శ్రావణ్ కష్టజీవి ఒక ఫోటో స్టూడియోలో పని చేస్తూ ఉంటాడు. అదే సమయంలో భార్గవి అనే అమ్మాయి ఫోటో కోసం ఆ స్టూడియోకి వస్తుంది. అమ్మాయిని చూడగానే ప్రేమలో పడతాడు శ్రావణ్. ఆ అమ్మాయి వెనకే వెళ్తాడు.ఆమె ఎవరితోనో మాట్లాడ్డం చూసి, ఆగిపోతాడు. ఆమె శ్రావణ్ ని చూసి, మాట్లాడే అతన్ని వెళ్లిపో అని అంటుంది. అతను శ్రావణ్ ని అనుమానంతో చూస్తూ వెళ్లిపోతాడు. ఇప్పటివరకు జరిగిన కథ. ఇక ఇప్పుడు ప్రస్తుతం….
ఏంటి ఫాలో అవుతున్నావ్ అని అడిగింది భార్గవి, అదేం లేదు. ఒక్కత్తివి వెళ్తున్నావ్ అని అన్నాడు శ్రావణ్. నాకు ఇది అలవాటేలే అంది భార్గవి. సరే కానీ అతనెవరు అని అడిగాడు శ్రావణ్, అతనా, అతను మా బావ అంది భార్గవి. అవునా బావ నా అంటూ నిరాశ చెందాడు శ్రావణ్. అవును అయితే నీకేంటి అని అనుమానంగా చూసింది భార్గవి.
ఆ ఏమి లేదులే, అంటూ భార్గవి ఒక ఇంటి ముందు ఆగడం చూసి,ఇదేనా మీ ఇల్లు అని అడిగాడు. అవును మాదే అని అనగానే, సరే నేను వెళ్తున్నా, అని చెప్పేసి వెళ్లబోయాడు శ్రావణ్. అగు నీ పేరేంటి అంది భార్గవి. నా పేరు శ్రావణ్, అదే స్టూడియోలో పని చేస్తా అని చెప్పాడు.
సరే కానీ మా బావకి పెళ్లి అయిపోయింది. అని చెప్పి లోపలికి పరుగెత్తి వెళ్ళింది భార్గవి. అప్పటి వరకు కొంచం నిరాశలో ఉన్న శ్రావణ్ కి భార్గవి ఆ మాట చెప్పగానే, కొత్త ఉత్సాహం వచ్చింది. అతను తిరిగి చూసే సరికి ఆమె అతనికి కనిపించలేదు.
ఆమె ఇచ్చిన హింట్ కి అతను సంతోషపడుతూ, తనలో తానే నవ్వుకుంటూ, మళ్ళీ స్టూడియోకి వచ్చాడు. కొన్ని రోజులు అయ్యాక ఇంకో అమ్మాయితో కలిసి వచ్చింది బార్గవి, అప్పుడు ఇద్దరికీ అనిపించింది ఒకర్ని వదిలి ఒకరం ఉండలేము చూడకుండా అని ఇక అప్పటి నుండి శ్రావణ్, భార్గవి ఇద్దరూ కలుసుకోసాగారు. ఒక్కరోజు కూడా ఒకర్ని చూడకుండా ఒకరు ఉండలేని పరిస్థితికి వచ్చారు. భార్గవి వాళ్ళ నాన్నగారు పక్కూర్లో ఒక పెద్ద రైతు, తల్లిదండ్రులు ఇద్దరూ పిల్లల చదువు కోసం, ఈ ఊరికి వచ్చి ఉంటున్నారు.
భార్గవికి ఒక అన్న, చెల్లి ఉన్నారు. భార్గవి వాళ్ళ అన్నయ్య ఆ ఊరిలోని ఒక రాజకీయ పార్టీలో కార్యకర్తగా తిరుగుతూ ఉంటాడు. చెల్లి తొమ్మిదో తరగతి చదువుతుంది. వారి కుటుంబం కొంచం ఉన్నత స్థితిలోనే ఉంది.
కానీ శ్రావణ్ కులం, భార్గవి కులాలు వేరు. అయిన వారు కలుసుకుంటూనే ఉన్నారు. కానీ ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఒకరికి ఒకరు ఐ లవ్ యు అని చెప్పుకోలేదు.
ఇంతలో ఎలక్షన్స్ వచ్చాయి. ఆ ఎలక్షన్స్ లో తిరుగుతున్న భార్గవి అన్నయ్య మాణిక్యం ఒక రోజు శ్రావణ్, భార్గవి లు ఉరి బయట ఉన్న చెరువు దగ్గర మాట్లాడుకోవడం చూసాడు. ఎవరో తెలియని వ్యక్తి తో తన చెల్లి మాట్లాడడం చూసిన మాణిక్యం, మిగతా వారు చూసారా అని అందరిని చూసాడు. అందరూ చూసి, ” ఆరేయి మణి అక్కడ మీ చెల్లి ఎవరితో మాట్లాడుతుంది రా, లవ్ ఆ? లేక ఇంకేమైనా ఉందా, అని నవ్వుతూ అడిగారు. దానితో స్నేహితులు తనని, తన చెల్లిని అవమానించారని అనుకుంటూ, సంగతేంటో తెలుసుకోవాలి అని అనుకున్నాడు.
అంతలోనే వారున్న కారు, వారిని దాటి ముందుకు వెళ్ళిపోయింది. అన్నయ్య చూసాడు అని తెలియని భార్గవి, హాయిగా నవ్వుతుంది శ్రావణ్ వేసిన జోక్ కి… ఇక శ్రావణ్ మొత్తం సమయం అంతా భార్గవి తో గడుపుతూ, స్టూడియోకి వెళ్లడం మానేశాడు. ఆ విషయం ఇంట్లో ఎవరికి తెలియకుండా జాగ్రత్త పడుతున్నాడు. అప్పటి వరకు సంపాదించిన డబ్బుతో భార్గవిని ఇంప్రెస్ చేయడానికి రకరకాల గిఫ్టులు ఇస్తూ ఉండేవాడు.” భార్గవి నువ్వు లేకుండా, నేను అసలు ఉండలేను. నా జీవితంలోకి వచ్చిన మొదటి అమ్మాయివి నువ్వు, నిన్ను చూడగానే నాలో ఎదో ఉత్తేజం, నాలో కొత్త ఉద్వేగం, ఆ సమయంలో నాకు నువ్వు తప్ప ఎవరూ కనిపించలేదు. ఇప్పుడు కూడా నేను ఎక్కడికి వెళ్లినా నువ్వు నాతోనే ఉన్నట్టుగా, నా పక్కనే నిల్చున్నట్టు అనిపిస్తుంది. నువ్వు తప్ప ఈ ప్రంపంచo లో నాకు ఎవరూ వద్దు, లేరు అనిపిస్తోంది, ” అన్నాడు కళ్ళ నిండా ప్రేమని నింపుకుని భార్గవిని చూస్తూ “.
“అవును శ్రావణ్ ఆ రోజు నిన్ను స్టూడియోలో చూడగానే నాకు అలాగే అనిపించింది. అందుకే నేను నీతో ఇంత క్లోజ్ గా మాట్లాడుతున్నాను. నువ్వు లేకుండా నేను ఉండలేను, అంది శ్రావణ్ ఒళ్ళో తల పెట్టుకుని పడుకుని, అలా ఇద్దరూ ప్రేమ ఊసులు చెప్పుకుని, చీకట్లు పడడంతో, వదలలేక, వదలలేక వీడిపోయారు ఇద్దరూ. భార్గవిని, శ్రావణ్ ని చూసిన మాణిక్యం ఏం చేయబోతున్నాడు? భార్గవి, శ్రావణ్ ల ప్రేమ ఎంతవరకు వెళ్తుంది? వారి ప్రేమ విషయం శ్రావణ్ ఇంట్లో తెలుస్తుoదా? లేదా? వీటికి సమాధానం తదుపరి భాగంలో చదవండి…