అనుభవం Experience 5

అనుభవం

అనుభవం
అనుభవం

1996 లో నేను పదవ తరగతి పరీక్షలు రాసి ఖాళీగా ఉన్న సమయంలో మా నాన్నగారి కొలీగ్ ఒకరు మేము కాలేజీ పెట్టాము అందులో మి అమ్మాయిని చేరిస్తే ఆమెతో పాటు ఇంకొందరు చేరుతారు దాని వల్ల మి అమ్మాయి ఫీజు తగ్గిస్తం అని ప్రపోజల్ తెచ్చారు.

దాంతో మా నాన్నగారి నన్ను అక్కడ జాయిన్ చేశారు. పాపం నా మిద మా నాన్నగారు చాలా నమ్మకం తో ఏ గ్రూప్ తీసుకుంటావు అని అంటే నేను డాక్టర్ కావాలని బై పిసి తీసుకున్నా గొప్పలు పోయి ఇక నన్ను చూసి అందరూ జాయిన్ అయ్యారు.. మన మీద అందరికీ అంత నమ్మకం మరి….

ఇక పాపం మా అమ్మగారు కూడా కూతురు డాక్టర్ అవ్వబోతుంది అని చాలా సంతోషించారు. అయితే కాలేజీ కి వెళ్ళాలి అంటే బస్ లోనే వెళ్లాలి మా ఊరికి ఆ ఊరికి 12-25 కిలోమీటర్లు సరిగ్గా తెలియదు లేండి (ఇప్పటికీ కూడా)  దాంతో బస్ పాస్ తీసుకున్నాం.

అందరం బుక్స్, నోట్స్ అన్ని రెడీ గ పెట్టుకుని కానీ మేము కాలేజీలో చేరాను కానీ చేరిన కొన్ని రోజులకు ఆ కాలేజీ వాళ్ళు కొన్ని కారణాల వల్ల దాన్ని ఇంకొక కాలేజీ కి అమ్మేశారు. దాని వల్ల మేము కొత్తగా వెళ్లాల్సిన కాలేజీకి వెళ్ళేవాళ్ళం కాలేజీ వేరైనా చదవడం ఒకటే కదా అనే ఉద్దేశ్యంతో అలా చాలా సంతోషంగా, హ్యాపీగా గా (రెండూ ఒకటేనా), నవ్వుతూ వెళ్లే వాళ్ళం.

అయితే నా స్నేహితురాళ్ళు మాత్రం కొన్ని రోజులకు వాళ్ళ గ్రూప్స్ మార్చుకుని వేరే దాంట్లోకి జంప్ అయ్యారు మనం మాత్రం అదే గ్రూప్ లో ఉండిపోయాo.

అయితే మాకు అన్ని క్లాస్ లు సెపరేట్ గా అయినా తెలుగు మత్రం కంబైన్డ్ గా చెప్పేవాళ్ళు. అంటే నాలుగు గ్రూప్ లకు కలిపే చెప్పేవాళ్ళు. అప్పుడు సి.ఈ.సి గ్రూప్ వాళ్ళు కూడా వచ్చేవాళ్ళు అందులో నాకు చూడగానే ఒక అబ్బాయి చాలా బాగా అనిపించాడు. అతనికి అట్రాక్ట్ అయ్యాను అని చెప్పొచ్చు.. అయితే అప్పటిది అంతా ఆకర్షణ అని కొన్నెళ్లకు తెలిసింది.

అతను మామూలు హైట్ తో, హైర్ స్టైల్ ముందుకు పడుతూ ఉండగా కళ్ళద్దాలతో ఉండేవాడు. మూతి మాత్రం బొక్కి మూతి ఉండేది (అంటే ఏంటని అడగకండి) మనం పెద్ద అందంగా ఉండం కదా ఏదో యావరేజిగా ఉంటాం కానీ ఆ వయస్సులో మనమీద మనకు గొప్ప అందగత్తెల ము అనే ఫీలింగ్ ఉంటుంది కదా. (విషయం వేరే టాపిక్ లోకి వెళ్తుంది…)

ఇక అతన్ని చూడగానే అదొక లాంటి ఫీలింగ్ వచ్చింది నాకు. దాంతో నేను సమయం దొరికినప్పుడల్లా అతన్ని చూస్తూ ఉండేదాన్ని అతను అందగాన్ని అని ఫీల్ అవుతూ ఉండేవాడు. అతను ఎక్కువగా అమ్మాయిలతో మాట్లాడేవాడు.

కాలేజీ నుండి బస్ ఎక్కడానికి వెళ్లాలి అంటే రెండు కిలోమీటరు నడవాలి మధ్యలో బస్ ను ఆపేవాళ్ళు కాదు అలాగే అప్పుడు బస్ లు చాలా తక్కువ. ఇక అతన్ని అలా చాలా రోజులు చూసిన తర్వాత ఒక రోజు నాకు కాలేజీ నుండి ప్రాక్టికల్స్ ఉండడం తో లేట్ అయ్యింది గబగబా ఇంటికి వెళ్ళాలని బస్ స్టాండ్ కు వెళ్తున్నాను,  అయితే నా ముందు అతను నడవడం చాలాసేపటి వరకు నేను గమనించలేదు వెళ్ళాలనే తొందరలో… గమనించిన తర్వాత నాకు వణుకు మొదలైంది.

అనుభవం

అనుభవం
అనుభవం

నచ్చిన వ్యక్తి పక్కన ఉంటే అలాగే అవుతుoది అనుకుంటా. ఇక నేను చుట్టూ చూశాను నా పక్కన నా స్నేహితులు కూడా లేరు దాంతో ఇక ధైర్యం చేసి అతని ముందుకు వెళ్ళాలిఅనుకున్నా…

కానీ ముందుకు వెళ్ళడానికి నాకు ధైర్యం చాల లేదు. అప్పుడు మనకు అంత సీన్ లేదు కానీ మరీ మళ్ళి ఇలాంటి అవకాశం దొరుకుతుందో లేదో అని అనుకుని మెల్లగా పిలిచాను తన పేరు పెట్టి…

విచిత్రం నా గొంతు నాకే వినిపించలేదు అని అనిపించి ఇక కాస్త గొంతు పెంచి కాస్త గట్టిగా పిలిచాను దాంతో అతను వెనక్కి తిరిగాడు. నాకు కాళ్ళు, చేతులు ఆడడం లేదు. పిలిచాను కానీ ఏం మాట్లాడాలో అర్ధం కాలేదు. కానీ, అవకాశం దొరకదని నిజం అర్ధం అయ్యి దగ్గరగా వెళ్లాను గొంతు సవరించుకుని మీ ఊర్లో మా చుట్టాలు ఉన్నారు. వాళ్ళు తెలుసా నీకు అని అడిగా అవునా అని వాళ్ళ గురించి కాసేపు మాట్లాడిన తర్వాత నేను  తనతో నీకో మాట చెప్పాలి అన్నాను, ఏంటి అని అన్నాడు తను.

అది మీ కులం మా కులం ఒకటే అన్నాను. దానికి అయితే అన్నాడు. మనం పెళ్ళి చేసుకుందామా అని నేను అడిగాను (పిచ్చితనం ఏంటంటే కులాలు ఒకటే కాబట్టి మా నాన్న ఒప్పుకుంటాడు అని అలా ఆలోచించాను నేను పెద్ద హీరొయిన్ అనుకుంటూ…) ఇక నేను అలా అనగానే ఏంటి పెళ్ళా నిన్నా అన్నాడు.

అవును నువ్వంటే నాకు ఇష్టం అని చెప్పాను అదే మొదటిసారి నేనుగా ఒక వ్యక్తికి ఇష్టపడుతున్నా అని చెప్పడం. ఇక అది విని అతను రెండు నిమిషాలు మౌనంగా ఉన్నాడు. ఆ రెండు నిమిషాలు నాకు యుగాలుగా అనిపించింది. ఏం చెప్తాడా అని కానీ అతను పెళ్ళి కాదు గాని ముందు మాట్లాడుకుందాం అలా తుప్పల్లోకి వెళ్దామా అని అడిగాడు.

నేను అక్కడికి ఎందుకు ఇక్కడే చెప్పు అన్నాను (ఇది నిజంగా నాకు అప్పుడు తెలియదు) కాదు పద పోదాం అన్నాడు చేయి పట్టుకుంటూ… లేదు అని చేయి విడిపించుకున్నా నన్ను ఎవరైనా చూస్తారేమో అని..

ఇంతలోనే ఒక బైక్ మీద ఒక వ్యక్తి అక్కడికి వచ్చాడు. రావడంతోనే ఏంటంట అని అడిగాడు దానికి ఇతను పెళ్ళిట, ఒకటే కులం అంట అన్నాడు నవ్వుతూ మరి అడిగావా అన్నాడు బండి మీదున్న వాడు, హా రాదంట అన్నాడు ఇతను, పెళ్ళా అయితే మా వాడు అన్నట్టుగా తుప్పల్లోకి రా అక్కడ మాట్లాడదాము బండి ఎక్కు అన్నాడు. నేను భయంతో రాను అని వెనక్కి తిరిగాను. వాళ్ళు నవ్వుకుంటూ బండి మీద వెళ్ళిపోయారు.

నా మనసు అంతా ఒకలాంటి బాధ చెప్పలేనoత నరకంగా తయారు అయింది నా పరిస్థితి. నేను ఇష్టపడిన వ్యక్తి వేరే అతని ముందు నన్ను ఇలా అవమానించాడు అని రగిలిపోయింది. బాధ, దుఖంతో మనసు నలిగిపోయింది. అలాగే నడుస్తూ వెళ్తున్న నాకు నా స్నేహితురాళ్ళు కనిపించారు.

దాంతో విషయం మరచిపోవాలని వాళ్ళ దగ్గరగా వెళ్లాను నేను. వాళ్ళు బ్యాంగిల్ స్టోర్ లోకి వెళ్ళారు. టిక్లిల కోసం.

అనుభవం

అనుభవం
అనుభవం

ఇక నేను కూడా వెళ్లి చూస్తుండగా అక్కడికి ఒక ఆంటీ వచ్చి స్టోర్ లో ఉన్న ఆవిడతో ఏదో చెప్తుంది. మేము మా కాలేజి పేరు రావడంతో ఏంటని అడిగితే మీరు కూడా అదే కాలేజినా అని అడిగారు. మేము అవును అని చెప్పాము.

అయితే జాగ్రత్త అమ్మ ఒక అమ్మాయి, అబ్బాయి తుప్పల్లో దొరికితే ఇప్పుడే పొలిసు స్టేషన్ కు తీసుకు వెళ్ళారు అని చెప్పింది. దాంతో నాలో కంగారు మొదలైంది వాడు వీడేనా, వీడు వాడేనా అని అనుకుని నేను వెళ్లనందుకు సంతోషించి అక్కడినుండి గబగబా వెళ్ళి బస్ఎక్కాను. మరి వాడు తుప్పల్లోకి ఎందుకు రమ్మన్నాడు అనే నా సందేహం ఎలా తీర్చుకోవాలో నాకు అర్ధం కాలేదు.

తెల్లారి నేను నా స్నేహితురాలిని అడిగాను. తను ఒక డాక్టర్ గారి అమ్మాయి కాబట్టి అయితే తను మాత్రం కిస్ చేసుకోవడానికి వెళ్తారు అని చెప్పింది. (కొన్నాళ్ళకు నిజం తెలుసుకున్నా లెండి).

ఇక వాడి ప్రవర్తనకు నాకు వాడి మీద అస్యయం వచ్చింది. అలా నేను వెళ్లి ఉంటె నా గురించి అందరూ ఆంటీలా మాట్లాడుకునే వాళ్ళు కదా అయినా వాడు అడగడం లోనే నాలో ఎదో తెలియని కంపరం అనిపించింది. ఇక అతన్ని చూడాలంటేనే కంపరం అనిపిస్తూ ఉండేది. తన వైపు చూడకుండా ఉండాలని తెలుగు క్లాస్ కు వెళ్ళనే లేదు.

ఆ తర్వాత వాడి గురించి పట్టించుకోవడం మానేశాను పరిక్షలు రావడంతో… అయితే ఒక నెల రోజుల తర్వాత వాడు నేను బాత్రూం కు వెళ్లి వస్తున్న సమయం లో అడ్డగించి ఒక లెటర్ చేతిలో పెట్టాడు.

కానీ నేను దాన్ని పారేసి క్లాస్ కు వెళ్లాను, కొన్నాళ్ళ తర్వాత వాడు కాలేజికి రావడం మానేసాడు ఎందుకో నాకు తెలియదు.

ఇది నాకు ఎందుకు గుర్తుకు వచ్చింది అంటే ఒక పద్నాలుగేళ్ళ అమ్మాయిని ఎవడో ప్రేమ రు తో మోసం చేసాడని తెలిసే సరికి అప్పుడు నేను నా కాలేజీలో జరిగిన ఈ సంఘటన గుర్తుకు వచ్చింది.

అప్పుడు అది ప్రేమ అనుకున్నా నేను వాడు పిలవగానే వెళ్తే నా పరిస్థితి ఏమయ్యేదో తలచుకుంటే నాకు ఇప్పటికి భయం వేస్తుంది. అందుకే ఆకర్షణకు , ప్రేమను తేడా తెలియని సమయం లో ఎవర్నీ గుడ్డిగా నమ్మకూడదు.

ఇది నిజంగా నాకు జరిగిన సంఘటన నాకు మా ఊరి పేరు చెప్పడం ఇష్టం లేదు అందుకే నా పేరు, వాడి పేరు మాత్రం చెప్తున్నా ఇది ఒక వేళ అతను చదివితే నాకు రిప్లై రాస్తాడా? వాడు అసలు ఉన్నాడా? లేడా? నేను రాసింది చదువుతాడా? నాకు తెలియదు ఒక వేళ చదివితే ఏంటి పరిస్థితి ??? అనేది మాత్రం తెలియదు, ఇక అతని పేరు సందీప్…. నా పేరు శ్రావ్య….

Related Posts

2 Comments

  1. చాలా అందమైన కథ చెప్పారు. అద్భుతంగా ఉంది. నిజంగా ఇది నిజమైతే తను చదివితే ఇప్పుడు తప్పకుండా సిగ్గు పడతాడు. ఆ పరిస్థితుల్లో, ఆ వయసులో అంత విచక్షణా జ్ఞానం లేకుండా ప్రవర్తించాను కదా అని. లేదా తన మనసులో పశ్చాతాపం లేకపోతే ఇది దొరికితే చంపేయాలని అన్నంత కసిని పెంచుకుంటారు

Comments are closed.