అమ్మ అనే పదంలోనే మమకారం ఉంటుంది..

అమ్మ అనే పదంలోనే మమకారం ఉంటుంది.
నాన్న అనే పదంలోనే
ఆప్యాయత ఉంటుంది.
తెలుగు భాషకు మించిన
భాష మన ఇలలోనే లేదండీ.
పిల్లలకు తెలుగు నేర్పించాలి.
అన్న, అక్క,తమ్ముడు,చెల్లి
అని వారు నోరారా పలికాలి.
తెలుగు భాష కమ్మదనాన్ని వారు ఎల్లప్పుడూ గ్రహించాలి.
అందుకే ప్రతిఒక్కరు పదుగురికి మన తెలుగు భాష నేర్పించాలి.
తెలుగులోని తియ్యందనాన్ని
అందరికీ కూడా పంచేద్దాం.

ఈ రచన నా స్వీయ రచన అని
హామీ ఇస్తున్నాను.

 

వెంకట భానుప్రసాద్ చలసాని

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *