20 ఏళ్ళు అవుతున్న విషయాన్ని తలుచుకున్నప్పుడల్లా మాకు నవ్వుతో పాటు మా తెలివి తక్కువ తనం కూడా గుర్తొస్తుంది.

అది గుర్తు చేస్తూ అప్పుడప్పుడు నన్ను ఆటపట్టిస్తుంటుంది సుజాత. నేను కూడా తనని మీ బాబాయ్ గారు అంటూ ఆటపట్టిస్తూ ఉంటాను సరదాగా.

ఇంతకీ మీకు అసలు విషయం చెప్పకుండా నస ఏంటి అని అనుకుంటున్నారా….. చెప్తాను, చెప్తాను అంత తొందర పడితే ఎలా…..!

అవి మాకు పెళ్ళైన కొత్త రోజులు. టెలీఫోన్ లు ఎవరో ఒకరి ఇంట్లో ఉండేవి. మా పెళ్లికి అందరి బందువులు వచ్చారు. కానీ, మా మామగారి వేలు విడిచిన చిననాన్న కొడుకు అంటే మా మామ గారికి తమ్ముడు.  

సుజాతకు బాబాయ్ అయిన అతను మాత్రం ఏవో కారణాల వల్ల రాలేక పోయాడు. అది గుర్తొచ్చి మా మామగారు చాలా బాధపడ్డారు. తర్వాత మేము కాపురం పెట్టడానికి వెళ్తున్న సమయంలో మా మామగారు నన్ను ప్రత్యేకంగా పిలిచి బాబు,

మా తమ్ముడు మీ పెళ్లి చూడలేక పోయాడు. అతనికి మీ అడ్రెస్ ని తెలుపుతూ ఉత్తరం రాసాను. అతను క్షణంలోనైనా మిమ్మల్ని చూడడానికి రావొచ్చు.

అతన్ని కాస్త లోటు రాకుండా చూసుకో నాయనా. అసలే వాడికి కోపం,ఆకలి ఎక్కువ. అని పిల్లని అప్పగిస్తూ చెప్పే మాటలు  వదిలేసి   మాటలు  చెప్పాడు.

దాన్ని బట్టి అర్థమైంది తన తమ్ముడంటే ఎంత ప్రేమనో అని అర్ధమైంది నాకు. అలా మా సంసారం మొదలైంది పట్నంలో……..

హాయిగా  సాగిపోతున్న కూడా  ఎక్కడో  అతను  ఎప్పుడు  ఊడిపడతాడో  అని  భయం  కూడా  ఉంది.

అలాంటి ఒక దుర్దినాన ఆఫీస్ నుంచి సైకిల్ మీద వస్తున్న నాకు ఒక పెద్ద మనిషి ఎదో కాగితాన్ని చేతిలో పట్టుకొని అటు ఇటు తిరుగుతూ కనిపించాడు మా వీధిలో. నాకు ఒక్క క్షణం భయం వేసింది.  

వెంటనే  దగ్గరగా  వెళ్లి ఎవరు కావాలండి అని  నేను  అడిగాను, అతను నన్ను ఎగాదిగా  చూస్తూ  మా చెలపాయ్ అడ్రెస్సు  ఇచ్చి  చచ్చాడు.  ఇదేమో  ఎంతకీ  దొరికి  చావట్లేదు.

ఏమిటో పట్నం ఇంటి నంబర్లు అంత గందరగోళం. అక్కడికి స్టేషన్ కి వాడి అల్లున్ని రమ్మని ఒక కార్డ్ ముక్క రాసి పడెయిరా అంటే  వినలేదు  వెధవ  ఖాన  అంటూ చిర్రు బుర్రు లాడాడు.

నాకు అతని కోపం, మాట తీరు చూసి అతనే మా మామగారు చెప్పిన తమ్ముడు గారు అయ్యుంటారని అర్ధం అయ్యింది. మా  మామగారి  పేరు  కూడా  చెప్తున్నాడు  గా  పైగా  తిడుతున్నాడు.

అని అనుకుని అతని చేతిలో ఉన్న కాగితం తీసుకొని చూసాను. అది మా ఇంటి oబరే. దాంతో నాకు రూఢిగా అర్ధమయ్యింది. అతనే మా సుజాత బాబాయ్ గారని.

దాంతో అతని కళ్ల మీద పడిపోతు మామయ్య గారు, నేనండీ మీరు వెతికే అల్లున్ని, అంటూ నమస్కరించాను. దానికతను, హరి భడవా  నువ్వేనా    వేధవ వి అంటూ నన్ను లేవదీసాడు.

తర్వాత అతని పెట్టె, వస్తువుల్ని నా సైకిల్ మీద పెట్టుకుని ఇంటికి తీసుకువెళ్లి సుజాతకు పరిచయం చేసాను. ఎందుకంటే సుజాతకు కుడా అతను తెలియదు చిన్నప్పుడు చూసింది.

ఇక అప్పటినుంచి నాలుగు రోజులు ఆఫీస్ కు సెలవు పెట్టి మరి ఆయనికి పట్నంలో ఉన్న వింతలు,విశేషాలు చూపించాను.

ఆయన ఆడిగినవన్ని  వంట గదిలోంచి బయటకి రాకుండ ఆడిగిందల్లా చేసి పెట్టడం తో సరిపోయింది సుజాతకు. నా పర్సు కూడా కాళీ అవ్వబోతుంది.

రోజు మధ్యాహ్నం భోజనము చేసి బాదం చెట్టుకింద కూర్చున్న నా దగ్గరికి ఒక ఇద్దరు వ్యక్తులు వచ్చారు, వచ్చి జేబులోనుండి ఒక ఫోటోని తీస్తూ ఇతన్ని ఎక్కడైనా చూసారా అని అడిగారు, నేను ఫోటోని చూసి బిత్తరపోయాను.

ఇతన్ని చూడటం ఏంటి అతను మా మామయ్య గారు కదా అని అన్నాను అమాయకంగా. మీ మమయ్యగారు ఏంటండి బాబు అతను మా నాన్నగారు.

మధ్యే మా అమ్మ చనిపోవడంతో మతి తప్పి అందరిని అడ్రెస్ అడుగుతూ తిరుగుతున్నారు, అంటూ చావు కబురు చల్లగా చెప్పారు.

దాంతో గుండె ఆగినంత పనైంది. అయితే ఇతను మా మమ్మగారు కాడా అని అడిగాను అయోమయంగా….

అయితే మీ ఇంట్లో ఉన్నారన్నమాట. మీ ఇంటి నెంబర్ మా ఇంటి నెంబర్ ఒకటే అవ్వడంతో మీరు మా నాన్నగారిని మీ మామగారు అనుకున్నారు.

అంటూ చెప్పి మా నాన్నగారిని మాకు అప్పగిస్తారా అని అడిగారు ఎంతో మర్యాదగా. నేను వారిని తీసుకొని లోపలికి  వెళ్లాను ..

మంచం మీద  పడుకొని  కూనిరాగాలు  తీస్తున్న మా మామగారు అని నేను అనుకున్న   వ్యక్తి  వారిని చూసి, పెరటి నుండి  పారిపోవడానికి  ప్రయత్నం  చేశారు. 

కానీ వాళ్ళు అతన్ని రెక్కలు విరిచి పట్టుకున్నారు. హడావుడికి లోపలి నుంచి వచ్చిన సుజాత ఏమిటండీ ఎవరు వీళ్ళు అని అడిగింది. 

నేను రెండు ముక్కల్లో విషయం చెప్పాను  తర్వాత   బాబాయ్  గారు  అదే  మా మామగారు  సుజాత  వైపు చూస్తూ వారిని  తప్పిoచుకొని  సుజాత  దగ్గరగా  వచ్చి ఆమె తలమీద చెయ్యి పెడుతూ,

నా కడుపు నింపావు తల్లి నిండు నూరేళ్ళు నా అయిష్షు కూడా పోసుకొని జీవించు అని దీవించి నా వైపు చూసి ఏమి మాట్లాడకుండా వడివడిగా బయటకి నడిచాడు.

అతనితో పాటు వాళ్ళు కూడా వెళ్లిపోయారు. మేము షాక్ నుంచి కొలుకోవడానికి చాలా సమయమే పట్టింది. కానీ ఎక్కడో తృప్తి. 

ముసలి తనాన తోడు లేని ఆయనకి తినాలన్న కోరికని   కనీసం మేమైనా  తీర్చమని  ఒక తృప్తి  మాకు కలిగింది. ఇక  మా మామగారి తమ్ముడు గారు మా ఇంటికి రానేలేదు.. 

ఇప్పటి వరకు మేమే వెళ్ళమనుకోండి  అది  వేరే  విషయం.  ఇదండీ  మా  అనుకోని అతిధి కథ…….మరి మీకు ఇలాగె ఏమైనా మధుర అనుభూతులు ఉంటె మాతో పంచుకోండే..

Related Posts