మాటలో మాధుర్యము
మనసులో మమకారము
ఉండాలి ఖచ్చితంగా
జీవితాన ఆదర్శము
చేతులతో సహకారము
చేతల్లో ఉపకారము
చేస్తేనే ఉపయోగము
చూపితే మానవత్వము
మాట మాట కలిపితే
స్నేహమే కలుస్తుంది
మనసు మనసు కలిస్తే
మమకారం పుడుతుంది
మంచి పనులు చేస్తేనే
గౌరవం దక్కుతుంది
ముందడుగు వేస్తేనే
అభివృద్దే జరిగేది
ఇట్లు
మీ
కోటేశ్వరరావు ఉప్పాల