నాటి తల్లికి నేటి తల్లికి గల వ్యత్యాసం

అమ్మ ప్రేమ స్వరూపం

అమ్మ ప్రేమ స్వరూపం

నవమాసాలు మోసిన తల్లి కన్న కలల కళా రూపం తన బిడ్డపై అపురూప ప్రేమ సాదృశ్యం,,,, ,,,,,
తన ఎదపై ఆడుకునే బిడ్డ ఆ అమృతమయ ప్రేమ లాలిత్యాన్ని చూరగొనే పసికందు అమ్మను హత్తుకుని సౌఖ్యంగా స్వర్గంలో ఉన్నట్లు ఇహలోకం తెలియని బహుసున్నితమైన ఆనందం అనుబంధం బిడ్డది,,,,,,,,
తల్లి చనుపాలిచ్చి తన బిడ్డపై ఎనలేని ప్రేమ అమృతాలు కురిపించే త్యాగమూర్తి నూతన సృష్టికి, పుట్టుకకు కారణభూతి,,,,,,,,
తల్లి ప్రేమ నవనీతం తన బిడ్డ బోసినవ్వులలో హరివిల్లులను చవిచూసే అద్భుతమైన ఆనందాల పెనవేత గోరుముద్దలు తినిపిస్తూ లాలిపాడుతూ లాలించే తల్లి హృదయం మీగడ తరగలు,,,,,,,,
తన బిడ్డ ఎక్కడ ఏడుస్తుందోయని కంటికి రెప్పలా కాపాడుకునే తల్లి ప్రేమ మధురం సుమధురం తన జీవితమే బిడ్డకోసమన్నట్లు ఆ ఊపిరి బాసలు తనకు బిడ్డకు మద్య ప్రేమ అనురాగాల సేతువు,,,,,,,,
అంత అలవికాని ప్రేమ రంగరించి పోసిన తల్లిని పెద్దవాడైనా చిన్న దెబ్బతగిలినా అమ్మా అననిది మానుకోడు అప్పుడు ఈ సృష్టిలో ఎవ్వరూ గుర్తుకురారు,,,,,,,,,,
అందుకే అన్నారు అమ్మ ప్రేమకు మారుపేరు అని. నీ రూపం శిల్పం అంతా అమ్మ గారాబాల ప్రతిరూపం, దర్పణంలో ముఖం చూసుకున్నట్లు హృదయం నుంచి హృదయం ఉద్బవించిన దైవానికి దాసునివి,,,,,,,,

అపరాజిత్

1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *