"C_PLJ4CZpdxQ0": { "on": "visible", "vars": { "event_name": "conversion", "send_to": ["AW-10942541090/v-d1CN7kpM4DEKLa5-Eo"] } }

అశోక విజయ దశమి శుభాకాంక్షలు..

అశోక విజయ దశమి శుభాకాంక్షలు..💐💐💐

పండుగ అనేది జాతుల సంస్కృతికి ప్రతిబింబం. మన దేశంలో అలాంటి వేడుకల్లో అతి ముఖ్యమైనది విజయదశమి. అదే దసరా! విజయదశమికి కారణ మైన అంశాలు పౌరాణిక యుగాల్లో రకరకాలుగా ఉన్నాయి. మహిషాసుర మర్దనం, శ్రీరామ విజయం, కురుక్షేత్రానికి సిద్ధమవుతూ అర్జునుడు శమీవృక్షం మీది నుంచి ఆయుధాలు దించి తిరిగి చేబూనడం – ఇలా ఒక్కో కాలంలో ఒక్కో పౌరాణిక కథ ప్రాబల్యంలోకి వచ్చాయి. ఇందులో బౌద్ధానికి సంబంధించి గొప్ప చారి. త్రక అంశం కూడా ఉంది. ఆ విషయం కాలగర్భంలో కలసిపోయినా తిరిగి బోధిసత్వ బాబాసాహెబ్ అంబేడ్కర్ నిర్ణయంతో తిరిగి అంకురించింది. అదే ”అశోక విజయదశమి!”.

డాక్టర్ అంబేడ్కర్, సత్యనారాయణ గోయంకా గార్లు చారిత్రక, సాహిత్య అంశాల్ని పరిశోదించి ప్రకటించిన అంశం ఇది. ‘అశోక విజయదశమి’నే ‘దమ్మ విజయం’ అని అంటారు.

అశోకుడు మౌర్య సామ్రాజ్య చక్రవర్తి అయిన తొమ్మిదేళ్లకు (క్రీ. పూ. 261లో) కళింగ యుద్ధం జరిగింది. ఈ యుద్ధానికి ముందే తన భార్య విదిశాదేవి.

ప్రోద్బలంతో బౌద్ధంపై మక్కువ చూపాడు అశోకుడు.

కానీ రాజకీయ కారణాలు, కుట్రల కారణంగా కళింగ యుద్ధం ఆగలేదు.

ఈ యుద్ధం గెలిచినప్పటికీ అశోకు నికి ఆనందాన్నివ్వలేదు. కానీ, ఈ యుద్ధం అశోకునిలో మార్పునకు నాంది పలికింది. ఇంకా ఇలాగే ఉంటే తన తన వల్ల ఎన్ని యుద్ధాలకు దిగుతానో అని ఆలోచించాడు. ఆనాటి బౌద్ధ గురువు ఉపగుప్తుణ్ణి (మొగ్గలి పుత్త తిస్న) కలిశాడు. కళింగ యుద్ధం ముగి సిన సంవత్సరానికి బౌద్ధ దీక్ష తీసుకున్నాడు. అది ఆశ్వ యుజ శుద్ధ అష్టమి. బౌద్ధులకు ప్రతి నెలలో పౌర్ణమి, శుద్ధ అష్టమి, బహుళ అష్టమి, బహుళ చతుర్థులు (అమావాస్యకు ముందు రోజు) ఉపోసద దినాలు, బౌద్ధ, సంఘంలో భిక్షువుగా దీక్ష తీసుకోవడాన్ని ‘ఉపసంపద పొందడం అంటారు.

ఈ ఉపసంపద పేరుతో ఈ నాలుగు రోజుల్ని ఉపసంపద దినాలు’ లేదా ‘ఉపోసద దినాలు’ అంటారు. అశోకుడు ఆ రోజున యుద్ధ ఖైదీలం దర్నీ విడుదల చేశాడు. వారందరికీ పూర్తి హక్కులతో సాగుభూమిని పంచాడు. న్యాయ వ్యవస్థను పునరుద్ధ రించాడు.

ఆ మరుసటి రోజు దశమి. ఆ రోజున నేను కత్తిని దించుతున్నాను. ధర్మాన్ని చేబడుతున్నాను. ఇక మీదట నేనుగానీ, నా వంశం వారు గానీ ఎలాంటి యుద్ధాల్నీ చేయరు. అహింసే మా ఆయుధం, బౌద్ధ ధర్మమే మా మార్గం’ అని ప్రకటించాడు. అలా ఆయుధాల్ని దించి, మూటగట్టి మూలకు పెట్టి, అహింసనూ, మానవీయ తనూ, శాంతిని అశోకుడు చేపట్టిన రోజున దేశమంతా. అహింసోత్సవాలు జరుపుకున్నారు.

దీన్ని ఆశోకుడు
‘ధమ్మ విజయం’గా ప్రకటిస్తే.. దాన్ని ‘అశోక విజయదశమి’గా జనం భావించి ఉత్సవాలు జరుపుకున్నారు. ఆ నాటి నుంచి తన సైన్యాన్ని ప్రజోపయోగ కార్యక్రమాలకు ఉపయోగించాడు. రెండువేల రెండు వందల సంవత్సరాల తర్వాత అంబేడ్కర్ విజయదశమి రోజున నాగపూర్లో 1956లో ఆరులక్షల మందితో బౌద్ధదీక్ష తీసుకున్నాడు. అప్పట్నిచీ తిరిగి విజయదశమిని ‘అంబే డ్కర్ బౌద్ధ దీక్షా దినం’గా, ‘అశోక విజయదశమి’గా ఘనంగా జరుపుకుంటున్నారు.

మీ
కోటేశ్వరరావు ఉప్పాల

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *