అబ్బో ఎండలు

అబ్బో ఎండలు

అబ్బో ఎండలు

అబ్బబ్బ ఏం ఎండళ్రా అబ్బాయి
సుబ్బరంగా ఇంటిపట్టున ఉండాల్సిందే
డబ్బారేకుల సుబ్బారావు రొప్పుతూ సుబ్బిశెట్టి డబ్బాకొట్టు చేరె
ఈ డబ్బులు తీసుకుని డబ్బెడు కొబ్బరినీళ్ళు ఇవ్వు
సుబ్బిశెట్టి ముఖం గుబ్బలు దిబ్బలా ఉబ్బె
ఈ మంటలకు తన పబ్బం గడుస్తోంది ఎబ్బెట్టుగా నైనా
సుబ్బారావు దబ్బుమని గూడగుడా తాగె కొబ్బరినీళ్ళు
అది అబ్బురపరిచి సుబ్బిశెట్టి గబ్బు గుబ్బలెగిరేసె
జబ్బునపడతావోయ్ సుబ్బారావు ఈ మబ్బుల ఎండల్లో తిరక్కు
నిబ్బరంగా కూర్చున్న గబ్బు సుబ్బీ
డబ్బులు ఊరికే వస్తాయా నీలా దబ్బపండులా దిబ్బలా కూర్చుంటే
సుబ్బిశెట్టి ఇకఇక మంటూ ఏం దెబ్బకొట్టావోయ్ సుబ్బారావు
మా అబ్బాయి పరీక్షలు నన్ను అబ్బబ్బ బలే ఇబ్బంది పెడుతున్నయోయ్ సుబ్బీ
నిబ్బరంగా కూర్చోనివ్వట్లేదు నించోనివ్వట్లేదు బొబ్బట్లలా ఒళ్ళంతా పేలిపోతోంది
డబ్బులు ఇచ్చి పోలీసన్నలకు డబ్బెడు కాపీ చీటీలిస్తే నన్ను దెబ్బలుకొట్టి మా వాడికి ఆ డబ్బా ఇచ్చి ఇటురాకన్నారు
ఉబ్బితబ్బిబ్బయి నేను ఏడ్వాలో
డబ్బా అందిందని ఉబ్బిపోవాలో చెప్పు సుబ్బీ
దబ్బదబ్బ ఇంటికెళ్లి సబ్బు అరిగే దాకా ఒళ్ళు తోముతా సుబ్బీ ఇక ఉంటా!!

అపరాజిత్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *