అల్లరి చిల్లర చిన్నతనం

అక్షర కొరకు
అంశం: పండుగ చిలిపి మిఠాయిలు ( చిత్రకవిత)
శీర్షిక: అల్లరి చిల్లర చిన్నతనం !!

చిలిపి చేష్టల చిన్నతనం
ఆ రోజు అమ్మతో నేను చెల్లాయిలు అమ్మమ్మ ఊరికెళ్ళాం……
నాకు అపుడు ఎనిమిదేళ్ల వయసు
అమ్మమ్మకు నేనంటే చాలా ఇష్టం
నేను చెల్లాయిలు ఇంట్లో ఆడుకుంటుంటే అమ్మమ్మ ఇల్లు అంతా సందడిగా ఉంది……..
అమ్మ అమ్మమ్మ పొయ్యి దగ్గర కూర్చుని పిండివంటలు చేస్తున్నారు……..
నేను ఆడుకుంటున్నాననే గాని నా మనస్సు అంతా ఆ లడ్డూలు, అరిసెలు,చేగోడీల మీదే ఉంది……..
అమ్మను గాని అమ్మమ్మ ను గాని అడిగితే, అమ్మ చివాట్లు పెట్టి కొడుతుంది.. ఎలా…..!!
అమ్మమ్మ అప్పలన్నీ చేశాక కుండలో పెట్టి చాలా ఎత్తులో ఉట్టిలో పెట్టింది…….
అది నా కంట పడగానే నోట్లో నీళ్ళు ఊరుతూ ఎలాగైనా కొట్టేసి తినాలని గంపెడు ఆశ………
అమ్మ ,అమ్మమ్మ ఇంటి ముందు ఏదో ముచ్చట్లు పెట్టుకుంటున్నారు……..
నేను నెమ్మదిగా మూలకున్న స్టూలు ఉట్టి కింద పెట్టి నెమ్మదిగా పైకెక్కి ఉట్టిని అందుకో బోయాను…,…..
అనుకోకుండా స్టూలు స్లిప్పయి దబేల్మణి ఉట్టి లోని కుండతో సహా కింద పడ్డాను……….
అప్పలన్నీ చెల్లాచెదురుగా కిందపడ్డాయి, నా మోకాళ్ళు బలంగా నేలకు గుద్దుకుని కెవ్వు మన్నాను……
అమ్మ, అమ్మమ్మ ఒక్క ఉదుటున వచ్చి, నన్ను అమ్మమ్మ కిందనుండి లేపి అడగొచ్చుగా నాన్న, చూడు ఏమయ్యిందో……..
అమ్మ వీపు చిరిగిపోయేలా కొడుతుంటే రాగాలు పెడుతున్నాను…….
అమ్మమ్మ పోన్లేవే చిన్నపిల్లాడు కొట్టమాకు మళ్ళీ చేద్దాం ఆ వంటకాలేవో అంది……..
నాన్న ఆ అప్పలు చేసింది నీకు చెల్లాయిల కేరా బడవా !! అంటూ అలుకు నేలపై పడిన అప్పలన్నీ ఏరుతూ…అయ్యో…అయ్యో ఎంత పని చేశావురా నాన్న..,…!!

అపరాజిత్
సూర్యాపేట
హామీపత్రం : ఈ కవిత నా స్వీయ రచన అని నా హామీ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *