బి టెక్ చేసి ఉద్యోగం కోసం వెతుకుతున్నాడు అనిల్ కానీ ఉద్యోగం ఎక్కడా దొరక లేదు,కాని ఇంతలోనే కరోన అనే వైరస్ మూలంగా ఇంట్లోనే ఉండాల్సిన పరిస్థితి పైగా ఉన్న వారిని తీసివేయడం తో సంపాదన కోసం ఏదైనా చేయాలి అనే ఆలోచన అతనికి వచ్చింది ఎక్కడికి వెళ్ళేది లేదు ఏ పని లేక పోవడం తో దాంతో తీరిగ్గా లేవడం బ్రష్ చేసి తిని మళ్ళి పడుకోవడం ఇదే పని గా మారింది.
దాంతో ఇక ఏం చేయాలో తెలియక నెట్ ఆన్ చేసుకుని ఫ్రెండ్స్ తో కబుర్లు మొదలు పెట్టాడు అతని కి స్నేహితులు చాలా మంది ఉన్నారు. పదో తరగతి, ఇంటర్, డిగ్రీలో కొందరు ఆ తర్వాత బి టేక్, ( డిగ్రీ అయ్యాక మళ్ళి బి .టెక్ ఏంటి అని అడక్కండి, లాజిక్ అడుగొద్దు అదంతే … 🙂 }.. కాకుండా ఫ్రెండ్స్ కి ఫ్రెండ్స్ అంటూ, ఇలా చాలా మంది ఉండడంతో ఒక రెండు రోజులు వారందరితో మాట్లాడాడు. అదే మెసేజ్ లతో కాలక్షేపం చేసాడు. అప్పుడు మిగితా ఫ్రెండ్స్ వల్ల కొన్ని గ్రూప్ లా గుంచి తెలిసి, అందులో జాయిన్ అయ్యాడు. వాటిలో చాలా వరకు తనకు తెలియనివారు ఉన్నారు. అలా ఫ్రెండ్స్, వారి ఫ్రెండ్స్ అంటూ వాల్ల గ్రూప్ లలో జాయిన్ చేసారు.
ఇలా ఒక ఇరవై గ్రూపుల్లో మెంబెర్ గా యాడ్ అయ్యాడు. అలా జాయిన్ అయిన తర్వాత అనిల్ కి బోర్ అన్నదే లేకుండా పోయింది. ఎందుకంటే అందులో అన్ని విషయాలు తెలిసేవి. వాటిని మిగితా వాళ్లకి షేర్ చెయ్యడం. వాటి గురించి చర్చలు, ఇలాంటి వాటి వల్ల అసలు సమయమే తెలిసేది కాదు. ఇలా సాగుతున్న తరుణంలో, అనిల్ కి అందులో వచ్చిన ఒక వార్తా అతన్ని ఆకర్షించింది. అదేంటయ్య అంటే, గ్రూప్ లో ఉన్న వక్తుల బ్లడ్ అవసరమని, దాతలు ఎవరైనా ఉంటె, చెప్పమంటూ అడిగేవారు.
వీలైనంత వరకు, తానూ ఆ మెసేజ్ ని ఫార్వార్డ్ చేసేవాడు. పాపం ఎవరో ఏమిటో అనుకుంటూ తన మెసేజ్ ల వల్ల, ఏ ఒక్కరికైన ఉపయోగం ఉంటుందేమోనని ఇలా చేస్తున్న సమయంలో. అతనికి ఒక ఆలోచన వచ్చింది. వెంటనే దాన్ని ఆచరణలో పెట్టలని అనుకున్నాడు అది ఏంటంటే తను ఒక ఇరవై గ్రూపుల్లో ఉన్నాడు అందులో వేలే కాదు లక్షల వరకు సభ్యులు ఉన్నారు కేవలం ఒక మెసేజ్ పెట్టడం వల్ల తాను డబ్బు సంపాదించవచ్చు కేవలం ఐదు నిమిషాల్లోనే తనకు ఎన్నో డబ్బులు రావచ్చు అని అనుకుంటూ అందులో మెసేజ్ ని ఇలా పెట్టాడు నేను ఒక వలస కూలి డబ్బు లేకపోవడం వల్ల ఊరికి వెళ్లలేక పోతున్నాను అంటూ చాలా దయనీయ పరిస్థితిలో ఉన్నాను అంటూ ఎవరైనా సహాయం చేసే వారు ఉంటే నా నెంబర్ కి డబ్బులు పంపించవలసిందిగా వ్రాసి పోస్ట్ చేశాడు
ముందు జాగ్రత్తగా తీసుకుని పనిమనిషి పేరుతో కొన్న సిమ్ కార్డు నెంబర్ ఇచ్చాడు అలా దాన్ని గ్రూప్ లో పెట్టి ఫలితం కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాడు ఏమవుతుందో అని దాదాపు గంట తర్వాత తొలివిడతగా నావల్ల ఇదే అయ్యిందంటూ ఒక 500 రూపాయలు వచ్చాయి యురేకా అంటూ తాను వేసిన ప్లాన్ సక్సెస్ అయినందుకు అలాగే తాను నిరుద్యోగి కావడంతో చేతిలో వాడుతూ ఉండటం సంతోషం కలిగించింది. డబ్బులు రాక అప్పటి నుండినుండి డబ్బులు రావడం మొదలైంది అనిల్ కి చాలా సంతోషంగా ఉంది తాను ఒక ఐదు నిమిషాలు స్పెండ్ చేసి పంపిన మెసేజ్ కి ఇలా వేలకొద్ది డబ్బులు రావడం తనకు పాకెట్ మనీ కి అందరం కూడా ఒక విధంగా లాభం గానే అనిపించింది పైగా ఆ డబ్బుతో చెల్లెలు ఎప్పుడు అడిగినా ఏమి కొని ఇవ్వలేని అనిల్ ఇప్పుడు చెల్లెలు అడగకుండానే పిజ్జా బర్గర్లు ఆన్లైన్లో అండర్ ఇవ్వడంతో చెల్లెలు c కూడా ఆనందంగా ఉంది.ఇలా రోజులు గడుస్తున్నాయి అనిల్ కి డబ్బులు రావడం మాత్రం ఆగడం లేదు
మొదట్లో వెయ్యి రెండు వేల నుండి ప్రతి రోజు 5000 నుండి పదివేల వరకు వస్తున్నాయి కూడా పెరగసాగింది అనిల్ బ్యాంకు బ్యాలెన్స్ కూడా పెరగసాగింది అతను కొత్త బైక్ కొనాలి అని అనుకున్నాడు. మంచి బైక్ బుక్ చేద్దామని అనుకుంటూ తన స్నేహితులను ఏ బైక్ బాగుంటుందో అంటూ హారాలు తీయడం మొదలుపెట్టారు కొందరు మంచి మంచి సలహాలు ఇచ్చారు. ఇంకా కొందరు మాత్రం ఉద్యోగం లేకుండా నువ్వు బైక్ కొనడం ఏంటని అన్నారు అతని గురించి తెలుసుకుని అనిల్ తన తండ్రి డబ్బు ఇచ్చాడని చెప్పడం తో వారింక ఏం అనలేదు .
దాంతో అనిల్ ఊపిరి పీల్చుకున్నాడు . అలా అతని బైక్ గురించి వెతుకుతూ ఉన్నప్పుడు ఒక కొత్త బైక్ లాంచ్ చేయబోతున్నారు అని ,ఇప్పుడే దాన్ని బుక్ చేసుకుంటే ధరలో సగం తగ్గుతుంది అంటూ అదే గ్రూప్ లో msg రావడం చూసి అనిల్ సంబరపడి పోయాడు ..తన అదృష్టం చాలా బాగుందని అనుకున్నాడు .లేదంటే తాను గ్రూప్ లో చేరడం ఏంటి చిన్న మెసేజ్ పెడితే వేలకు వేలు రావడం ఏంటి ఇప్పుడు బైక్ కొనాలని అనుకున్నప్పుడు ఇలా తక్కువ ధర అని రావడం ఏంటి నిజంగా నా జాతకం బాగున్నట్టు ఉంది అందుకే ఇలా పట్టింది బంగారం అవుతుంది అని అనుకుంటూ ఆ మెసేజ్ లో ఉన్న నెంబర్కి ఫోన్ చేశాడు కానీ వాళ్ళు ఫోన్ ఎత్తకుండా మెసేజ్ చేయమంటే రిప్లై ఇవ్వడం తో మెసేజ్ చేశాడు తనకు ఎలా కావాలో ఎంతలో కావాలి చెప్తున్నాడు నాలుగు రోజులు చాటింగులు చేశాక ఐదవ రోజు అతని ఫోన్ నెంబర్ ఆధార్ నెంబర్ పాన్ కార్డ్ నెంబర్ తో పాటు అడ్వాన్స్గా కొంత డబ్బు కట్టమని అన్నారు.
దాంతో తనకు మెసేజ్లు వల్ల వచ్చిన డబ్బులో కొంత వారికి కట్టాడు రెండు మూడు సార్లు తర్వాత అతని నుండి డబ్బులు అకౌంట్ లోకి పంపించు ఉన్నారు ఆ తర్వాత అతనికి బైక్ ను డెలివరీ చేసే తేదీని చెప్పి ఫలానా అడ్రస్ కి వెళ్ళమని చెప్పడంతో అతను సరే అన్నాడు ఆ తరువాత వారానికి అనిల్ ఉత్సాహంగా పొద్దుటే లేచి రెడీ అయిపోయి వారు చెప్పినట్లుగానే అక్కడికి తన స్నేహితులతో కలిసి వెళ్ళాడు అక్కడ ఒక బైక్ షోరూం కనబడింది దాంతో తాము కరెక్ట్ అడ్రస్ కె వచ్చాముఅని అనుకుంటూ లోనికి వెళ్లారు.
అనిల్ ఆ శాఖ మేనేజర్ వద్దకు వెళ్లి తనను తాను పరిచయం చేసుకున్నాడు అతను చూసి ఓ ఇదిగో మీరు వస్తే ఈ కవర్ ఎవరో వచ్చి ఇచ్చి వెళ్ళాడు పిల్లాడు ఇచ్చాడు. మనీ బైక్ డెలివరీ అని అని అనగానే ఏమో సార్ నాకు ఆ పిల్లాడు డు ఏం చెప్పలేదు అన్నాడు మేనేజర్ లెటర్ చదివితే ఏమైనా తెలుస్తుందేమో నని అనిల్ ఆ కవర్ ని విప్పాడు అందులోకి చూసేసరికి అందులోంచి ఒక బైక్ బొమ్మ ఒక జోకర్ బొమ్మ రెండు బయటపడ్డాయి వాడిని చూసి అవాక్కయ్యాడు అనిల్ తాను అందరిని మోసం చేస్తే నన్ను ఎవడో మోసం చేశాడని అర్థం అయి గాలి తీసిన బెలూన్ బయటకు నడిచాడు ఏమైంది అనిల్ అంటూ వచ్చిన స్నేహితులని చూసి పిచ్చి గా నవ్వి విషయం మొత్తం చెప్పాడు పోనీ పోలీస్ రిపోర్ట్ అని అనగానే వద్దు వద్దంటూ తేలు కుట్టిన దొంగలా అక్కడి నుండి జారుకున్నాడు అనిల్…..
ప్రజలు పిచ్చి వాళ్ళా ఆ మాత్రం తెలుసుకోరా అని నన్ను అడగవద్దు దయచేసి కొంత మంది చేసారు ఇలా టిక్ టాక్ లో ..అది గమనించే రాసాను .. ధన్యవాదాలు