గుడిపాటి, అప్సర్, నేను
ఉస్మానియా A హాస్టల్ గదిలో
రాత్రంతా వాళ్లిద్దరూ కబుర్లు
చెప్పుకుంటుంటే నేను నామమాత్రంగా
వింటూ మధ్యలో
కవిత్వంలో కథ సమ్మిళితంగా
వ్రాయండి మేష్టారు అన్నాను
లోతైన అతి సంక్లిష్ట భావాలు
హృదయానికి హత్తుకునేలా వ్రాస్తారు అప్సర్
అప్సర్ ఓ మహాసముద్రం
ఆయన మాట్లాడుతుంటే కాలమే తెలియదు,,,
ముగ్గురం ఉదయం మూడు గంటల దాకా మాటల్లో తేలిపోయాం
సమకాలీన సాహిత్యం స్థితిగతులు
వాళ్ళు మాట్లాడుతుంటే విన్నాను
ఇద్దరు ఒకరిని మించిన దిట్ట మరొకరు
అప్సర్ గారు ఆ మూడు గంటల సమయంలో
తాను వ్రాసిన రక్తస్పర్శ సంకలనం
నాకు ప్రజెంట్ చేశారు
అప్పుడు1986 –87 ప్రాంతం
తెల్లవారగానే పేపర్ లో
హిందీ సినిమా గాయకుడు
కిషోర్ కుమార్ మృతి చెందాడన్న వార్త చూసి
కళ్ళ నీళ్ళ పర్యంతమయ్యాడు
నిజంగా మానవత్వం గలిగిన మహామనిషి
తరువాత కాలంలో అప్సర్ గారితో గాని గుడిపాటి గారితో గాని
మాట్లాడటానికి సమయం సందర్భం రాలేదు
వాళ్లిద్దరూ పత్రికల సబ్ ఎడిటర్లుగా బిజీబిజీగా ఉన్నారు,,,,,
నేను బడిపంతులుగా నా కష్టాలు నావి
కవిత్వం లోకి వచ్చేసరికి చాలా సమయం తీసుకుంది
అపరాజిత్
సూర్యాపేట