అనుకోని మలుపు (Unexpected Good Turn1)

అనుకోని మలుపు

అనుకోని మలుపు
అనుకోని మలుపు

మా నాన్నగారు చనిపోవడంతో మమ్మల్ని ఎవరు పట్టించుకోకపోవడం తో బ్రతకడానికో పట్నం వలస వచ్చాము

అయితే అప్పటి వరకు పల్లెలో  బ్రతికిన మాకు పట్నంలో అంత కొత్తగాను వింతగాను ఉండేది.

ఎక్కడ ఎం ఉంటుందో తెలియదు.

కొంతలో కొంత నయం ఏమిటంటే మా నాన్నగారు అప్పటికే ఒక ప్లాట్ కొని పెట్టడం

అయితే  మేము అందులో ఉంటూ ఉన్నదేదో తినేవాళ్ళం మా సోదరులు ఇద్దరు ఉద్యోగ ప్రయత్నం లో ఉన్నారు.

ఇక నేను నా కోడుకు తోనూ తల్లితోనూ ఉండేదాన్ని అది వాడికి స్కూల్ లో వేయాల్సిన వయసు రావడం వల్ల ఎక్కడ వేయాలో ఎలా మాట్లాడాలి అర్థం కాలేదు

దాంతో ఎం చేయాలి అని అనుకుంటూ తలలు పట్టుకున్నాం .

మేము చదువుకున్నా టీచర్ గా పని చేసాను కానీ అది పల్లెలో పట్నం అంటేనే ఒక రకమైన భయం ఎవరితో మాట్లాడితే ఏమంటారో ఎలా రిసీవ్ చేసుకుంటారో

ఇంగ్లీష్ రాదు కాబట్టి  పల్లెలో మాట్లాడిన బాష తో ఇక్కడ మాట్లాడితే ఎక్కిరిస్తారు ఏమో అనే ఒక విధమైన సంశయం తో మా పరిధిలో మేమే ఉండే వాళ్ళం .

ఎవరితోనూ ఎక్కువ మాట్లాడే వాళ్ళం కాదు ఎప్పుడూ ఇంట్లోనే ఉండేవాళ్ళం

మా కట్టు బొట్టును చూసి, వారితో పాటూ మమల్ని కంపేర్  చేసుకుని  ఒక ఇంఫియారిటీ కాంప్లెక్స్ తో ఉండేవాళ్ళం.

అందుకు కారణం కొన్నిచోట్ల అంటే కూరగాయల షాప్స్ లోనూ, కిరణా షాప్ లోనూ ఇలాంటి  ఆల్రెడీ మా మాటలు చూసి కొందరు వెక్కింరించారు

కానీ ఇప్పుడు  పరిస్థితి వేరు చదువు ముచ్చట కాబట్టి ఎలా అని అనుకుంటున్న సమయంలో  మా తమ్ముడు స్నేహితుడు నేను మాట్లాడతాను  అని ముందుకు వచ్చాడు.

మా తమ్ముళ్ళు భయపడ్డారు మాట్లడడానికి కాబట్టి అతను తోడుగా వస్తాను అన్నాడు. డబ్బున్నా, సంపద ఉన్నా చేసేవాళ్ళు, మాట్లాడే వాళ్ళు కావాలి అని ఊరికే అనలేదు పెద్దలు  .

దానికి నేను చాలా సంతోషించి ఒప్పుకున్నాం దాంతో ఒక మంచిరోజు చూసుకుని నేను అతను కలిసి దగ్గరలో ఉన్న ఒక ప్రైవేట్ స్కూల్ కి  మా బాబు ని తీసుకుని వెళ్లాం.

అతను అక్కడ మాట్లాడి బాబుని జాయిన్ చేసి మూడు వేల ఫీజు కట్టాం, అయితే అక్కడే నా జీవితం పెద్ద మలుపు తిరిగింది.

అలా తిరుగుతుంది అని నేను అస్సలు అనుకోలేదు. ఇంతకు అదేంటంటే అంతవరకు అతను నాకు చదువు రాదని అనుకున్నాడు అంట

కానీ మాటల్లో నేను చదువుకున్నది టీచర్ గా ఉద్యోగం చేసింది చెప్పడంతో

అతను ఆశ్చర్య పోయి మరి మీ తెలివిని మీ అనుభవాన్ని ఇలా ఎందుకు వృధా చేస్తున్నారు.

అనుకోని మలుపు

 

మీరు ఉద్యోగం చేస్తూ మీ బాబు నీ చదివించండి మీరు ఇలా టైం వృధా చేయడం ఏం బాగాలేదు

అసలు మీరు ఇక్కడికి వచ్చి ఎన్ని రోజులు అయ్యింది అన్నాడు .

దానికి నేను ఒక ఆరునెలలు అయ్యింది కావచ్చు అని అన్నాను.  ఇక్కడ కూడా జాబ్ చేయవచ్చు కదా అని

మీ ప్లేస్ లో వేరే ఎవరు ఉన్నా ఈ పాటికి ఉద్యోగం చేస్తూ అందరితో పరిచయాలు పెంచుకుని గలగలా మాట్లాడుతూ ఉండేవారు.

ఎందరినో స్నేహితులను చేసుకునేవారు మీరు ఇలా ఇంట్లోనే ఉంటే ఎలా ఇన్నాళ్లు టీచర్ గా పని చేసారు ఆ అనుభవం తో ఇక్కడ కూడా చేయండి అన్నాడు.

కానీ మేము చాలా భయపడ్డం ఎందుకంటే అప్పటివరకు తండ్రి చాటు బిడ్డలుగా బ్రతికిన మేము ఒక్కసారిగా ఒంటరిగా ఈ ప్రపంచం లో బ్రతకడానికి భయపడి దాక్కున్నాం.

అవును నిజమే దాక్కున్నాం ఎందుకంటే అమ్మ , నేను వయస్సులో ఉన్నవాళ్లమే, ఇద్దరికీ భర్త లేరు. ఇవి అనుభవించిన వారికీ మాత్రమే తెలుస్తుంది.

ఆ ఏమవుతుంది అందరూ ఉండడం లేదా అని అంటారేమో కానీ చుట్టాలు మాటలతో పీక్కు తింటారని అనుభవిoచిన మాకే తెలుసు.

వాళ్ళెం పెట్టక పోయినా, పోషించక పోయినా మాటలు విసరడం లో సిద్ద హస్తులు.

సో ఎవరితో మాట్లాడితే ఏమంటారో చుట్టాల ముందు పరువు పోగొట్టుకోవద్దు ,

ఏ చుట్టాలు అండగా లేకున్నా రాళ్ళూ వేయడానికి మాత్రం వస్తారు.

అప్పటికే మాదేమైనా తప్పు దొరుకుతుందేమో అని చూసే వాళ్ళు గోతికాడ నక్కల్లా ఉన్నారు

కొందరు ఎదురుచూస్తూ అందుకే మేము భయపడి ఎక్కడికి వెళ్ళే వాళ్ళం, వచ్చేవాళ్ళం కాదు .

అతను ఆ మాట చెప్పిన తర్వాత నాలో ఆశ కలిగింది కానీ

ఈ విషయాలు అన్ని అతనికి చెప్తే అతను కొట్టి పారేసి మీరిలా భయపడితే లాభం లేదు మీ కొడుక్కోసం పని చేయండి.

మీరేం తప్పు చేయడం లేదు కదా మీకు వచ్చిన విద్యనూ చెప్తున్నారు అని ,

మీ వాళ్ళకు బరువు కాకుండా ఉంటారు అని ఎంతో నచ్చ చెప్పాడు . దాంతో సరే అనక తప్పలేదు నాకు.

కానీ నాకు నమ్మకం లేదు ఎందుకంటే ఇక్కడి స్కూల్ లో ఇంగ్లీష్ లో మాట్లాడాలి అని అంటారు కదా అని అడిగా

దానికి అతను అవును కానీ మీరు సబ్జెక్టు టీచర్ కదా ఏ సమస్య ఉండదు అని ధైర్యం చెప్పాడు.

బాబును వేసిన స్కూల్ లొనే నా గురించి చెప్పి రెజ్యూమ్ అంటారు అంట అది రాసి ఇచ్చాడు.

కానీ నాకు వస్తుందనే నమ్మకం లేకపోయింది.

ఒకసారి ప్రయత్నిద్దాం అని అతనే ధైర్యం చెప్పడంతో సరే అని మా బాబుని స్కూల్ లో  వేసి

వాడికి ఫీజు కట్టి వదల్లేక వదల్లేక వదిలి  ఇంటికి  తిరిగి వచ్చే  క్రమంలో ఒక ఆశ్చర్య కరమైన సంఘటన జరిగింది.

అదేంటంటే స్కూల్ నుండి ఫోన్ వచ్చింది ఇంటర్వ్యూ కి రమ్మని నేను అసలు నమ్మలేకపోయాను. అతనికి థాంక్స్   చెప్పి వెంటనే వెళ్ళాను .

అయితే వాళ్ళు నన్ను అడిగిన ప్రశ్నలు చాలా తేలికైనవి కావడంతో వెంటనే చెప్పడం అందులో సెలెక్ట్ అవ్వడం జరిగిపోయింది.

అదే స్కూల్ లో నేను దాదాపు అయిదేళ్ళు పని చేసాను నా కొడుకుని చదివించాను.

కొన్ని ఏళ్ళ తర్వాత ఆ స్కూల్ నీ అమ్మేయడం జరిగినా నేను అందులోనే పని చేసాను ఆ స్కూల్ తో నా అనుబంధం విడదియలేనిదిగా మారింది.

కానీ పోటీ పెరగడంతో పిల్లలు రాకపోవడం తో ఆ స్కూల్ నీ మొత్తానికి తీసేశారు.

ఇప్పుడు అక్కడ పెద్ద బిల్డింగ్ కట్టారు దాన్ని చూసినప్పుడల్లా అతేనే గుర్తుకు వస్తాడు

అలా అతని పరిచయం నా జీవితంలో అనుకోని  మలుపుకు కారణం అయ్యింది..

 

(మరొక కథ చదవడానికి కింద ఉన్న లింక్ నీ క్లిక్ చెయ్యండి

https://aksharalipi.com/2021/03/16/%e0%b0%a8%e0%b1%81%e0%b0%b5%e0%b1%8d%e0%b0%b5%e0%b1%87-%e0%b0%a8%e0%b0%be-%e0%b0%b2%e0%b1%8b%e0%b0%95%e0%b0%82/ )

Related Posts

1 Comment

Comments are closed.