అమ్మాయి కోసం చివరి భాగం

శ్రావణ్ అమృత చేసిన హత్యని తన మీద వేసుకుని,జైలుకి వెళ్తాడు. శ్రావణ్ ని ఒక్కసారి కలవాలి అన్న భార్గవి కోరికను మధ్యలోనే తుంచేస్తాడు మాణిక్యం. నారాయణ కూడా సమాజం ఏమనుకుంటున్నాదో అని ఆలోచించి ఏమి మాట్లాడడు.కానీ శ్రావణ్ గురించి,అతని కుటుంబం గురించి ఆలోచించి బాధ పడతారు భార్గవి,అమృత లు ఇద్దరూ..ఇక చదవండి…

కోర్టులో హత్యని తానే చేసాను అని ఒప్పుకోవడం వల్ల శ్రావణ్ కు ఏడేళ్ల జైలు శిక్ష వేశారు. తనని జైలు కి తరలించారు.అతను వెళ్లే సమయం లో శ్రావణ్,తల్లిదండ్రులు అతని వద్దకు వచ్చి ఏంటి శ్రావణ్ ఇది నువు హత్య చేయడం ఏంటి,? ఎందుకు చేసావు ? ఎవరి కోసం చేసావు ?అసలు నీకో కుటుంబం ఉందని గుర్తుందా ? లేదా ? ఇంత లా నువ్వు ఎలా మరిపోయావు ? నీ జీవితం ఏమైపోతుందో ? అని ఒక్కసారి అయినా ఆలోచించవా ? నీ అక్క,అన్నయ్య స్థిర పడ్డట్టు గా నువ్వు కూడా స్థిర పడితే చూడాలని అనుకున్నాం,కానీ ఇలా స్థిర పడతావు జైల్ లో అని అనుకోలేదు అని అంటూ తల్లిదండ్రులు ఇద్దరూ బాధ పడ్డారు.

శ్రావణ్ ఒక్కమాట కూడా వారితో మాట్లాడ లేదు.నిర్వికారంగా వారిని చూస్తూ నిలబడ్డాడు. ఇంతలో భార్గవి అన్న,తండ్రికి తెలియకుండా శ్రావణ్ ని చూడ్డానికి వచ్చింది.ఆమె రావడం చూసిన శ్రావణ్ ఎందుకు వచ్చావు అన్నట్టు గా,కానీ భార్గవి శ్రావణ్ దగ్గరికి వెళ్ళి,శ్రావణ్ ఇదంతా ఎందుకు కేవలం నా కోసమేనా,నన్ను ప్రేమించడం వల్లే ఇదంతా చేస్తున్నావు.కానీ శ్రావణ్ నీకు ఎలా తెలిసింది మేము అక్కడ ఉన్నాము అని అంటూ అడిగింది.తల్లిదండ్రులు ఆ అమ్మాయిని చూసి  ఓ నీకోసమేనా మా వాడు ఇదంతా చేసింది.అమ్మా తల్లి మా కొడుకుని నీ వళ్ళో వేసుకుని ఆడిస్తున్నవా,ఏం బాగుపడతావు తల్లి, మా ఉసురు నీకు తగలక పోతుందా అని అంటూ ఇసడిoచుకున్నారు వాళ్ళు. ఆ మాటలకు ఏడుస్తూ వెళ్లి వారి కాళ్ళ మీద పడి ” అత్తయ్యా నాకు ఇంకా శాపాలు పెట్టకండి,ఇప్పటికే కన్నతల్లిని, ప్రేమించిన వాడిని కోల్పోతున్న,ఇంకా మీ శాపాలు తగిలి ఇంకెవర్ని దూరం చేసుకోలేను,నేను కావాలని ఏమి చేయలేదు అత్తయ్యా,తల్లి లేని దాన్ని ,కాస్త దయ చూపండి,నాకు అమ్మాయినా ,అత్త అయినా మీరే, ప్రేమించుకోవడమే మేము చేసిన తప్ప అత్తయ్యా అంటూ ఎడవసాగింది భార్గవి.

ఆమె మాటల్లో వినిపిస్తున్న నిజాయితీ,ఆమె కళ్ళలో  కనిపిస్తున్న శ్రావణ్ మీద ప్రేమ చూసిన శ్రావణ్ తల్లిదండ్రులు ఆమెని అక్కున చేర్చుకున్నారు.ఆ అమ్మాయి కోసం శ్రావణ్ అలా హత్య నేరాన్ని మీద వేసుకోవడం లో తప్పు లేదనిపించింది వారికి,ఎందుకంటే వారిది కూడా ప్రేమ వివాహము కాబట్టి వారు వారి ప్రేమని అర్థం చేసుకున్నారు.తల్లిదండ్రుల తో శ్రావణ్ మాట్లాడ్డానికి పోలీసులు పర్మిషన్ ఇవ్వడంతో వారి మాటలు ఎవరూ వినడం లేదు.అప్పుడు పెదవి విప్పాడు శ్రావణ్,” భార్గవి నిన్న మా అమ్మానాన్నల పెళ్లి రోజు,వారికి మన విషయం చెప్పాను,వారు నిన్ను తీసుకుని రమ్మని అనడం తో నేను మీ ఇంటికి బయలు దేరాను. అయితే వాన పడుతుండడం తో తోట పక్కనే ఉన్న మామిడి చెట్టుకింద నిలబడి ఉన్న నాకు నువ్వు తోటలోకి వెళ్లడం కనిపించింది.నీ వెనకే వచ్చి  నిన్ను సర్ప్రైజ్ చేద్దాం అని అనుకున్నా,కానీ నేనే సర్ప్రైజ్ అవుతాను అని అనుకోలేదు.

అక్కడ అమృతను,శవాన్ని చూసాను,నువ్వు చేసేదంతా చూస్తూ ఉన్నా,కానీ అక్కడ నీకు నేను కన్పిస్తే నీలో ఉన్న  ధైర్యాన్ని కోల్పోతావేమో అనిపించి,నువ్వు చేసేది అంతా చూస్తున్న,మీరు అన్ని బాగా చేశారు కానీ ఆ వాన లో నీ పాద ముద్రలు,మీ చెల్లి వి,అలాగే చెప్పులు అన్ని ఉన్నాయి.ఒక వేళా పోలీసులు కానీ, అతని అనుచరులు కానీ అతన్ని వెతుక్కుంటూ వచ్చినా,పోలీసు కుక్కలు వచ్చినా మీరు పట్టుబడడం ఖాయం కాబట్టి,మీరు వెళ్ళాక అక్కడున్న,చాకుని,చెప్పులని తీసుకుని,ఆ ముద్రలను తుడిపేసాను.ఆ తర్వాత శవాన్ని తవ్వి తీసి,నా బైక్ మీద వేసుకుని ,మీ నాన్నగారికి ఉన్న విషయాన్ని మొత్తం ఫోన్ చేసి చెప్పాను. మీ నాన్నగారు వద్దు ,నా కూతురు చేసిన తప్పుని నువ్వు ఎందుకు నెత్తి మీద వేసుకుoటావు అంటూ ఎంతగానో నచ్చ చెప్పాడు. అయినా “నాది అనుకున్న మనిషికి,ఏ కష్టం వచ్చినా అండగా ఉండడమే ఒక ప్రేమికుడి లక్షణం “. అందుకే నేను ఈ పని చేసాను.అది తప్పు అయితే నన్ను క్షమించండి నాన్నా అన్నాడు శ్రావణ్…

భార్గవి శ్రావణ్ ని చూస్తూ  నువ్వు నా కోసం ఇంత త్యాగం చేసావు.కానీ మా అన్నయ్య మాత్రం నీ దగ్గరికి వెళ్ళద్దు అని అన్నాడు. బహుశా నువ్వు జైలు కు వెళ్ళాక నాకు వేరే ఎవరినైనా చూసి పెళ్లి చేస్తారేమో అని అంది భయంగా భార్గవి.దానికి శ్రావణ్ నవ్వుతూ చూసి,భార్గవి మీ అన్నయ్య కి నేనంటే ముందు నుండి ఇష్టం లేదు,ఇప్పుడు నేను జైలు కి వెళ్లా అంటే ఇంకా ఎలా ఇష్ట పడతాడు.అయినా నేను ఆయన చెల్లి కోసం,ఆమె భవిష్యత్తు కోసం నేను జైలు కి వెళ్తున్నా అని అతను అనుకొడు,కాబట్టి నువ్వేమి భయపడకు,మనకు ఎలా జరగాలని ఉంటే అలా జరుగుతుంది, నువ్వు ధైర్యంగా ఉండు అన్నాడు ఉరడిoపుగా,లేదు ఇక నేను అక్కడ ఉండలేను.నాకు అంత ధైర్యం లేదు శ్రావణ్ అంది భార్గవి. అయ్యో భార్గవి అలా మనకు ,నీ వారికి నువ్వు నచ్చచెప్పక పోతే ఇక నువ్వు బయట ఏం బతుకుతావు ,ధైర్యంగా ఉండు,నేను జైలు నుండి వచ్చాక పెళ్లి  చేసుకుందాం అందరి ముందు,అందరి అనుమతి తో అన్నాడు శ్రావణ్.

లేదు బాబు వద్దు అంత దూరం ఎదురు చూడాలి అంటే నాకే కాదు ఎవరూ ఎదురు చూడరు.పైగా వాడు వట్టి మొండి వాడు.వాడు అన్నది జరగాలి అని అనుకునే రకం కాబట్టి ,వాడు వేరే వారికి ఇచ్చి పెళ్లి చేసినా చేస్తాడు.నీ త్యాగానికి ఫలితం ఉండకపోవచ్చు,ఎవరి అనుమతి కావాలి బాబు ,ఇక్కడే నీ తల్లిదండ్రులు ఉన్నారు.దాని తండ్రిని నేనున్నాను,మీ ఇద్దరికీ వయసు వచ్చింది. ఇప్పుడే,ఇక్కడే మీ పెళ్లి జరగాలి బాబు,ఏడేళ్లు అంటే చిన్న విషయం కాదు బాబు,అన్ని రోజులు పిల్లకి పెళ్లి కాలేదు అంటే నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడతారు.

అందువల్ల దీని పెళ్లి చేయాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పడే ఇక్కడే మీరు పెళ్లి చేసుకోండి,ఇదిగో తాళి సాక్ష్యం గా మీ తల్లిదండ్రులు,దాని తండ్రిని నేను ఉన్నాను.దానికి పెళ్లి చేసే బాధ్యత నాదే కాబట్టి ఇప్పుడు  చేసుకోమని అంటున్నా,దీనికి ఎవరూ అడ్డు చెప్పకండి దయచేసి అన్నాడు నారాయణ.శ్రావణ్ అయోమయంగా తల్లిదండ్రుల వైపు చూసాడు. వాళ్ళు కూడా సరే అన్నట్టుగా తలలు ఊపడం తో, భార్గవి కళ్ళ లోకి చూసాడు శ్రావణ్. తన కళ్ళలో కూడా అదే కోరిక కనిపించడం తో ఏమి అనలేక పోయాడు శ్రావణ్.అది గమనించిన నారాయణ ఇదిగో బాబు తాళి తీసుకో అని అన్నాడు.శ్రావణ్ ఒక్కసారి తల్లిదండ్రుల వైపు,భార్గవి వైపు చూసి, తాళి తీసుకుని మెడలో మూడు ముళ్ళు వేసాడు. ఇంతలో అక్కడికి మాణిక్యం కూడా వచ్చాడు.నారాయణ అక్కడే ఉన్న పోలీసులు కూడా చప్పట్లతో వారిని ఆశీర్వదించారు.

ప్రేమ కోసం ,ఒక అమ్మాయి కోసం  తన జీవితాన్ని పణంగా పెట్టె అబ్బాయిలు ఎందరో ఉంటారు.అందరి ప్రేమ సఫలం కాకపోవచ్చు,కానీ నిజమైన ప్రేమికులు ఎప్పటికైనా కలుస్తారు. వారికి ఎన్ని అవాంతరాలు,ఇబ్బందులు వచ్చినా వాటిని జయించి వారు తమ ప్రేమని  సాధించుకుంటారు.అలాంటి ఒక జంట కథే ఈ అమ్మాయి కోసం పెళ్లి తో శుభం కాకపోవచ్చు,ఈ అనంతమైన ప్రేమకు  అంతు లేదు కదా,వారి జీవితం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో,ఏమో చెప్పలేము. ఇక్కడితో ఈ కథని ఆపేస్తున్నా…

 

 

 

Related Posts