అమ్మా నన్ను వేధించకు…ఆడపిల్ల కడుపున

కవిత అంశం: అమ్మా నన్ను వేధించకు

ఆడపిల్ల కడుపున పడంగా
తలచిన ఎందుకు పెనుబారంగా
నీ అమ్మ ఆడది
నీ తల్లి ఆడది
నీ చెల్లి ఆడది
తోటి ఆలీ ఆడది
ఆడపిల్లని చెవిన పడగానే
బిడ్డ నేల పడకుండా
బుడిబుడి అడుగులు వేయకుండా
కన్నవారే కడుపున బిడ్డను
కడుపు కడుక్కునే తీరును
క్షణమైనా పాపం అని ఆలోచించరా
నవ మాసాలు మోసి
నీ రక్తం ఇచ్చేసి
జీవము నాలో పోసి
నీది ఈ హక్కు అంటూ
చివరకు నీవు ఇచ్చిన ప్రాణాలు
నీవే తీసుకుని పోతివి
అమ్మ..
నేలపడంగా
నిన్ను చూచి
నమస్కరిద్దాం అనుకున్న
ఎందుకంటే నా ప్రాణ దేవతవు
వయసు వచ్చి పెద్దయి
నిన్ను కష్టపెట్టక
కన్నీరు పెట్టనీయక
నీకు చేతు సాయం తల్లి
అని అనుకునే పరవశించు సమయాన
నేలపడని ముద్దు టోంగరం మళ్లీ
కడుపున కాయనుకొని
తుంచావా తల్లి
డాక్టర్ గారు
తుదకు మీరైనా చెప్పరే
నా కొరకు ఉన్న చట్టాలు
నా కొరకు ఉన్న స్మశాన వాటికలు
అమ్మ మరు బిడ్డనైనా తుంచకు
నన్నైనా చేర్చకు మరు భూమి చెంతకు అమ్మ..
నన్ను చంపొద్దు
అమ్మా నన్ను వేధించవద్దు.

– యడ్ల శ్రీనివాసరావు
—————————————-
హామీ పత్రం
ఈ కవిత నా యొక్క సొంత రచన

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *