ఊరు :- పాండ్రంగి గ్రామం,
పేరు :- గాయత్రి
అంశం :- చిత్రకవిత.
అవ్వడానికి కాగితపు పడవే.. కానీ ఎంతో ఉన్నతంగా ఆలోచించాలి ఇక్కడే! సముద్రపు గాలికి, అలల తరంగాలకి, ఎగిసి పడే కెరటాలకి ఈ పడవ అటు ఇటు.. ఎటు పడితే అటూ.. వెళ్తుంది.. దానికి దిశ ఏర్పడేది ఏర్పరిచేది ఒక్క నావికుడు మాత్రమే..!! అలాగే కుటుంబపు సముద్రంలో ఎలాంటి కష్టాలు ఎగిసే కెరటాలలాగా వచ్చి పడినా.. ఆ కుటుంబం పెద్ద.. నావికుడుగా తన దిశను బలపరుచుకుని ముందుకు వెళ్తుంటాడు.. ఆ ఆకాశం అంత విశాలంగా, సముద్రమంత లోతుగా ప్రయాణించే ఈ జీవితపు పడవని నడపడం అందరికీ సాధ్యం కావచ్చు కాకపోవచ్చు!! అంత పట్టుదలగా నడిపే నాయకుడు నావికుడు లేకపోవచ్చు!! మనమే నడపడానికి ప్రయత్నం చేయాలి.. అందులో సఫలీకృతమవ్వాలి 🙏🙏
హామీ పత్రం :- ఇది ఇప్పుడే, ఈ చిత్రకవిత అంశం కోసం రాసాను అని హామీ ఇస్తున్నాను.