కర్మ కాటు వేస్తుంది
ధర్మం కాపాడుతుంది
ఈ సత్యం గ్రహిస్తే
బ్రతుకు బాగుపడుతుంది
జీవిస్తే నీతిగా
కాంతులీను జ్యోతిగా
భవిష్యత్తు ఉంటుంది
ఖచ్చితంగా గొప్పగా
పదిమందికి సాయంగా
జీవితాన న్యాయంగా
ఉంటేనే గొప్పదనము
చూపిస్తే మంచితనము
మేలు చేయని జీవితము
కీడు చేయు వ్యక్తిత్వము
ఎప్పటికైనా ముప్పే
కల్గియున్న శత్రుత్వము
ఇట్లు
మీ
కోటేశ్వరరావు ఉప్పాల