అవునా

అసలే సోమవారం కరెంటు పోతుంది అని అనుకుంటూ గబగబా లేచి నిన్నా,మొన్నటి బట్టలన్నీ వాషింగ్ మెషిన్ లో వేసి, రైస్ కుక్కర్ లో బియ్య పారేసి, వెళ్లి స్నానం చేసి వచ్చి నా బట్టలను కూడా అందులోనే వేసి దేవుడికి దణ్ణం పెట్టుకుని ,కూరగాయలు తరుగు తునే మరో వైపు పాలు కాచి చల్లార్చి పిల్లలకు రెడీ పెట్టాను, ఆ తర్వాత శ్రీవారి కోసం కాఫీ చేసి రెడీ గా పెట్టీ, కూర పొయ్యి మీద వేసి, ఫ్రిజ్ లో నుండి ఇడ్లీ పిండి తీసి ఒక వైపు ఇడ్లీ కుక్కర్, మరో వైపు కూర  వుండగానే కాఫీ తాగలేదని గుర్తొచ్చి చల్లారిన కాఫీని రెండు గుక్కల్లో తాగేసి , చట్నీ కోసం కొబ్బరి తురిమి చట్నీ చేసేసి మరోవైపు అన్నం చల్లార్చి బాక్స్ లు రెడీ చేసేసరికి అమ్మా అంటూ పిల్లలు వచ్చారు వారిని రెడీ చేసి పాలు తాగించ బోయే లోపు  శ్రీవారి అరుపులు టవల్ కనిపించడం లేదంటూ తనకి అన్నీ అమర్చి, చట్నీ తో నాలుగు ఇడ్లీ లు పెట్టుకుని  పిల్లలకూ తినిపించడం ఆలస్యం ఆటో అతని హర న్ శబ్దం వింటూనే వారికి రెండు బాక్స్ లు ఇచ్చేసి వారిని పంపి వచ్చేసరికి సోఫాలో ఆయనగారు రెడీ గా కూర్చుని కాఫీ కోసం ఎదురు చూపులు గబగబా వెళ్ళి తనకు టిఫిన్ కాఫీ అందించి, వాషింగ్ మిషన్ లో బట్టలు అరె సి వచ్చేసరికి టైం ఎనిమిది బాబో యి బస్సు అంటూ అరిచి తనకు ఒక బాక్స్ ఇచ్చేసి, నా బాక్స్ తీసుకుని బస్సు ఉంటుందా ఉండదా అనే టెన్షన్ తో  తల పగిలిపో తూ  ఉండగా .. గబగ బా నడిచి బస్ స్టాండ్ లో బస్సు నీ పట్టుకునేసరికి ఏదో సాధించిన ఫీలింగ్.. తర్వాత ఆఫీసులో పని ఇదని అదని బాస్ అరుపులను ఆనందంగా చిరునవ్వు  చెరగ నియకుండ  సాయంత్రం జీతం అందుకునే వరకు దాన్ని అలాగే మెయింటెయిన్ చేస్తూ జీతం అందగానే ఏనుగు  ఎక్కినంత సంబర పడుతూ దాన్ని అలాగే తీసుకుని వెళ్లి మా వారి చేతిలో పెడితే ఆయన ప్రశంసా పూర్వకంగా చూస్తూ నవ్విన నవ్వుకు పొంగిపోతూ ఆ రాత్రి ఆయన చేతిలో నలిగిపోయిన నాకు చేతిలో వెయ్యి రూపాయలు పెట్టారు జీతం పెరిగినందుకు కాదు నా బస్ చార్జీల కోసం అని తెలిసినా కనీసం అవ్వయినా దక్కాయని సంతోష పడుతూ మారిన తేదీని మార్చాలని చూసిన నాకు నిన్న మహిళా దినోత్సవ o అని చూసి గట్టిగా నిట్టూర్చడం తప్ప ఏమీ చేయలేని నా మధ్యతరగతి జీవితాన్ని  చూసి నవ్వాలో ఏడవాలో అర్దం కాలేదు పిచ్చి ఆలోచనలతో మనసు భారంగా ములిగిన దాన్ని కాస్త ఓదారుస్తూ కళ్ళను బలవంతంగా మూసుకున్నాను నిద్రా దేవిని ఆహ్వానిస్తూ…

Related Posts