అమ్మాయి కోసం పార్ట్ -6

అమ్మాయి కోసం పార్ట్ -6

అమృత వినాయకo అనే రౌడీ చేతిలో అత్యాచారం అవబోతూ అతన్ని నుండి తతను తాను కాపాడుకోవడానికి అతన్ని పక్కనే ఉన్న చాకు తో పొడిచి చంపేస్తుందిఅక్కడికి వచ్చిన భార్గవి అమృత పరిస్థితి ని చూసి ఆ శవాన్ని ఇద్దరూ కలిసి అదే మామిడి తోపులో గుంట తీసిఅందులో పూడ్చి పెడతారుఅక్కడ నుండి వెళ్లిపోతు ఉండగా తాత రావడంఎందుకు వచ్చారు అని అడుగుతాడు దానికి భార్గవి మామిడి కాయల కోసం వచ్చామనినువ్వు కనిపించక పోవడంతో వెళ్లిపోతున్నాము అని అంటుందితాత సరే అని షెడ్డు లోకి వెళ్తాడుతాత షెడ్డులో వినాయకం శవాన్ని చూసాడా?లేదా  ఇక చదవండి

తోట నుండి వచ్చే సరికి ఇంకా తండ్రిఅన్నయ్య ఎవరూ రాకపోవడంతో ఊపిరి పీల్చుకున్న భార్గవిచెల్లి అమృత కు బాగా నచ్చ చెప్పిఅమృత భయం తిరేలా చేసిందిఆ తర్వాత వేడినీళ్ల తో స్నానం చేయించివిడిచిన ఆ బట్టల్ని పొయ్యి లో వేసిందిఆ తర్వాత చెల్లికి అన్నం పెట్టిఏమి ఆలోచించకు అని చెప్పి పడుకోబెట్టిందిఇంతలో అన్నతండ్రి ఇద్దరూ వచ్చారు వారికి అన్నం పెట్టేసితానూ కూడా తిన్నాను అనిపించిపడుకున్నారు అందరూకానీ వారిద్దరికీ ఆ రాత్రి కాళరాత్రి అయ్యింది

ఎప్పటిలా తెల్లారింది భార్గవి రోజు వారి పనులు చేస్తున్నాఎప్పుడు ఎవరొచ్చి ఏమంటారోఎవరొచ్చి ఆ శవాన్ని గురించి అడుగుతారో అని గుండెలు అదురుతున్నాయి అయిన పైకి గoభిరంగా ఉండిచెల్లికి కళ్ళతోనే ధైర్యం చెప్తుందితెల్లారి తొమ్మిది అవుతున్నా ఇంకా స్కూల్ కి రెడి అవ్వన్ని చిన్న కూతుర్ని చూసిన నారాయణ ఎమ్మా అమృత ఈ రోజుబడి కి వెళ్ళవా అని అడిగాడుదానికి భార్గవి తండ్రితోదానికి ఒంట్లో బాగాలేదు నాయనాఅందుకే ఈ రోజు వద్దు అని చెప్పిన అంది గట్లన మరి అదేందో డాక్టర్ దగ్గరికి పోయి వస్తారా బిడ్డా అని అన్నాడు-అమ్మాయి కోసం పార్ట్ -6.

ఇద్దరూ ఆడ పిల్లలే కావడం వారికి ఏ సమస్య లు ఉన్నాయో అనే ఆలోచనతో వద్దు నాయనా ఒళ్ళు వెచ్చ బడ్డది అంతేఈ ఒక్కరోజు ఇంట్లో ఉంటే అయిపోతాది అంతగా అవసరం అయితే నీకు ఫోన్ చేస్తా అని తండ్రికి టిఫిన్ బాక్స్ ఇచ్చిపంపించింది పొలానికిఅయితే సరే బిడ్డాపైలం అని అంటూ నారాయణ బయటకు వెళ్ళడానికి చెప్పులు వేసుకున్నాడు ఇంతలో

ప్రొద్దున్నే బయట తిరగడానికి వెళ్లిన మాణిక్యం బండి మీద వచ్చిబండి మీద నుండి ఒక్క దూకు దూకాడుఅయ్యో గదెంది రా బండి కి స్టాండ్ వేయకుండా వదిలేస్తివి అన్నాడు నారాయణ ఓ నాయిన ఇటూ రా లోపలికి అని లోపలికి తండ్రిని లాక్కు వెళ్ళాడు అన్న మాణిక్యం అలా చేయడం చూసిన భార్గవి అమృతలకు ఒళ్ళు జలదరించింది ఒక్కక్షణం ఏం చెప్పబోతున్నాడో అని చేతుల్లో చెమటలు పట్టాయి ఇద్దరికి

ఏంది రా నన్ను గుంజుకుని వస్తున్నావు ఇడువు అన్నాడు నారాయణ నాయనా ఒక మాట చెప్తా విను గా శ్రావణ్  మా అన్న దగ్గర ఉండేటోన్ని హత్య చేసిండు అంట రాత్రివాన్ని పోలీసులు పట్టుక పోతున్నారుఇంకా నయం మన పిల్లను ఇచ్చి పెళ్లి చెయ్యలేదు ఇంకావాడు ఇలాంటోడు అని నాకు ముందే తెల్సు అందుకే దీనికి చెప్పిన వాని సోపతి పట్టకే అని అంటూ ఇంకేదో చెప్తున్నాడుఫట్ మంటూ మాణిక్యన్నీ కొట్టాడు నారాయణఅది చూసిన భార్గవి అమృత ఇద్దరూ భయంతో రెండు అడుగులు వెనక్కి వేశారు ఎప్పుడూ  ఒక్క మాట అనని తండ్రి తనని కొట్టడం తో మాణిక్యం నివ్వెర పోయాడుఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు నీకు  అతని గురించి ఏం తెలుసు అని మాట్లాడుతున్నావు అతని కాలి గోటికి కూడా సరిపోవు నువ్వు అతని గురించి మాట్లాడే అర్హత కూడా నీకు లేదు అతనెంత మంచి మనిషో నాకు తెలుసు

అని అంటూ భార్గవి వైపు చూసి అమ్మా భార్గవి చాలా గొప్ప వ్యక్తిని ప్రేమించావు అమ్మాఅతను నిన్ను ప్రేమించడం మన అదృష్టం తల్లి మనలాంటి వాళ్ళని తన వాళ్ళు అనుకోవడం ఆయన మంచి బుద్ధికి నిదర్శనం అమ్మా నీకు తెలిదు అతనెంత మంచి మనిషో నాకు తెలుసుఅని అతని ముందు మేము చాలా చిన్నవాళ్ళo అని అంటున్న తండ్రికేసి విచిత్రంగా చూసిన భార్గవి నాయిన ఏం మాట్లాడుతున్నావు శ్రావణ్ కు ఏమైంది చెప్పు నాయనా అంటూ తండ్రిని పట్టుకుని ఊపింది అమ్మా తల్లి భార్గవి” నిన్ను ప్రేమించినందుకు ఆ బాబు చాలా త్యాగం చేసాడు తల్లి మన కుటుంబం బాగుండాలి అని తన కుటుంబం గురించి క్షణం అయినా ఆలోచించక తన జీవితం పాడవుతున్నా కూడా నీ భవిష్యత్తునీ చెల్లి భవిష్యత్తు బాగుండాలి అని నీ చెల్లి చేసిన హత్యా నేరాన్ని తన మీద వేసుకున్నాడమ్మా వినాయకo తో తనకు పాత పగలు ఉన్నాయని అందుకే అతన్ని తోటలో హత్య చేసాను అని వెళ్లి పోలీసులకు లొంగిపోయాడు అమ్మాఅని అంటూ చెప్తూ గట్టిగా ఏడ్చేశాడు నారాయణ

అంతా వింటున్న భార్గవి అసలు ఏం జరిగిందో చెప్పు నాన్నాఅసలు మేము తోటలోకి వెళ్ళమని శ్రావణ్ కి ఎలా తెలుసు నీకు ఎలా తెలిసింది తెలిసాక మరి నువ్వు  ఎందుకు మమ్మల్ని అడగలేదు నీ కూతురి జీవితం బాగుంటే చాలు అనుకున్నావా అసలు శ్రావణ్ గురించి ఒక్కసారి అయినా ఆలోచించవా  అతను నన్ను ప్రేమించడం అతను చేసిన తప్పా వాళ్లకి కూడా కుటుంబం ఉంది అతను హత్యా నేరం ఒప్పుకుంటా అంటే నువ్వు ఎందుకు ఆపలేదు నాన్నా అంటూ ఏడవసాగింది భార్గవి అక్కా నా వల్లే ఇదంతా జరిగిందిఆ హత్య నేనే చేసాను అని పోలీసులకు వెళ్లి చెప్తా అక్కా అంటూ అమృత కూడా ఏడవసాగింది

ఇంతలో మాణిక్యం మీరేనా అన్ని త్యాగాలు చేసేది నేను అతన్ని ముందు చెడుగానే అనుకున్నాకానీ అమ్మ చనిపోయినప్పుడు అతను చాలా సహాయం చేయడం వల్ల నాకు అతని మంచితనం తెలిసి వచ్చింది  కానీ ఇంత మంచి వాడు అనుకోలేదు నా చెల్లి గురించి ఆలోచించినా కుటుంబం కోసం జైలు కి కూడా వెళ్తున్నాడు అంటే అతను ఎంత గొప్ప మనిషో అర్థం అవుతుంది కానీ నాయనా  నీకు ఇదంతా ఎట్లా తెలిసింది ఎవరు చెప్పారు అని అన్నాడు కుతూహలంగా అవన్ని  తర్వాత ముందు నేను శ్రావణ్ ని చూడాలి అంది భార్గవి శ్రావణ్ ని చూస్తావా ఎక్కడికి అని వెళ్తావు పోలీసు స్టేషన్ కి వెళ్తే మన గురించి అందరూ వింతగా మాట్లాడుకుంటారు మనం వెళ్లడం కుదరదు అన్నాడు మాణిక్యం ఒక్కసారి అన్నయ్య దూరం నుండి చూసి వచ్చేద్దాం అని అనడం తో సరే ఇప్పుడు కాదు ముందు తీర్పు రాని అప్పుడు చూద్దాం అన్నాడు మాణిక్యం తండ్రి కూడా ఏమి మాట్లాడక పోవడంతో  భార్గవి ఏమి చేయలేక మౌనంగా ఉంది

ఇక ముందు ఏమి జరగబోతుంది ? శ్రావణ్ చెసిన త్యాగానికి ఫలితంగా వారిద్దరూ ఏం అవబోతున్నారు? ఏమి జరగబోతుంది? శ్రావణ్ ఇంట్లో పరిస్థితి ఏమిటి ? తెలుసుకోవాలంటే  తదుపరి భాగం లో చదవండి

***భవ్య చారు

Related Posts

1 Comment

  1. ఆత్మరక్షణ కోసం చంపారు కానీ భయం వల్ల విషయం దాచినా ఎప్పుడో ఒకప్పుడు బయటపడుతుంది.

Comments are closed.