అమ్మాయి కోసం పార్ట్ – 5

శ్రావణ్ ఒక ఫోటో స్టూడియోలో పనిచేస్తూ ఉంటాడు.భార్గవి తో ప్రేమలో పడతాడు. భార్గవి అన్నయ్య మాణిక్యం చెల్లిని,శ్రావణ్ ని చూసి,కోపం గా వచ్చి కొడతాడు. కూతుర్ని కొడుకు ఎందుకు కొడుతున్నాడో అర్థం కానీ తల్లి సావిత్రమ్మ అడ్డు రావడం తో,ఆమెని బలంగా తోస్తాడు. ఆ తోపులాటలో ఆమె చనిపోతుంది.

వారికి ఏం చెయాలో తెలియని పరిస్థితిలో భార్గవి శ్రావణ్ కి ఫోన్ చేసి రమ్మని అంటుంది.శ్రావణ్ వచ్చి వారిని ఆ ఆపద నుండి కాపాడతాడు.దాంతో భార్గవి కుటుంబం లోని వ్యక్తులకు శ్రావణ్ బాగా నచ్చుతాడు. ఆ తర్వాత కూడా శ్రావణ్ వారింటికి రాక పోకలు సాగిస్తూ ఉంటాడు. మాణిక్యం పని చేసే రాజకీయ నాయకుడు గెలుస్తాడు. అతని ఇల్లిగల్ వ్యాపారాలకు యువకులను వాడుకుంటూ ఉంటాడు.

అలాంటి సమయంలో వినాయకం అనే అతన్ని సారా సరుకు వేరే పార్టీ కి ఇవ్వమని పంపిస్తాడు.వాళ్ళు ఆ ఆపని ని విజయవంతం గా పూర్తి చేస్తారు.ఆ సంతోషంలో వారిని పార్టీ చెసుకొమ్మని  డబ్బిస్తాడు ఆ పెద్దన్న అనే వ్యక్తి. దాంతో యువకులంతా వెళ్ళి ఊరు చివరన ఉన్న మామిడి  తోట లో  పార్టీ చేసుకుంటూ ఉంటారు.

అదే సమయంలో భార్గవి చెల్లి అమృత ని మామిడి కాయల కోసం అదే తోటకి పంపిస్తుంది. అమృత వెళ్లే సరికి వారంతా తాగి కింద పడి దొర్లితూవుంటారు.  ఇప్పటి వరకు జరిగిన కథ  ఇక జరిగేది చదవండి………

*************

తాత,తాత అంటూ పిలుస్తూ వెళ్ళింది అమృత,హ ఎవరు అని అన్నాడు ముద్దగా వినాయకం, అతన్ని చూడగానే  రెండు అడుగులు వెనక్కి వేసిన అమృత తాత లే డా అని అడిగి,తాత ని అడిగి మా అక్క మామిడి కాయలు తెమ్మంది అని వినాయకం తో అన్నది. కాయల కోసం తాత దాకా ఎందుకే,తాత ను మందు కోసం పంపిన కానీ, అదిగో ఆ చెట్టుకు కాయలున్నాయి వెళ్లి కోసుకో అన్నాడు పక్కనే ఉన్న చెట్టుని చూపిస్తూ,

ఆ చెట్టుని చూడగానే చేతికి అందేలా ఉన్న మామిడికాయలు చూడగానే అమృత కు ఉత్సహం గా అనిపించి,తాత లేడు కాబట్టి ఎన్ని అయినా కోసుకోవచ్చు అని అనుకుని గబగబా చెట్టు వద్దకు వెళ్ళింది.అంతవరకు మత్తులో ఉన్న మిగతా వాళ్ళు ఆడ పిల్ల గొంతు వినగానే లేచి కూర్చున్నారు.

 

AMMAYKOSAM PART-5

 

 

అమృత చెట్టు వద్దకు వెళ్లడం చూసిన వినాయకం ,మిగతా వారికి సైగ చేసాడు.దాంతో ఎవరికి వారు గబగబా అక్కడి నుండి వెళ్లి పోయారు.కొందరు గేట్ దగ్గర నిలబడ్డారు తాత రాకుండా,వినాయకం మెల్లిగా అమృత దగ్గరికి వెళ్ళాడు,చెట్టుకున్న కాయలు దగ్గరగానే కనిపించాయి.

కానీ ఇప్పుడు చుస్తే అందడం లేదు,కాయల కోసం ఎగురుతున్న అమృత అందాలను చూస్తూ గుటకలు మింగుతున్నాడు వినాయకం. పాపం అమృత అప్పుడే విచ్చుకున్న చిన్న గులాబీ పువ్వులా ఉంది.లోకం లోని మంచి,చెడులు ఆమెకి ఇంకా వంట బట్టలేదు.బడి,ఇల్లు తప్పితే తనకి ఏమి తెలియదు.

అలాంటి పసిపాప ని కామ దృష్టి తో చూస్తున్నాడు వినాయకం.ఎమ్మా కాయలు అందడం లేదా అని అన్నాడు దగ్గరగా వెళ్లి,కాయలు అందుకునే పనిలో ఉన్న అమృత ఉలిక్కిపడి చూసి,హ అవును అందడం లేదు అని అంది. అయితే నేను నిన్ను ఎత్తుకుంటా ,నువ్వు వాటిని అందుకో అన్నాడు వినాయకం,హో సరే అంది అమృత,అతను ఆమె నడుము మీద రెండు చేతులు వేసి పైకి లేపాడు.

కాయలు అందుకుందామనే ఆతృతలో ఉన్న అమృత ఆ చేతుల లోని కామాన్ని గ్రహించలేదు. మొదట రెండు కాయలు తెంపి కింద వేసి,ఇంకో నాలుగు కాయలు కూడా తెంపేసి,కింద వేసి,ఇక చాలు దీంపండి అని అంది.అప్పటి దాకా ఆ స్పర్శ లోని సుఖాన్ని అనుభవిస్తూ కోరిక పెంచుకున్న వినాయకం ఆమెని అలాగే ఎత్తుకుని పక్కనే ఉన్న షెడ్డు లోకి తీసుకుని వెళ్ళాడు. ఆమె ప్రమాదాన్ని గ్రహించి ఒదులు,ఒదులు అని పెనుగులాడుతున్న వదలకుండా ఒడిసి పట్టుకుని ఆమె వేసుకున్న డ్రెస్ పై భాగాన్ని చింపేసాడు.

దాంతో రెండు చేతులని ఎద మీద ఉంచుకుని ఏడుస్తూ,వదులు నన్ను,దయచేసినన్ను వదిలేయి,అని అంటున్నా గబుక్కున మీద పడ్డాడు వినాయకం,ఆ షెడ్డులో ఒక నులక మంచం దాని మీద కొన్ని దుప్పట్లు ,ఆ పక్కనే వంట సామాను అన్ని ఉన్నాయి. అమృత మంచం మీద పడిoది.ఆమె పైన వినాయకం ఉన్నాడు.

ఇద్దరూ పెనుగులాడుతూ ఉన్నారు. బయట గేట్ దగ్గర ఉన్న అనుచరులు బాటిల్ లో ఉన్న మందు తాగుతూ ఉన్నారు.ఇంతలో వారికి పోలీసు పెట్రోలింగ్ వాహనం వస్తూ కనిపించింది. దాంతో వాళ్ళు అందరూ అక్కడి నుండి పరుగులు పెడ్తూ,చీకట్లో కలిసి పోయారు. వాళ్ళని అనుసరిస్తూ పోలీస్ వాహనం వెళ్ళింది.అమృత తన  చేతికి  ఏదైనా వస్తువు దొరుకుతూoదా అని వెతుకుతుంది.

వినాయకం  ఆమె బట్టలు వలిచే పనిలో ఉన్నాడు. ఇంతలో అమృత చేతికి తాత కూరగాయలు కోసుకునే కత్తి దొరికింది. వినాయకం ఆమెని అక్రమించుకోబోతున్నాడు. ఆమె కత్తిని ఒక్కసారిగా వినాయకం గుండెల్లో  దింపింది అమ్మా అని అరిచి,వినాయకం అలాగే అమృత మీద పడిపోయాడు,అమృత భయం తో ఏడుస్తుంది..

ఎంత సేపు అయినా,చెల్లెల్లు రాకపోవడం,పైగా వర్షం పడేలా ఉండడం తో ఉన్న ఒక్క గొడుగు తీసుకుని,తోట వైపుగా వెళ్ళింది భార్గవి.తోటలోకి వెళ్లి అంతా వెతికిoది.అమృత ఎక్కడా కనిపించలేదు. ఇలా కాదని తాత ఉండే షేడ్ వరకు వెళ్లి చూడాలని అనుకుని లోపలికి వెళ్ళింది.ఇంతలో వర్షం పడడం మొదలైంది.లోపలికి వెళ్లిన భార్గవికి అమృత సగం బట్టలతో,చేతిలో కత్తి ,పక్కన వినాయకం పడి ఉన్నాడు,అతని గుండెలో నుండి రక్తం స్రవిస్తోంది.

అమ్ము ఏమయింది రా,ఏంటే ఇది  వాడే వాడే అంది. ఆతృత,భయం కలగలిపిన చూపులతో, అమృత అక్కని చూడగానే ఎక్కడలేని ధైర్యం వచ్చిన అమృత అక్కడ నుండి లేచి వచ్చి,అక్కా అని అంటూ ఏడుస్తూ భార్గవిని కౌగిలించుకుoది.

అమ్ము అమ్ము ఎడవకు నాన్న,అసలు ఏమైందో చెప్పు అని అంది. అమృత ఏడుస్తూ జరిగిన విషయం అంతా చెప్పింది.అంతా విన్న తర్వాత భార్గవి అమృత ను ఓదారుస్తూ,ఏమి కాలేదమ్మా,నువ్వు భయపడకు  అని నేను రాకముందు ఎవరైనా వచ్చారా అని అడిగింది.రాలేదు అక్కా అని ఏడుస్తూనే బదులు చెప్పింది అమృత.

సరే అని  గబగబా  వినాయకం ని పక్కకు లాగి పక్కనే ఉన్న బట్టల లోంచి ఒక చద్దరు ని తీసి,అందులో వినాయకం శవాన్ని  చుట్టేసింది.అక్కడ పడ్డ రక్తాన్ని మొత్తం వాన నీటితో శుభ్రం చేసింది. ఆ శవాన్ని బయటకు తీసుకుని వచ్చి, కొంచం దూరంగా ఉన్న మామిడి తోట లోపలికి శవాన్ని లాక్కు వెళ్ళింది.

అక్క చేస్తున్న పనిని నోరు తెరుచుకుని చూస్తూ నిలబడింది అమృత,అలా శవాన్ని లాక్కు వెళ్లి,మళ్ళీ షేడ్ దగ్గరికి వచ్చిన భార్గవి గడ్డ పార,పలుగుని తీసుకుని  వెళ్ళింది.అక్క చేస్తున్నది ఏమిటో తెలియక పోయిన అక్క వెనకే వెళ్ళింది.అక్కడ ఇద్దరూ  వెళ్లి ఒక మామిడి చెట్టు కింద గుంతని భార్గవి తవ్వుతూ ఉంటే,అమృత మట్టిని లాగుతుంది.అలా ఒక అద్ద గంట తర్వాత ఒక పెద్ద గుంట తవ్వారు, ఆ తర్వాత ఇద్దరూ కలిసి వినాయకం శవాన్ని తీసుకుని వచ్చి,ఆ గుంటలో వేశారు.మట్టి ఎప్పటిలా కప్పి పెట్టారు.

ఆ తర్వాత వాన నీటిలో మట్టి అంటుకున్న గడ్డ పారని కడిగి,పెట్టి ఇద్దరూ ఇంకేమైనా ఉన్నవేమో అని చూసారు.షేడ్ లో అంత కడిగినట్టు గా ఉంది. అక్కడ అసలు హత్య జరిగిన ఆనవాళ్లు కూడా ఏమి కనిపించడం లేదు.

అంతా చూశాక ఇక ఏమి లేవని నిర్ధారణ చేసుకుని తోట లోంచి బయటకు వచ్చారు. వాన కొంచం తగ్గింది. భార్గవి,అమృత ఇద్దరూ గేట్ బయటకు వచ్చే సరికి తాత వస్తూ కనిపించాడు.ఇద్దరి గుండెలు కిందకి జారాయి భయంతో. అయినా బయటకు కనిపించకుండా నిబ్బరంగా  ఉన్నారు..

ఎమ్మా మీరెంది ఇక్కడ అని అడిగాడు తాత, ఏమి లేదు తాత మామిడి కాయల కోసం వచ్చినం,నువ్వు కనిపించలేదని వెళ్లిపోతున్నాం అని అంది భార్గవి.అవునమ్మా మా బిడ్డ కు జరం వచ్చింది అని అల్లుడు ఫోన్ చేస్తే పోయి వచ్చిన,అని అన్నాడు తాత, అవునా తాత,మరి ఇప్పుడు ఎలా ఉంది అని అడిగింది భార్గవి కొంచం భయం తగ్గడం తో,బాగానే ఉంది తల్లి,అని ఆగుండి మీకు కాయలు తెంపి ఇస్తాను అని అన్నాడు.

వద్దు తాత మళ్ళీ రేపు వచ్చి తీసుకుంటాం,నాయిన వచ్చిండు అంట పోవాలి అని అంది భార్గవి.హ సరే అమ్మా ,మెల్లిగా వెళ్ళండి,అసలే రోజులు బాగలేవు,చీకటి అయ్యింది అన్నాడు తాత. అప్పుడు సమయం రాత్రి తొమ్మిదిన్నర అవుతుంది.

సరే తాత పోయి వస్తాం.అని ఇద్దరూ అక్కడి నుండి వెళ్లి పోయారు.తాత షెడ్డు లోకి వెళ్ళిపోయాడు.షెడ్డు లోకి వెళ్లిన తాత  అక్కడ జరిగింది తెలుసుకోగలడా? అతను వినాయకం శవాన్ని చూస్తాడా ?అసలు ఏమి జరుగుతుంది ? తెలుసుకోవాలి అంటే తదుపరి భాగం లో చదవండి.    ……….

 

—–  భవ్య చారు

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Related Posts