అమ్మని కాలేనా

వైష్ణవి అని ఇంత మంచి పేరు పెట్టుకున్నావు కదా, మరి ఇంకా పిల్లలు కాకపోవడం ఏమిటమ్మా అంది పక్కింటి పార్వతమ్మా, అదేంటి పిన్ని గారు అలా అంటారు నా పేరు కూ పిల్లలకు ఏమి సంబంధం ఉంది చెప్పండి, అయినా మీ పేరు పార్వతమ్మ కదా మరి మీ అయన గారు ఎందుకు చనిపోయారు అని గడుసుగా అడిగింది వైష్ణవి.

ఇదిగో చుడమ్మాయి ఏంటి తెగ నిలిగుతున్నావు, నాకు అన్ని అయ్యాక నా మొగుడు చచ్చాడు, అంతే కానీ నిలా మొగుడు ఉండి కూడా గొడ్డు మోతు దాన్ని కాదు నేను అంది పార్వతమ్మా, అవును ఆవిడకు పిల్లలు, మనుమళ్ళు, మనవరాలు అందరూ ఉన్నారు, అయినా నువెంటే ఇంటికి వచ్చిన వాళ్ళ తో అలా మాట్లాడడమేనా, అయినా ఆవిడా అన్న దాంట్లో తప్పేమో ఉంది.

నీకు పెళ్లి అయ్యి, అయిదేళ్ళు కావస్తున్నా పిల్లలు లేరు, దానికి ఆమె అలా అనడంలో తప్పేంటి, అయినా ఎన్ని గుళ్ళు, గోపురాలు తిరిగినా ఈ గొడ్డు మోతుది మా పాల పడింది, దీనికి అన్ని వృధా కర్చు, పైగా దిని అయ్య ఇస్తా అన్న కట్నం మొత్తం ఇవ్వకుండా చచ్చాడు, ఇచ్చిన డబ్బు కూడా దిన్ని ఆసుపత్రిలో చూపించడానికే సరిపోయింది. పైగా దిని సోకులకు, చీరలకు అన్నిoటికీ భారం మాకు అంటూ కోడలును చుట్టూ పక్కల వారి ముందు అవమానించింది. ఆ మాటలకూ వైష్ణవి ఏడుస్తూ లోపలికి వెళ్ళి పోయింది.

ఓ యబ్బో ఏడుపు, బోడ ముండ ఏడుపు ఈ ఏడుపులు ఏడ్చే నా కొడుకుని ఎమరుస్తూ, ఇంకో పెళ్లి చేసుకొమ్మని అంటున్నా వాడు వద్దు, వద్దు అని అంటున్నాడు అంది శాంతమ్మ కొడుకు చేస్తున్న నిర్వాకం అందరికి చెప్తూ….

అయితే ఏంటి మీ కోడలు నీ కొడుక్కు మందు ఏమైనా పెట్టిందంతవా అంటూ అరాగా అడిగింది పార్వతమ్మ, ఏమో పెట్టె ఉంటుందిలే ఎవడికి తెల్సు ఆ సాని దాని వేషాలు, సాయంత్రం అయితే చాలు ఓ సిoగారించుకుంటుంది కానీ ఆ సింగారం దేనికి పనికి రాకపోతుంది.

నాకు అసలు అనుమానం ఏమిటంటే శాంతమ్మా, ఇది అసలు అడదేనా అని, అదే ఆడదానికి ఉండాల్సిన ఒక్క లక్షణం కూడా దీనికి లేదు, పెద్దలకు ఎదురు మాట్లాడడం, మొగుడి ముందు కూర్చోవడం, మొగుడుతో నవ్వుతు మాట్లాడడం చేస్తుంది….

అయినా మనకాలం లో అయితే మనం అత్తకు, ఆడ బిడ్డలకు భయపడి అసలు మాట్లాడే వాళ్ళమా, అబ్బో మన కాలపు పిల్లలలా ఏమిటి వీళ్ళు అని ఇద్దరు కోడళ్ళ గురించి మాట్లాడుకున్నారు, అయితే ఏమతావు శాంతమ్మా, నీ కోడలు నిజంగానే ఆడది కాదంటావా, అసలు నెల సరి వస్తుందా, లేదా అంది పార్వతమ్మ, ఆ ఎం నెలనో ఏమో ఒక్క నాడు కూడా నాకు తెలియనివ్వలేదమ్మ నెల వచ్చింది అని, ఏమో నమ్మా నాకు ఏమి తెల్సు నిజమే కావచ్చు, అది ఆడది కాకపోవచ్చు.

అయినా మా వాడు ఎలా కాపురం చేస్తున్నాడో నాకు అర్ధం కావడం లేదు, ఇంకో మంచి పిల్లను చూసి పెళ్లి చేద్దామంటే అసలు వినడు కదా, ఇంకో పెళ్లి వద్దమ్మ అని అంటున్నాడు, వెధవ, వెధవ, ఆడంగి వెధవ, అంది శాంతమ్మ.

అయితే శాంతమ్మ వదినా మరి ఆసుపత్రికి వేళ్ళమనకపోయవా నీ కొడుకుని, కోడల్ని అంది పార్వతమ్మ, హ అ వేషం కూడా అయ్యిందమ్మా, అయితే మాత్రం మా వాడిదేమి తప్పు లేదంట, అంతా దాని తప్పే ఉందట, దాని గర్భం చిన్నగా ఉందంట, అందుకే దానికి గర్భం వచ్చినా నిలబడడం లేదంట, అని తెలిసి తెలియని పరి జ్ఞానంతో, వాళ్ళిద్దరూ మాట్లాడుకున్న మాటలు, ఆ తర్వాత పార్వతమ్మ వెళ్ళి ఇరుగు పొరుగుకు వైష్ణవి ఆడది కాదు అని చెప్పడం, వైష్ణవిని అంతా ఒక పనికి మాలిన వస్తువుగా చూడడం చూసి చాల, చాలా బాధపడింది వైష్ణవి.

పైగా ఈ మధ్య భర్త కూడా తనని నిర్లక్ష్యం చెయ్యడం, పట్టించుకోకపోవడం, ఇంటికి లేట్ గా రావడం, కనీసం తను తిన్నదా అని కూడా అడగక పోవడం చూసిన వైష్ణవి కి జీవితం మిద విరక్తి పుట్టి, చనిపోవడానికి ఆ ఊరి చెరువు దగ్గరికి వెళ్ళింది.

అక్కడ చెరువు దగ్గర నలుగురు పిల్లలు ఏడుస్తూ ఉంటె వారిని సముదయించలేక సతమతమవుతున్నాడు ఒక నలభై ఏళ్ళ వ్యక్తి, వైష్ణవి వెళ్ళి నాలుగు నెలలు ఉన్న ఒక పిల్లవాడిని ఎత్తుకుంటూ, అయ్యో ఏంటి వీళ్ళ అమ్మా గారు రాలేదా అని అడిగింది ఆ వ్యక్తిని, అతను వైష్ణవి వైపు ఒక సరి చూసిమళ్ళి ఇంకో పిల్లవాడిని నిక్కరు తోడుగుతూ అమ్మా ఈ పిల్లల తల్లిదండ్రులు ఒక యాక్సిడెంటులో మరణించారు, పొలిసు వారు మా అనధశారనలయానికి ఫోన్ చేసి, వీరిని తీసుకుని వెళ్ళా మన్నారు, నేను వీరిని ఆశ్రమానికి తీసుకుని వెళ్తుండగా చిన్న బాబు బట్టలు పాడు చేసుకున్నాడు అది కడగాలని నేను ఇక్కడ ఆగాను అని అన్నాడు.

అది విన్న వైష్ణవి ఆత్రంగా అతన్ని అయితే ఈ పిల్లలు అనాధల అని అంది. లేదమ్మా అనాధలు కాదు నేనున్నాను వాళ్ళకు అని అయితే వీరిలో ఒకర్ని నాకు ఇవ్వగలరా అని అడిగి, తన పరిస్థితి మొత్తo వివరించింది. దానికి అయన అమ్మా నువ్వు వీరిలో ఒకర్ని తీసుకుని వెళ్తే నీ అత్త, భర్త ఒప్పుకోకపోవచ్చు,పైగా వాళ్ళని నీకు, ఇంకెవరికో పుట్టిన వారుగా అంటూ నీకు అక్రమసంభంధం అంట గట్ట వచ్చు, నీ భవిష్యత్తు ఇంకా భారంగా మారవచ్చు, కాబట్టి నువ్వు ఇప్పుడే ఒక మంచి నిర్ణయాన్ని తీసుకుంటే మంచిది పెంచు కోవడం తప్పితే, అని అన్నాడు.

వైష్ణవికి అతను చెప్పింది నిజమే అని అనిపించింది. పిల్లలు పుట్టాక పొతే నె ఆడదాన్ని కాదన్నా వాళ్ళు, ఇప్పుడు వీళ్ళను తీసుకుని వెళ్తే, ఎన్ని మాటలు, ఎన్ని అవమానాలు, ఎనేన్ని పుకార్లు పుట్టిస్తారు, కాబట్టి ఒక నిర్ణయానికి వచ్చిన వైష్ణవి తిరిగి అతనితో, ఫాదర్ నేను కూడా మీతో వస్తాను, నన్ను కూడా ఈ బిడ్డలో ఒక బిడ్డగా చుసుకోగాలరా, నేను అమ్మని కాకపోవచ్చు, కానీ ఈ తల్లి లేని పిల్లల అందరికి తల్లిగా ఉండే అదృష్టాన్ని నాకు కలిగించండి. ఈ జన్మకు విరే నా పిల్లలు, ఇక నుండి నేనే వీరికి తలిని, నన్ను మీతో పాటుగా తీసుకుని వెళ్ళండి అని అంది.

అమ్మా విరి తల్లిదండ్రులు చనిపోవడం ఏమిటి? నేను ఇక్కడ ఆగడం ఏమిటి?నువ్వు ఇక్కడికి రావడం ఏమిటి నువ్వు మాతో వస్తా అనడం ఏమిటి, నీకు పిల్లలు, పిల్లలకు తల్లి దొరకడం అంతా భగవంతుడి లిలమ్మా, పద అంటూ దరి తీసాడు అతను.. పిల్లలతో పాటుగా కదిలింది తల్లి కాని తల్లి వైష్ణవి …..

Related Posts