అర్మాన్ మాలిక్
అర్మాన్ మాలిక్ (జననం 22 జూలై, 1995) భారతీయ నేపథ్య గాయకుడు, పాటల రచయిత , వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్, నటుడు. ఆయన గతంలో యూనివర్సల్ మ్యూజిక్ ఇండియా, టి-సిరీస్ ద్వారా ప్రాతినిధ్యం వహించి ఇప్పుడు అరిస్టా రికార్డ్స్ ద్వారా నిర్వహించబడుతున్నారు. ఆయన 2007లో తారే జమీన్ పర్ సినిమాలో “బమ్ బమ్ బోలే” పాటతో బాలీవుడ్‌లో బాల గాయకుడిగా అరంగేట్రం చేశాడు. ఆయన 2011లో కచ్చా లింబూ చిత్రంలో తొలిసారిగా తెరపై కనిపించాడు.
అర్మాన్ మాలిక్ 2023 ఆగస్టు 28న తన ఆరు సంవత్సరాల జీవిత భాగస్వామి ఆష్నా ష్రాఫ్‌తో తన నిశ్చితార్థాన్ని ప్రకటించాడు. 2025 జనవరి 2న మహాబలేశ్వర్‌లో జరిగిన ఒక వేడుకలో వివాహం చేసుకున్నారు.
టెలివిజన్
2006: స రే గ మ పా ఎల్’ఇల్ చాంప్స్ , పోటీదారుగా.
2012: ది సూట్ లైఫ్ ఆఫ్ కరణ్ & కబీర్ (సీజన్-1 ఎపిసోడ్-22), జాఫర్ అలీగా
2015: ఇండియన్ ఐడల్ జూనియర్ 2 అతిథిగా.
2016: ది కపిల్ శర్మ షో (సీజన్ 1, ఎపిసోడ్-15), అతిథిగా
2016: స రే గ మ ప , అతిథిగా.
2017: ది డ్రామా కంపెనీ (ఎపిసోడ్ 23వ), అతిథిగా.
2019: నం. 1 యారి జామ్ (ఎపిసోడ్-2), అతిథిగా.
మిర్చి మ్యూజిక్ అవార్డులు “నైనా” – ఖూబ్‌సూరత్ ఆ సంవత్సరపు రాబోయే పురుష గాయకుడు నామినేట్ అయ్యారు
“బాస్ ఇస్ పాల్ మెయిన్” ఇండి పాప్ సాంగ్ ఆఫ్ ది ఇయర్
గ్లోబల్ ఇండియన్ మ్యూజిక్ అకాడమీ అవార్డులు ఔలియా – ఉంగ్లి ఉత్తమ నూతన నటుడి అవార్డు – సినిమా.
స్టూడియో ఆల్బమ్‌లు
అర్మాన్ (2014)
MTV అన్‌ప్లగ్డ్ సీజన్ 7 (2018)
ఫిల్మోగ్రఫీ
కచ్చా లింబూ (2011) అర్మాన్‌గా
డబ్బింగ్ ఆర్టిస్ట్ గా
అల్లాదీన్ (2019) అల్లాదీన్ గా
హెన్రీ పాత్రలో ఎ మైన్‌క్రాఫ్ట్ మూవీ (2024)
మాధవి కాళ్ల