అవిటితనం Handicapped 4

అవిటితనం

నంద కిషోర్, మాలతీకి పెళ్లి అయ్యి,మూడేళ్ళు గడిచాయి, మాలతీ ఇంకా నెలతప్పక పోవడంతో, అత్తా సణుగుడు మొదలు అయ్యింది, ఆ బాధకు నంద కిషోర్ భార్యను ఆసుపత్రిలో చూపించి, తను కూడా చూపించుకున్నాడు, ఇద్దరికీ మందులు రాసి ఇచ్చారి డాక్టర్ గారు, మందులు వాడుతూ ఉండగానె నెల రోజులకు మాలతీ నెల తప్పింది. దాంతో వారింట్లో ఆనందం వెళ్ళి విరిసింది. మాలతిని అప్పటి వరకు తిట్టినా ఇప్పుడు కాలు కింద పెట్టకుండా చూసుకుంటుంది కోడల్ని, అది చూసి మురిసిపోతుంది మాలతి.

మరి నెలలు నిండుతున్నాయి. కోడలుకు అన్ని విధాలా, అడిగినవి, అడగనివి అన్ని చేసి పెడుతుంది అత్తా సుగుణమ్మ. అత్తా తనమీద చూపిస్తున్న ప్రేమకు పొంగి పోయింది మాలతి. పైగా చుట్టుపక్కల వారితో కూడా తన కోడలు బంగారం అని అంటూ చెప్తుంటే మురిసిపోతుంది, సుగుణమ్మ ఎన్ని చేస్తున్నా, రోజులో ఒక గంట కోడలు దగ్గర కుర్చుని, ఆమెకి బోధిస్తూ, వంశాకురాన్ని కనివ్వాలని చెప్తూ ఉండేది. దానికి మాలతీ అత్తను నవ్వుతూ వింటూ, చూస్తూ ఉండేది. కానీ మనసులో మాత్రం భయపడుతూ ఉంది.

Free stock photo of assistance, blind, blindness

ఎందుకు భయం అంటే వంశాంకురాన్ని ఇవ్వమని అంటుంది. అంటే నన్ను కొడుకునే కనుమని ఆర్డర్ వెస్తుంది, కాని పుట్టేది ఎవరో ఏమిటో తనకి ఎలా తెలుస్తుంది. ఆడపిల్ల పుడితే ఎలా, అనే భయం తో ఉంది మాలతి. ఎవరూ పుట్టిన తనేమి చెయ్యగలదు, సరే ఎలాగు రెండు నెలల్లో తేలుతుంది కదా అని అనుకుని మనస్సుని ప్రశాంతంగా ఉంచుకుంది మాలతి. అలా రోజులు గడుస్తు ఉండగా…..

ఒక రోజు రాత్రి మాలతికి నొప్పులు వచ్చాయి, వెంటనే ఆసుపత్రికి తీసుకుని వెళ్లారు నంద కిశోర్ తల్లి సుగుణమ్మ, మాలతిని నన్నడ కిషోర్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు, మాలతికి ఎవరూ లేరు, పిన్ని, బాబాయి దగ్గర పెరిగింది, వాళ్ళు కూడా ఈ మధ్యనే చనిపోవడంతో అత్తయినా, అమ్మ అయినా సుగుణమ్మే అన్నిఅయ్యి చూసుకో సాగింది. ఇక మాలతికి నొప్పులు వచ్చి,లేబర్ రూమ్ లోకి తీసుకు వెళ్ళిన తర్వాత నంద కిషోర్ కూర్చుంటే, సుగుణమ్మ మాత్రం అటూ, ఇటూ తిరుగుతూ టెన్షన్ గ ఫీల్ అవ్వసాగింది.

అబ్బా అమ్మా. తనకి ఏమి అవ్వదు, అంతా బాగానే ఉంటుందిలే, వచ్చి ఇలా కూర్చో అని అంటుంటే, ఒరేయి నందు నీకేం తెలుసురా, ఒక ఆడ పిల్లకు పురుడు అంటే ఎంత కష్టమో, ఆడది పురుడు పోసుకోవాలి అంటే మరోజన్మ ఎత్తడం వంటిదేరా అని అంటూ ఎదో చెప్పబోయేంతలో ఒక నర్స్ వచ్చి,సర్ మీకు పాప పుట్టింది అని అంటూ చెప్పి, లోపలికి వెళ్లిపోయింది…

పాప అని వినగానే నంద కిషోర్ మొహంలో, రంగులు మారాయి. సుగుణమ్మ మాత్రం గబగబా లోనికి వెళ్ళింది కోడల్ని చూడడానికి, అక్కడ బెడ్ మిద అలసిన మాలతీ, నిద్రపోతుంది. వీళ్ళు వచ్చిన అలికిడికి కళ్ళు మత్తుగా తెరిచి చూసింది, ఆ తర్వాత తెలివి కొంచం తెచ్చుకుని, అత్తగారి చేతుల్లో చూసింది. సుగుణమ్మ మాలతిని సంతోషంగా చూస్తూ, అమ్మా మాలా మా ఇంటికి శుక్రవారం నాడు మహా లక్ష్మి వచ్చిందమ్మా అని అంది, చేతిలోని పాప ని చూపిస్తూ, అత్తగారి సంతోషం చూస్తూ ఆశ్చర్య పోయింది మాలతీ.

అంతవరకూ బాబుఅని అన్న అత్త అలా చేయడం చూసి, అది గమనించిన సుగుణమ్మా, ఎవరైతే ఏంటమ్మా అంది మాలతీ తో, భర్త వైపు చూసింది మాలతీ, నంద కిషోర్ మొహం కొంచం రంగు మరి కనిపించింది. మొహంలో సంతోషం లేదు. అది చూసి, కొంచం బాధ పడింది మాలతీ, అయినా తనకూ ఎలా ఉందో అని టెన్షన్ పడుతున్నాడో, పడ్డాడు అని సరి పెట్టుకుంది. నాలుగు రోజులు అయ్యాక డిచార్జి అయ్యి, ఇంటికి వచ్చింది మాలతి.

ఇంటికి వచ్చి రోజులు గడుస్తున్నా, నంద కిషోర్ పాప ని దగ్గరికి తియ్యక పోవడం ముట్టుకోక పోవడం చూసి, మాలతీ మనసు చివుక్కుమనసాగింది. అంత వరకు అత్తయ్య ఏమంటుందో అని భయ పడిన మాలతికి అత్త పాపని బాగా చూసుకోవడం చూసి ఉపిరి పీల్చుకుంది. కానీ భర్త వైఖరి మాత్రం తెలియడం లేదు.

అవిటితనం

Persons Hand on White Paper

అసలు తనకు పాప పుట్టింది అనే సంతోషం కూడా అతని మొహంలో కనిపించడం లేదు. ఇంతలో పురుగు మిద పుట్రలా పుట్ట్టిన పాపకు మాటలు రావని తెలిసింది డాక్టర్ల ద్వారా, బిడ్డ కడుపులో ఉన్నప్పుడే,ఎదో లోపం వల్ల మాట పడిపోయిందని,కొన్నాళ్ళు ట్రీట్మెంట్ ఇస్తే మాటలు వస్తాయి అని చెప్పారు.

దాంతో ఇంట్లో నందకిషోర్ చిరాకు ఎక్కువ అయ్యింది. ముందే ఆడపిల్లని కన్నావు, పైగా అదొక మూగది అంటూ ఎత్తిపొడుపు మాటలు, చిత్కారం చెయ్యడాలు ఎక్కువగా అవడంతో, మాలతీ అటూ పాప అలా అని బాధ పాడాలా, లేదా ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త ఇలా అర్ధం చేసుకోకుండా పిల్లనీ కనడం తన తప్పే అయినట్లు మాట్లాడడం చూస్తూ తట్టుకోలేక పోయింది.

మాలతీ బాధ చుసిన సుగుణమ్మ మాలతిని దగ్గర కూర్చోబెట్టుకుని,నువ్వేమీ బాధ పడకు మాలా వాడె కొన్ని రోజులు అయితే సర్దుకుంటాడు అని ఓదార్చడం తో తన పాప ని చూసుకుంటూ,అతని మాటలు భరిస్తుంది మాలతి. నందకిషోర్ పని చేసే ఆఫీస్ లో భాస్కర్ అనే అతను టైపిస్ట్ గా పని  చేస్తున్నాడు, ఆ రోజు నందకిశోర్ ఆఫీస్ కి వెళ్ళగానే అందరూ బయటకు వెళ్తూ కనిపించారు.

ఏంటి, ఏమయింది అని అడిగాడు నందకిషోర్, అయ్యో మీకు తెలియదా సర్, మన భాస్కర్ దంపతులు ఇద్దరూ ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించి, అది వికటించడం వల్ల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు, రండి వెళ్ళి చూసొద్దాం అని అన్నాడు వెంకటేశం. సరేనంటూ తను వెళ్ళాడు నంద కిషోర్…..

వీళ్ళు  వెళ్లేసరికి భాస్కర్ ని అతని బాస్ అడుగుతూ ఉన్నాడు ఏమయింది, ఎందుకిలా చేసారు అని, దానికి భాస్కర్ సర్ మాకు పెళ్లి అయ్యి పదేళ్ళు అవుతున్నా పిల్లలు లేరు. పెళ్లి అయిన రెండో సంవత్సరం నా భార్య ఒక బాబును కన్నది, కానీ వాడికి ఒక కాలు కొద్దిగా కుంటి ఉండడంతో, నేను వాడిని వద్దు అనుకుని, నా భార్యకు చనిపోయాడు అని అబద్దం చెప్పి, వాడినొక చెత్తకుండిలో వదిలేసాను, కానీ ఇప్పుడు, ఇన్నేళ్ళు అవుతున్నా మళ్ళి మాకు సంతానం కాకపోవడంతో అప్పుడు నేను వాడిని వదిలెయ్యక పొతే ఎంత బాగుండు అని ఇప్పుడు భాదపడి, ఇలా ఆత్మహత్య చేసుకోవాలి అని అనుకున్నాం.

Ornamental statuette in form of macaque reflecting differently in mirror on wooden table at home

కానీ, మా ఖర్మ అది కూడా మాకు రాలేదు.. సర్ నిజం చెప్తున్నా, మనకు పిల్లలు పుడితే వాడు కుంటి వాడు అయినా, గుడ్డివాడు అయినా, మాట రాని వాడు అయినా, పిల్లలు అంటూ ఒకరు ఉండాలి సర్, వాళ్ళని చూసుకుంటూ ఎంత బతుకైనా బతుకొచ్చు, మనకి చెయ్యడానికి పని లేకున్నా, మనం తినకపోయినా వాళ్ళ కోసం పనిచెయ్యాలి అని, ఇంటికి వెళ్ళాలి అని అనిపిస్తుంది. వాడు అవిటివాడు అయినా తనకూ కాళ్ళు లేకపోయినా మనల్ని చూడగానే, మన కోసం దేక్కుంటూ అయినా వస్తాడు చూడండి, అది సర్ కన్న ప్రేమ, మాటలు రాకపోయినా మనకు ఎదో చెప్పాలి, మనతో మాట్లాడాలని వాడు చేసే ప్రయత్నం చూడండి అది మనకు ఎంతో తృప్తిని, బతకాలి అనే కోరికను కల్పిస్తుంది.

పిల్లలు అవిటితనంతో పుట్టారు అని అనుకునే మనం, నేను అవిటి వాడిని అయ్యాను సర్, అప్పుడే వాడిని నాతో పాటుగా ఉంచుకుంటే ఇప్పుడు నేను నా భార్య ముందు తలెత్తుకుని ఉండే వాడిని. ఇప్పుడు ఏముందని ఇంటికి వెళ్ళాలి సర్ మేమిద్దరమే, బోరుమనట్టుగా అ ఇంట్లో, చుట్టాలు అందరూ గొడ్రాలు అంటున్న నా భార్య మొఖాన్ని చూడలేక, ఇంట్లో ఉండలేకపోయేవాడిని, అందుకే చనిపోవాలని అనుకున్నాం అంటూ వెక్కి వెక్కి ఏడ్వసాగాడు భాస్కర్…..  

అవిటితనం

అతను అంటున్న మాటలు వింటున్న నంద కిషోర్ చెంప మిద చల్లున కొట్టినట్టు గా అయ్యింది. అవును పాపం అతను పిల్లలు లేకుండా ఎంత నరకం అనుభవించి ఉంటాడో, అతని భార్య ఎంత నరకం అనుభవించి ఉంటుందో, అందుకే అతను చనిపోవాలని అనుకున్నాడు, కుంటివాడు అని వదిలేసిన పాపానికి అతనికి పిల్లలే లేకుండా చేసాడు, మరి నేను చేసింది ఏమిటి?తల్లి దండ్రులు లేని మాలతిని అగ్ని సాక్షిగా పెళ్ళి చేసుకుని, బిడ్డ పుట్టాక అ బిడ్డ అవిటితనం సాకుగా చూపి మాటలతో, చేతలతో ఆమెని వేధిస్తున్నా, నిజానికి అవిటితనం ఆ బిడ్డకు కాదు. నాకు, నేను, ఆమె కలిస్తేనే కదా బిడ్డ అలా పుట్టిoది. నా తప్పు కూడా ఉంది అని చూడకుండా ఆవిడను చాలా బాధ పెట్టాను అన్న ఆలోచన రాగానే గిరుక్కున వెనక్కి తిరిగి, వెంకటేష్ పిలుస్తున్నా వినకుండా, బండి స్టార్ట్ చేసి, ముందుకు దుకించాడు.

బయట నుండి వచ్చిన భర్త కాలు కూడా కడుక్కోకుండా, పిల్ల వద్దకు వెళ్ళి, తనని ఎత్తుకుని, ముద్దు చేయడం చూసిన మాలతి, సుగుణమ్మల కళ్ళు చెమర్చాయి ఆనందంతో……

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *