శ్రావణ్ కష్టపడే ఒక కుర్రాడు.తనకు ఇష్టమైనరంగం అయిన ఫోటోగ్రఫీలో శిక్షణ తీసుకుని ,అదే ఫోటో స్టూడియోలో పని చేస్తూ ఉంటాడు.ఆ సమయంలో అతనికి భార్గవి తో పరిచయం ఏర్పడి,ప్రేమగా మారుతుంది.వారిద్దరూ సన్నిహితంగా ఉండడం చూసిన భార్గవి అన్నయ్య మాణిక్యం స్నేహితులు వెటకారం చేయడం తో ,చెల్లి మీద కోపంగా ఇంటికి వచ్చి,భార్గవి ని కొడతాడు.ఆ సమయం లో అడ్డు వచ్చిన తల్లిని తోయడం వల్ల,తల్లి సావిత్రమ్మ రోలు మీద పడి తలపగిలి చనిపోతుంది. సావిత్రమ్మ కు ఉన్న అయిదుగురు అన్నదమ్ములు ప్రాణాలు తీసే అంత రౌడీలు కావడం వల్ల,ఈ విషయం వారికి తెలిస్తే తమని బతకనివ్వరని తండ్రి నారాయణ కొడుకు మాణిక్యం తో అంటాడు. దాంతో మామయ్యల రౌడీయిజం తెలిసిన మాణిక్యం కూడా భయపడి,ఏం చేద్దామని తండ్రిని అడుగుతాడు. ఇదంతా వింటున్న భార్గవి శ్రావణ్ కి ఫోన్ చేసి విషయం అంతా చెప్పి ,సహాయం చేయమని అడుగుతుంది.దానికి నేను వస్తున్న అని చెప్పి,ఫోన్ పెట్టేసి, వెంటనే భార్గవి ఇంటికి వెళ్తాడు శ్రావణ్, అతన్ని చూడగానే కోపంగా కొట్టడానికి వస్తాడు మాణిక్యం, తండ్రి వారించడం తో ఆగిపోయి,శ్రావణ్ చెప్పే విషయాన్ని వినడానికి సిద్ధం అవుతారు అంతా,ఇంతలో బయట భోరున వర్షం పడడం మొదలవుతుంది…..ఇక చదవండి…..
శ్రావణ్ నారాయణ,మాణిక్యం,భార్గవి వైపు చూస్తూ చూడండి నేను భార్గవి ప్రేమించుకున్నాం,మీరు ఒప్పుకుంటేనే పెళ్ళి చేసుకుందాం అని కూడా అనుకున్నాం,కానీ ఇప్పుడు అనవసరంగా ఇలా జరగరానిది జరిగింది. దింట్లో నా తప్పేం లేదు.అయినా నేను నా ప్రేమ కోసం,నేను ప్రేమించిన భార్గవి కోసం ఏమైనా చేస్తాను. అయితే మీరు ఈ విషయానికి ఇంతలా ఎందుకు భయ పడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. ఇక పోతే మీ అబ్బాయి తల్లి ని తోసాడు అని వారికి ఎలా తెలుస్తుంది.మీరు పనిగట్టుకుని చెప్తే తప్ప ఎవరికి తెలియదు అలాగే వాళ్ళు అడగకుండానే మీరు చెప్తే వారికి అనుమానం రావచ్చు.కాబట్టి మనం ఒక పని చెయ్యాలి అని ఆగాడు.అతను ఇంకా ఏమి చెప్తాడా అని చూస్తున్నారు వాళ్ళు ముగ్గురు ఏమి లేదు ఇప్పుడు వర్షం పడుతుంది కాబట్టి అత్తగారు బట్టలు తేవడానికి బిల్డింగ్ పైకి వెళ్లారు అని దిగేటప్పుడు కాలు స్లిప్ అయ్యి,కింద పడిపోయింది అని చెప్పాలి, ఇప్పుడు ఆవిడని మనం హాస్పిటల్ కి తీసుకుని వెళ్ళాలి,నేను నా స్నేహితుడికి ఫోన్ చేస్తాను. ఆటో తీసుకుని వస్తాడు అందులో తీసుకుని వెళ్దాం,వెళ్లే ముందు మీ బంధువుల కి భార్గవి ఫోన్ చేస్తుంది ఎందుకంటే మీరు షాక్ లో ఉన్నారని చెప్తుంది అని అన్నాడు నారాయణ తో.
అంతా విన్న నారాయణ మౌనంగా ఉన్నాడు. కానీ మాణిక్యం మాత్రం నాయనా ఇది బాగుంది.ఇట్ల చేద్దాం అని నువ్వు ఆటో పిలువు అవును నీ పేరేంటి అని అడిగాడు నా పేరు శ్రావణ్ బావ అన్నాడు శ్రావణ్,అంతకు ముందు బావ అంటే చిరాకు గా అనిపించిన మాణిక్యంకి, ఇప్పుడు ఆ మాట అలా అనిపించ లేదు. తర్వాత గబగబా జరగాల్సిన పనులు చేశారు ముగ్గురు.శ్రావణ్ తన స్నేహితునికి ఫోన్ చేసి,విషయం చెప్పి రమ్మన్నాడు.భార్గవి,మాణిక్యం ఇద్దరూ కలిసి తల్లి ని బయట మెట్ల దగ్గర నీరు,బురద తో తడిపి,బయట అరుగు మీద పడుకోబెట్టారు. మెట్ల మీద అందరి బట్టలు వేయించాడు భార్గవి తో శ్రావణ్. ఎవరి పనులు వాళ్ళు చేస్తున్న,చూస్తూ కూర్చున్నాడు నారాయణ,.పాపం అతను చాలా డిస్టర్బ్ అయ్యాడు. భార్య ని అలా చూసి తట్టుకోలేక పోతున్నాడు. అలాంటి పరిస్థితి లో కూడా శ్రావణ్ ఆలోచన విధానం ఆయనకి బాగా నచ్చింది. ఎందుకంటే తన కుటుంబం ఆపదలో ఉన్నప్పుడు,తనకి సహాయం చేసిన వారు అంటే ఎవరికి మాత్రం ఇష్టం ఏర్పడదు. అందుకే శ్రావణ్ అంటే ఒక విధమైన అభిప్రాయం ఏర్పడింది నారాయణ కు. ఇంతలో ఆటో వచ్చింది.ఏమైంది రా అంటూ ఆటో నుండి దిగాడు శ్రీను, అతను శ్రావణ్ కి సన్నిహిత మిత్రుడు, శ్రావణ్ అతనికి బట్టలు తేవడానికి పైకి వెళ్లారు రా, దిగేటప్పుడు కాలు జారీ పడిపోయింది అని చెప్పి,ఆవిడని శ్రావణ్,శ్రీను,మాణిక్యం కలసి ఆటోలోకి చేర్చారు.భార్గవి ఏడుస్తూ తల్లి పక్కన కూర్చుంది.ముందు మాణిక్యం,శ్రీను,శ్రావణ్ కూర్చున్నారు,భార్గవి పక్కన భార్య తలని ఒళ్లో పెట్టుకున్న నారాయణ గారు కూర్చున్నారు.ఆటో కదిలింది.ఆ ఊర్లో ఉన్న ఒక మంచి ఆసుపత్రి ముందు ఆటో ఆపిన శ్రీను లోపలికి వెళ్లి అర్జెంట్ అని చెప్పాడు.లోపలి నుండి స్టచర్ తెచ్చి,దాని మీద సావిత్రమ్మ ని పడుకోబెట్టాడు. అంతలో భార్గవి ఫోన్ తీసుకుని తన మామయ్య వాళ్లకు ఫోన్ చేసి,ఏడుస్తూ విషయం చెప్పింది.వాళ్ళు అంత రాత్రి ఫోన్ చేసిన మేన కోడలికి ధైర్యం చెప్తూ,తాము వెంటనే వస్తున్నమని చెప్పారు.నర్స్ వెళ్లి డాక్టర్ ని తీసుకుని వచ్చింది.
డాక్టర్ గారు వచ్చి సావిత్రమ్మ ని పరీక్షించి,చూసి సారి ఆవిడ చనిపోయింది,చాలా సేపు అయ్యింది. పడడం వల్ల హార్ట్ అటాక్ వచ్చి ప్రాణం పోయినట్లు ఉంది అని అన్నాడు. తెలుసిన విషయమే అయినా ,మళ్ళీ వినగానే ఎక్కడ లేని దుఃఖం వచ్చింది భార్గవి,మాణిక్యంలకువాళ్ళఏడుపునిఆపడంఎవరివల్లకాలేదు.ఇంతలోభార్గవివాళ్ళమామయ్యలు,అత్తయ్యయూ,బందువులంతా వచ్చారు. భార్గవి ఏడుపు వినగానే వారికీ విషయం అర్ధం అయ్యింది. దాంతో వాళ్ళు కూడా ఏడుపు మొదలు పెట్టారు.నర్సు వచ్చి అది చూసి,శ్రావణ్ ని పిలిచి చూడు బాబు ఆసుపత్రిలో ఇలా ఏడవడం ఏమి బాగాలేదు.పేషంట్లు పడుకున్నారు.వారు భయపడతారు కాబట్టి వెంటనే వెళ్లిపోండి అని అంది.దాంతో శ్రావణ్ నారాయణ గారి వద్దకు వెళ్లి ఇంటికి వెల్దామని అన్నాడు. నారాయణ మౌనంగా చూసాడు శ్రావణ్ వైపు. మాణిక్యం తో కూడా చెప్పి ,అదే ఆటో లో సావిత్రమ్మ దేహాన్ని చేర్చారు. ఆమె ఖర్మ కండలు అన్ని అయ్యే వరకు వారితో పాటు ఉన్నాడు శ్రావణ్.శ్రావణ్ చొరవకు అతను వారి మీద చూపిస్తున్న శ్రద్ధ కు భార్గవి వాళ్ళ మమయ్యాలకు కూడా శ్రావణ్ అంటే మంచి అభిప్రాయం ఏర్పడింది.వాళ్ళు కూడా శ్రావణ్ గురించి బయట తెలుసుకున్నారు. అందరూ అతని గురించి బాగానే చెప్పారు. దాంతో మమయ్యాలు కూడా శ్రావణ్ మంచితనాన్ని మెచ్చుకున్నారు.వారి మాటలు వింటున్న నారాయణ,మాణిక్యం మనసులో కూడా శ్రావణ్ అంటే కొంచం మంచి అభిప్రాయం ఏర్పడింది.భార్గవికి కూడ శ్రావణ్ మీద ఇంకా ప్రేమ ఎక్కువ కాసాగింది.సావిత్రమ్మ గారి కార్యక్రమలు అన్ని పూర్తి అయ్యి,ఎక్కడి వారు అక్కడికి వెళ్లి పోయారు.శ్రావణ్ కూడా తన పని లో నిమగ్నమయ్యాడు.
రోజులు అలా గడిచిపోతున్నాయి.శ్రావణ్,భార్గవి లు ఇద్దరూ అప్పుడప్పుడు కలుసుకుంటూ ఉన్నారు. తల్లి చనిపోయిన బాధ లో ఉన్న భార్గవిని ఓదారుస్తూన్నాడు శ్రావణ్,వారికి అవసరమైన అన్నింటిలో అండగా నిలబడుతున్నాడు.నారాయణ భార్య చనిపోయిన దుఃఖం లో నుండి కొద్దీ కొద్దిగా బయటకు వస్తూ,పొలం పనిలో బిజీ అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాడు.మాణిక్యం తన స్నేహితులతో మళ్ళీ తిరగడం మొదలు పెట్టాడు.భార్గవి ఇంట్లో తండ్రికి, అన్నయ్య ,చెల్లికి వండి పెడుతూ,ఇంటి బాధ్యత ని అంతా తన చేతిలోకి తీసుకుంది.అందరి బాగోగులు చూస్తూ,తన చదువుని పక్కన పెట్టింది. సావిత్రమ్మ గారి అన్నదమ్ములు అంటే భార్గవి మేన మామా వాళ్ళు చెల్లి చనిపోయాక రావడం కాస్త తగ్గించారు.తల్లిని తాను తోసేస్తే పడి,చనిపోయిందని ఫిలింగ్ ని మర్చిపోయి,ఏమి మారకుండా ఉన్నాడు మాణిక్యం.
మాణిక్యం తిరిగే రాజకీయనాయకుడు పోటీలో గెలిచే సరికి వారికి పట్టా పగ్గాలు లేకుండా పోయాయి.అంతా యూత్ కాబట్టి వాళ్లేమి చేసినా చూసి,చూడనట్లు ఉండమని అన్నాడు ఆ రాజకీయ నాయకుడు,వారి వల్లే సగం ఓట్లు పడ్డాయని అతని నమ్మకం,అందువల్లే వారేమి చేసినా అతను ఏమి అనడు. వాళ్ల కు అడ్డు చెప్తే ఎక్కడ తన నుండి వెళ్లిపోతారో అని అతని భయం కావచ్చు. అతనికి అన్ని ఇల్లిగల్ వ్యాపారాలకు వాళ్ళే ముందు ఉంటారు. అలా అతని వ్యాపారాలన్ని యువకులకు అప్పగించి,ఎవరైనా అడ్డు వస్తే కొట్టమని,కేస్ లేకుండా తాను చూస్తానని వారికి మాట ఇవ్వడం తో వాళ్ళు రెచ్చి పోయారు..
అలాంటి ఒక రోజు అతని అనుచర గణం లో ఉన్న వినాయకం అనే అతనికి కొంత మంది యువకులని అప్పగించి,సారాని వేరే పార్టీ కి అప్పగించి రమ్మని చెప్పాడు పెద్దన్న అని వాళ్ళు ముద్దుగా పిలుచుకునే రాజకీయ నాయకుడు.అతను చెప్పిన పని విజయవంతంగా చేసి వచ్చిన వినాయకాన్ని అభినందించి,స్నేహితులతో పార్టీ చేసుకొమ్మని డబ్బు ఇచ్చాడు పెద్దన్న. ఆ డబ్బు తో స్నేహితులతో పార్టీ చేసుకోవడానికి పక్కనే ఉన్న మామిడి తోట లోకి వెళ్లారు వినాయకం,అతని స్నేహితులు.అదే సమయంలో భార్గవి ఇంట్లో కూరగాయలు అయిపోవడంతో తన చెల్లి అమృత తో,తోట లోకి వెళ్లి ఒక రెండు మామిడి కాయలు అడిగి తెమ్మని పంపింది.అమృత మామిడి కాయల కోసం వెళ్ళింది. కానీ అక్కడ ఎవరూ లేక పోవడంతో లోపల తాత ఉన్నడేమో అని తాత తాత అంటూ పిలుస్తూ లోపలికి వెళ్ళింది. కానీ అక్కడ అప్పటికే మందు బాగా నిషాకి ఎక్కిన వినాయకం స్నేహితులు కింద పడి దొర్లుతూ ఉన్నారు..వినాయకం మనుషులు ,వినాయకం అమృతను ఏం చేయబోతున్నారు,దానికి శ్రావణ్ ఎలా స్పందించబోతున్నాడు ..? ఏం జరగబోతుంది ? చదవండి తదుపరి భాగం లో……
—–భవ్య చారు