అమ్మాయి మనసు…

అంశం:⁠- అమ్మాయి మనసు
తేది:⁠- 16/10/2023
శీర్షిక:⁠- చైతన్యం

                          ఒక అమ్మాయిగా తన భవిష్యత్తు గురించి ఎన్నో కలలు కంటుంది కానీ ఆ కలలన్నీ నెరవేర్తే ఇక జీవితం నుండి ఏ పాఠం నేర్చుకుంటామో అలాగే కొన్ని జీవితాల్లో జీవితంలో కొన్ని అనుకోని మలుపుల వల్ల కొందరికి వెలుగుని పంచుతూ మరికొందరికి అన్యాయం జరిగితే పోరాడుతూ మరికొందరు బలైపోతూ కనిపిస్తున్నారు.

ఒక అమ్మాయి మనసు తెల్లటి కాగితం లాంటిది దానిమీద ఏది రాస్తే అదే మన తలరాత.

ఆ కాగితం మీద ఆ కాగితాన్ని నలిపేసిన కూడా పనికిరాకుండా పోతుంది.

అలాంటి కాగితం లాంటి మనసున్న అమ్మాయి ఒక ఇంటి నుండి మరొక ఇంటికి కోడలి బాధ్యతలు తీసుకుని కోడలు అయ్యి బాధ్యతలు తీసుకొని అందరూ నా వాళ్లే అనుకుంటూ తన భవిష్యత్తు వాళ్లేనని బ్రతుకుతూ ఉంటుంది.
ఒక అమ్మాయి నుండి అమ్మాయి అంతవరకు తన బాధ్యతలన్నీ నిర్వహిస్తూ ఉంటారు.

ప్రతి అమ్మాయి తెలుసుకోవాల్సింది ఒకటి ఉంది అది ఏమిటంటే ఇప్పుడు మా ప్రపంచంలో ప్రేమ ఒక మోసం.
నువ్వు ఒకరి కోసం త్యాగం చేస్తే దాంట్లో మంచిది గుర్తిస్తే మంచిదే కానీ దాంట్లో కూడా చెడుని చూస్తే అలాంటి వాళ్ళతో ఉన్న వ్యర్థమే.

కొన్ని జీవితంలో అలాంటి వాళ్లతోనే ముడిపడి ఉంటాయి , అది ఎవరైనా సరే.

ప్రవళిక కొన్ని టీవీ చానల్స్ వాళ్ళు ఆత్మహత్య చేసుకున్న అంటున్నారు. మరి కొందరు హత్య అంటున్నారు కానీ అది ఏది నిజం మాత్రం అక్కడ చెప్పడం లేదు.

ఒకరిని ప్రేమించి మోసపోయింది అందువల్లే తను ఆత్మహత్య చేసుకుంది అంటున్నారు.
గ్రూప్ ఎగ్జామ్స్ వాయిదాలు పడడం వల్ల  ఒత్తిడికి లోనవడం వల్ల ఆత్మహత్య చేసుకున్న అంటున్నారు.

అమ్మాయి మనసులో అంత పిరికిది కాదు. కొన్నిసార్లు మన ఆలోచనలే ఒత్తిడికి డిప్రెషన్ లోనికి వెళ్లేలా చేస్తాయి.
బతుకు వెతుకులాటం కోసం ఒక ఊరు నుండి మరొక ఊరికి వచ్చినప్పుడు కొందరిది చీకటి కోణాలు తెలిసిన ఎవరికి చెప్పలేని స్థితిలో ఉంటాము. భిన్నమైన మనుషుల మధ్య జీవిస్తున్నాము. వాళ్ళ బుద్ధి చెప్పాలని ప్రయత్నం చేస్తూ ఉండగా వాళ్లే మనకు సమస్యగా తయారు అవుతారు.

ఒక అమ్మాయిగా ఇప్పుడు ఉన్న సమాజంలో ప్రతి విషయాన్ని పరిశీలిస్తే గాని ఏ నిర్ణయం తీసుకోకండి. మన వాళ్ళని మనమే బాధ పడేలా చేస్తున్నాము.

మమ్మల్ని నమ్ముకొని  తల్లిదండ్రులు ఉంటారు. వాళ్ళు మన మీద ఆశలు పెట్టుకున్ని బ్రతుకుతూ వాళ్ళకి మన చావు కబురు చెప్పి జీవితమంతా జీవచ్చంలా బ్రతికేలా చేస్తున్నారు.

ప్రవళికది హత్య అయితే ఆమె రాసిన ఉత్తరం ఎవరో రాశారు. అదే ఆత్మహత్య అయితే ప్రేమ వ్యవహారం కారణం అని అంటున్నారు.

ఈ రెండిట్లో ఏది నిజమో ఎవరికి తెలియడం.
ఒక అమ్మాయిగా తన ఎంత బాధ అనుభవించిందో అది దేవుడికి తప్ప ఎవరికి తెలీదు..
ఒక అమ్మాయి మనసు ఎంతో సున్నితమైనదో అంతే ధైర్యంగా ఉండాలని తెలుసుకోండి. అదే మనకి మన కుటుంబానికి మంచిది.

ఇతరులతో సూటిగా నిర్మొహమాటంగా మాట్లాడే పొగరు అని అర్థం చేసుకుంటారు. అలాగే మొహమాటంగా మాట్లాడితే భయపడుతుంది అని ఒక అంచనానికి వచ్చేస్తారు.

మనలో రావాలి చైతన్యం.  ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేయకండి. మనలో రావాలి మార్పు.
టెన్షన్ , ఒత్తిడి వలలో పడకుండా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయండి.

మాధవి కాళ్ల..

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *