అవ్వ ఉపాయం
ఊరవతల అడవికి దగ్గరలో ఒక పూటకూల్ల అవ్వ ఉండేది. అడవికి వేటకు వెల్లిన వాల్లు కట్టెల కోసం వెల్లిన
వాల్లు వేరే ఊరికి వెల్లేవాల్లు ఎవరయిన నడిచి నడిచి
అలసిపోయిన వాల్లు అవ్వ దగ్గర బోజనం చేసేవాల్లు
మంచి బోజనం పెట్టినందుకు ఎంతోకొంత డబ్బులు ఇచ్చి
వెల్లేవాల్లు.
అవ్వ మంచి మంచి వంటలు చేసేది చాలా రుచిగా ఉండేవి వంటకు కావలసిన సామానులన్ని వారం
రోజులకొకసారి తెచ్చుకునేది ఎవ్వరు ఎంత ఇచ్చినా నవ్వుతూ తీసుకునేది ఇంతకావాలని డిమాండ్ చేసేది
కాదు. అవ్వ వంటలు బాగుంటాయని దగ్గర ఉన్న వాల్లు
కూడ తినేవారు అవ్వ ఏమనేది కాదు.
ఒకరోజు పక్కదేశపు రాజు తన అనుచరులతో అడవికి
వేటకు వచ్చాడు వేటలో బాగా తిరిగి తిరిగి అనుచరులతో విడిపోయి ఒక్కడే వేరయ్యాడు వాల్లకోసం ఎంతవెతికినా కనపడలేదు అడవంతా గాలించాడు చాలా అలసిపోయాడు ఆకలేస్తుంది నిద్ర
కూడ ముంచుకొస్తుంది చుట్టూ చీకటి ఆవరించింది
ఎటు వెల్లాలో తెలియడంలేదు.
ఏదైతే అదయిందని ఒక దారిగుండ అడవి బయటకు వచ్చాడు చుట్టూ చూస్తుంటె దూరంగా దీపం వెలుతురు
కనిపించింది.
ఆ వెలుతురు ఉన్నచోటికి చేరుకున్నాడు రాజు విజయేంద్ర వర్మ అదే అవ్వ ఇల్లు.
లోపల ఎవరయినా ఉన్నారా? అడిగాడు రాజు అప్పుడే
అన్ని సర్థుకుంటుంది అందరు తిని ఖాలీ చేసిన గిన్నెలు కడిగింది అవ్వ ఎవరా! అని బయటకు వచ్చి చూసింది
ఎదురుగా రాజుగారు
దండాలు రండి బాబుగారు అని లోపలికి ఆహ్వానించింది
రాజు లోపలికి వస్తూ అవ్వా! నాకు చాలా ఆకలిగా ఉంది
తినడానికి ఏదైనా పెట్టు అన్నాడు.
అవ్వ ఎవరికి లేదనదు కదా! అందులో ఇంక రాజు మరి
తినడానికి ఏమీ లేవు సరిగదా వండడానికి కూడ ఏమి
కూరగాయలు లేవు.
కాని చీకట్లో వచ్చిన అతిథికి పెట్టకుండ ఉండలేదు.
ఏం చేయాలా అని ఒక్క క్షణం ఆలోచించింది
ఒపది నిమిశాలు బాబు మీరిలా కూర్చోండి వంట
చేసేస్తా !
తాగడానికి నీల్లు ఇచ్చి లోపలికి వెల్లింది అవ్వ కట్టెల
పొయ్యి అంటించి బియ్యం కడిగి పెట్టింది దీపం పట్టుకుని
పెరటి వైపు చూసింది దగ్గరగా గడ్డి కనిపించింది దాన్నె
కోసుకువచ్చి శుభ్రంగా కడిగి గడ్డి పచ్చడి చేసింది.
వేడివేడిగా అన్నం గడ్డి పచ్చడి వడ్డించింది.
రాజు గారు గడ్డి పచ్చడి వేడి వేడి అన్నం నెయ్యి కలుపుకుని తిని ఆహా!!ఏమి రుచి ఇది ఎంత బాగుంది
అనుకుంటు కడుపు నిండా తిని హాయిగా నులక మంచం
లో నిద్రించాడు.
తెల్లారె సరికి అలసట తీరిపోయింది అవ్వను పిలిచి
తన మెడలోని హారము బహుకరించి అవ్వ దగ్గర
సెలవు తీసుకుని తన రాజ్యానికి బయలు దేరాడు.
** **** ****
రాజు తన రాజ్యానికి చేరుకుని సేదతీరి బోజనానికి
కూర్చున్నాడు
ఎందుకో తన వంట మనిషి చేసిన వంట రుచిగా
అనిపించలేదు అవ్వ వంటనే గుర్తు రావడం సరిగ్గా
తినకుండానె లేచిపోయాడు.
పొరుగు దేశం రాజు విందుకు పిలిచాడు అక్కడికి
వెల్లినా ఆహారం రుచించలేదు.
ఎన్నో రకాల వంటలు చేయించుకొని తింటున్నాడు
అయినా అసలు రుచిగా అనిపించడం లేదు.
వంట వాల్లను మార్పించాడు అయినా ముద్దదిగడం
లేదు.
తనకేమయిందసలు ఎందుకు ఈ వంటలన్ని నచ్చడం
లేదు.? అని తనలో తనే మదనపడుతున్నాడు.
దీనికంతటికి కారణం అవ్వ వంటేనా? అనుకుని రాజ
భటులను పిలిపించాడు.
అవ్వ అడ్రసు చెప్పి అవ్వను తీసుకొని రమ్మన్నాడు.
రాజభటులు అవ్వను తీసుకరావడానికి వెల్లేసరికి
భయపడిపోయింది అవ్వ.
ఏదైనా తప్పుచేసానా?గడ్డిపచ్చడని రాజుకి తెలిసి పోయిందా ?
రాజుని నేను నాకు గడ్డి పచ్చడి పెడతావా?అని నాకేమ
యినా శిక్ష వేస్తాడా?
అప్పుడు నేనేం చెప్పాలి?ఆ శిక్ష నుండి ఎలా తప్పించు
కోవాలి?
ఎన్నో సందేహాలు అవ్వ మనసులో!
రాజభటులతో పాటు రాజ్యానికి బయలుదేరింది ఏమంటారోనని మనసుల బాదపడుతూనె.
అవ్వను చూడగానె రాజుగారు ఎదురు వచ్చి ఎంతో
ఆప్యాయంగ మాట్లాడారు.
అవ్వా!ఎలా ఉన్నావు?అని కుశల ప్రశ్నలన్ని వేసాడు.
బాగున్నాను బాబుగారు మీ దయవల్ల అని చెప్పింది
అవ్వ లోపల భయపడుతూనె.
కాని రాజుగారు దానికి విరుద్దంగానె ఎంతో సంతోషంగా
కనపడుతున్నారు ఆప్యాయంగ పలకరిస్తున్నారు.
అవ్వ కాస్త స్థిమిత పడింది.
అవ్వా!నిన్నెందుకు పిలిపించానోనని అనుకుంటుంన్నావు కదా !
నాకు ఆ రోజు ఏం కూర వండి పెట్టావు?
అనంగానె అవ్వ గుండెలో రాయి పడింది ముఖం ఎదోలా అయిపోయింది
నేనా రుచి మరచి పోలేకపోతున్నానవ్వ నా దగ్గర వంట
మనిషిగా ఉండి నాకా వంటలు చేసి పెడతావా?
అడిగాడు రాజు.
అవ్వ ముఖంలో మల్లీ మార్పు ఈ సారి భయం పూర్తిగా
పోయి ఆనందమయిన మార్పు వచ్చింది.అంతలోనె
ఆలోచించుకుంది అమ్మెా!ఇక్కడే ఉండి వండితే తెలిసి
పోతుంది కదా!అనుకుని
అయ్యా!నేను ఇక్కడే ఉండి వండలేను అని చెప్పింది
అయ్యెా!ఎందుకమ్మా నీకు చాలా డబ్బులు ఇస్తాను
నువ్వేది అడిగితే అది ఇస్తాను అన్ని సౌకర్యాలు చేస్తా
నీకే బాద కలుగనివ్వను అన్నాడు.
లేదయ్యా అక్కడ నన్ను నమ్ముకుని చాలా మంది ఉన్నారు వాల్లను నిరాశ పరుచలేను అంది
అలాగైతె మా వంటవాల్లకన్న నీ వంట నేర్పించు అన్నాడు
అలాగైతె ఇంకా ప్రమాదమని గ్రహించిన అవ్వ ఒక్షణం
ఆలోచించుకుని
అలా కాదుకాని నా వంటలు మీకు నచ్చాయి కనుక నేనె
చేస్తాను కాని మా ఇంట్లోనె చేస్తాను మీరు రోజు మీ
భటులను పంపించి తెప్పించుకోండి నేను చేసి రడీగా
పెడతాను అంది.
రాజు గారికి కూడ ఈ ఆలోచన నచ్చింది ఎలాగైతె నేం
అవ్వ వంటలు తినచ్చు అనుకుని సరే అన్నాడు.
అవ్వ ఉపాయంతో అపాయాన్ని జయించింది.
ఉమాదేవి ఎర్రం