అబల కాదు సబల

అక్షర కొరకు
అంశం – మరో అబల
రచన – ఉమాదేవి ఎర్రం

శీర్షిక – అబల కాదు సబల

నిన్నటి కన్నీటి కథే,
నేటి మరో అబల కథ!
ఆడపిల్లగా పుట్టినందుకు,
అడుగడుగునా ఎందుకీ శిక్ష?

కన్నీళ్లను దాచుకుంటూ,
కష్టాలను భరిస్తూ,
కలలన్నీ చిదిమేసి,
కాలంతోనే పోరాడుతుంది!

ఆమె బలహీనురాలు కాదు,
అవకాశం దొరకని ధీరురాలు;
ఒక్కసారి రెక్కలు విప్పితే,
ఆకాశాన్నే అందుకునే శక్తి ఆమెది!

ఒకప్పుడు ఆడది అబల
ఇప్పుడు అదే ఆడది సబల
అన్ని రంగాల్లో ఆరితేరింది
ఆమె శక్తి అమెాఘం!

ఆమెకు గౌరవం ఇవ్వండి
యత్రనార్యస్తు పూజ్యంతే
రమంతే తత్ర దేవతా!అన్నారు
తెలుసుకుని మసులుకోండి!

ఇది నా స్వీయ రచన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *