అహంకారం

అమ్మా శుభ  ఏం చేస్తున్నావు అంటూ వచ్చింది పక్కింటి విద్య ఏమి లేదక్కా ఇప్పుడే తినిపాత్రలు సర్దుతున్నా అంది శుభ.

అవునా ఏమి లేదమ్మా  మొన్న మీ అన్నయ్య గారు మద్రాసు వెళ్ళారా అప్పుడు ఒక చీర తెచ్చారమ్మా దాన్ని నీకు చూపిద్దాం అని తీసికొని వచ్చాను అంటూ బ్యాగ్ లో నుండి తీసింది విద్యా

అబ్బా అక్కా చాలా బాగుంది అక్కా అన్నయ్య గారి అభిరుచి మంచిదేకలర్ కాంబినేషన్ కూడా బాగా తెలిసినట్టే ఉంది అంది శుభ. 

ఆయానాకేం తెల్సు నా బొంద నేనే చెప్పాను కలర్ లో తీసుకోండి అని అయినా వట్టి  పిచ్చి మా లోకంమా వాళ్ళు ఈయన తెలివి కి కట్టాబెట్టారు అనుకున్నవా వాళ్ళ వాళ్ళు మా వాళ్ళని బతిమాలి బామాలి పెళ్లికి ఒప్పించారు.

నా తెలివి వల్లేనా పుట్టింటి వారి వల్లే ఈయన ఇంత ఆస్థి సంపాదించారు అని అంటూ కొంచం అహంకారం కలగలిపిన గొంతు తో చెప్పింది విద్యా

ఆవిడ సంగతి తెలిసిన శుభ ఇబ్బందిగా నవ్వింది. విద్య ఎప్పుడూ ఇంతే బాగా ఆస్థి ఉందని పొగరుఅహంకారం బాగా ఉన్నాయి.

తానే గొప్పాతన వారే గొప్పవాళ్ళు అనే మిధ్యలో బతుకుతువారి గురించితన గురించి గప్పాలు కొట్టుకుంటూ ఉంటుంది.

ఆమె సంగతి తెలిసిన వారు ఎవరూ ఆమెని ఆ ప్లాటు లోకి రానివ్వరు.అది తెలియని శుభ ఆమె పలకరించగానే కొత్త స్నేహితురాలు దొరికిందని సంబర పడింది.

శుభ ఈ మధ్యనే ఆ అపార్ట్మెంట్ లోకి కొత్తగా వచ్చారువచ్చిన రెండో రోజు నుండే  మొదలయ్యింది ఈ రామాయణం ఆమె తన వారి గురించి

తన పుట్టింట్లో వారు వెండి కంచం లో తప్పితే భోజనం చేయరు అనిఅప్పుడే కాచిన మీగడపెరుగు తప్పితే తినరనిపట్టుచీరలు తప్పా నూలు చీరలు కట్టరు అని బడాయి మాటలు మాట్లాడుతుంది.

తానే గొప్ప దాన్ని అన్నట్టుగాతన భర్త ఎందుకు పనికి రాని కొయ్య అనితాను పుట్టింటి నుండి తెచ్చిన డబ్బు తోనే ఆయన బతుకుతున్నాడు అని ఇలా ఆమె మాటలకు హద్దుఅదుపు ఉండేవి కావు.

అయినా శుభ అవ్వన్ని వింటూ ఉండేది చిరునవ్వు తోతనకి ఇక్కడ తెలిసేది ఆమె ఒక్కతే కాబట్టి అమెతోనే కాలక్షేపం చేస్తూ ఉండేది..

కానీ విద్య అంతటితో ఆగకుండా చుట్టుపక్కల ఉన్న వారు ఎందుకు పనికి రాని వారనితానే గొప్ప అని అందరితో పొగరుగావారిని తీసిపారేసే విధంగా మాట్లాడుతూ ఉండేది.

కొన్ని రోజులు ఎదో పోనీలే అని ఉరుకున్నారు అందరూకానీ పోనుపోను ఆవిడ మాటలకు అంతు లేకుండా పోయింది.తానొక మహారాణి అన్న ఫిలింగ్ తో మాట్లాడుతూమిగతా వారిని చాలా చులకన గా చూసేది.

అపార్ట్మెంట్ వాళ్ళు ఇక  భరించలేక విద్య భర్తకు ఆమె గురించి చెప్పడం మొదలు పెట్టారు. ఆమె ని అదుపులో పెట్టుకొమ్మనిలేదంటే ఇల్లు ఖాళీ చేసి అయినా వెళ్లి పొమ్మని అనసాగారు.

ఎక్కడికి వెళ్లినా ఇదే సమస్య తో విసిగి పోతున్నా మహిధర్ ఏమి చేయాలా అని ఆలోచించసాగాడు ఆమె అహంకారాన్ని ఎలాగైనా తొలగించాలని అనుకున్నాడు.కానీ ఎంత ఆలోచించినా ఒక్కటి కూడా ముందుకు  సాగలేదు.

ఇలా రోజులు గడిచిపోతున్నాయి.కానీ ఆమె మాటలకు అంతుపొంతూ లేకుండా పోతుంది. శుభ భర్త మనోహర్  ఒక మానసిక వైద్యుడు కావడం వల్లకాస్త

వారితో చనువు ఎక్కువ గా ఉండడం వల్ల శుభ సహాయం తీసుకోవాలని అనుకున్నాడు మహిధర్.అలా అనుకున్న తర్వాత కొంచం మనసు కుదుట పడింది.

తెల్లవారిన తర్వాత మహిధర్ తనకి పనుందని  ఇంట్లో చెప్పి మనోహర్ గారికి ఫోన్ చేసిబయట ఎక్కడైనా కలవాలి అని ఇద్దర్ని రమ్మని అన్నాడుఅతని మాటల వల్ల ఎదో ముఖ్యమైన విషయమే అయ్యి ఉంటుందని భావించిన మనోహర్శుభ లు ఇద్దరూ అతన్ని ఒక రెస్టారెంట్ కి రమ్మని చెప్పితాము కూడా అక్కడికే వెళ్లారు.

అందరూ కూర్చున్న తర్వాత ” ఏంటి సంగతి ఈ కలవడం ఎదో అక్కడ ఇంట్లోనే కలిసే వాళ్ళం కదా అన్నాడు మనోహర్ నవ్వుతూదానికి మహిధర్ అమ్మో అక్కడ అయితే మా ఆవిడ మీ ఆవిడ దగ్గరికి వస్తుంది కదా మాట్లాడడానికి మనకు ప్రైవసీ ఉండదు అని ఇక్కడికి రమ్మని చెప్పాను అన్నాడు.

సరే విషయం ఏమిటో  చెప్పండి అన్నయ్య అంది శుభ. “ఎం చెప్పమంటారు నా భాదనా భార్య వల్ల నేను మనశ్శాంతి గా ఎక్కడ ఉండలేకపోతున్నాఇప్పటికి ఒక వంద ఇళ్ళు మారి ఉంటాము.ఇప్పుడు ఇక్కడ సొంత ఇల్లు అయినాప్రశాంతంగా ఉండనివ్వడం లేదు.

తన మాటలతో అందర్నీ విసిగిస్తున్నది పిల్లలు కూడా చాలా  ఇబ్బంది పడుతున్నారు. ఇక  అపార్ట్మెంట్ వాళ్ళు  ఇల్లు అమ్మేసుకుని వెళ్ళమని వర్నిoగు లు ఇస్తున్నారు.చాలా అప్పు చేసిఈ ఇల్లు కొన్నానుఇంకా అప్పు కూడా తీరలేదు

మీరు మానసిక వైద్యులు కాబట్టి ఎదో ఒక ఉపాయం చెప్పక పోతారా అనే ఆశ తో మిమల్ని అడుగుతున్నానాకు ఏదయినా సలహా ఇవ్వండి అని అన్నాడు  ఆవేదనగా మహిధర్.”..

దానికి మనోహర్ ఆలోచనలో పడి అతని బాధ అర్థం చేసుకున్నట్లు గా మీ బాధ నాకు అర్థం అయ్యింది మహిధర్ గారు కానీ ఇప్పుడు ” మనం చేసేది ఏమి లేదండిఆవిడ అలా ఎందుకు మారారో మనం ముందు తెలీసుకోవాలి

ఆమె గతం గురించి మీకు తెలిసిన విషయాలు చెప్పండి అన్నాడు మనోహర్.” అవును అన్నయ్య గారు వారి పుట్టింటి వారు చాలా గోప్ప వారని వదిన గారు చెప్తూ ఉండే వారు అంది శుభ.”

 అయ్యో అవునా దాని మొఖం అమ్మావాళ్ళు చాలా పేదవాళ్ళుమా అమ్మ గారికి  వాళ్ల పుట్టింటి వారు దూరపు చుట్టాలు వారి కుటుంబం కూడా చాలా పెద్దది.

తినడానికి తిండి కూడా లేని పరిస్థితి.వారి ఆర్ధిక పరిస్థితి తెలిసి మా అమ్మగారు జాలి తోవిద్యని కోడలు గా చేసుకుంది. నన్ను పెళ్లి చేసుకునే నాటికి ఈ విద్య సన్నగా కట్టే పుల్లల ఉండేది.

నా దగ్గరికి వచ్చిన కొత్తలో తిండిని దొంగతనంగా తినేదిఎవరైనా తనని చులకనగా చూస్తారనే భయం తో ఎవరిళ్లకు వెళ్ళేది కాదుఎవరితోనూ మాట్లాడేది కాదు.

” అందుకే నా జీతం లోని డబ్బంతా పైసాపైసా కూడబెట్టి మరి నగలు అన్ని చేయించుకుంది. ఇల్లు కూడా కొనిపించు కుoది అని  చెప్పిఊపిరి పీల్చుకున్నారు మహిధర్. 

“”అలా అయితే  ఆమెది ఒక సమస్య కానే కాదు. ఒకప్పుడు అంటే ఆస్తులుఅంతస్తులు చూసి మాట్లాడే వారినిడబ్బుంటే గొప్పవారి గా అనుకునే సమాజాన్ని చిన్నప్పటి నుండి చూస్తూఆ లేమి తనం వల్ల అవమానం పొందింది

కాబట్టిఇప్పుడు ఆవిడ తనకి డబ్బుందనితన పుట్టింటి వారు గొప్పవారనిచెప్తూతనకు డబ్బుందని అందరూ అనుకోవాలి అని కోరుకోవడం లో తప్పు లేదు.కానీ అవి మిగతా వారి కంటికి అవమానంగా కనిపించడమే బాధాకరం.

కాకపోతే ఒకటి అప్పటి సమాజం ఇది కాదనిఇప్పుడు చాలా మారింది అని ఆవిడకు తెలిసేలా చేయడమే మన ముందున్న పనిదాని వల్ల మీకు ఇక ముందు ఏ సమస్య ఉండదు. అన్నాడు మనోహర్.”

మరి ఎప్పటి నుండి మొదలు పెడతారు మీ ట్రీట్ మెంటు అని అడిగాడు మహిధర్. ఎప్పడి నుండో ఎందుకు ఈ రోజు మధ్యాహ్నం నుండే మొదలు పెడదాం అయితే ఆవిడని హాస్పిటల్ కి తీసుకుని రావద్దు.

మా ఇంట్లోనేమా శుభ ముందే ఆవిడకు వైద్యం చేస్తాను అన్నాడు మనోహర్. అయ్యో పాపం వదిన గారికి నయం అవుతుంది అంటే నేను మాత్రం కాదంటానా అంది శుభ. ఇక వెళదాం పదండి అని అందరూ ఇంటికి వెళ్లారు..

ఆ రోజు మధ్యాహ్నం విద్యశుభ ఇంటికి వచ్చే సరికి శుభని కొడుతున్నాడు మనోహర్ ఏంటి ఎందుకు కొడుతున్నాడు అని అడిగింది విద్య

దానికి మనోహర్ అయ్యో అక్కయ్యా గారు మీకు తెలియదు లెండిదీని పుట్టింటి వారు గతి లేనివారు అని కట్నం ఇవ్వకుండా పెళ్లి చేసుకున్నాఇప్పుడు తెలిసింది దీనికి బాగా ఆస్థి ఉందనివెళ్లి తెమ్మని అంటే తేవడం లేదు.

అందుకే కొట్టి వెళ్లా గోడుతున్న పోవేపోయి డబ్బు తీసుకుని రా అన్నాడు మనోహర్శుభకి కన్ను కొడుతూ విద్య చూడకుండాదానికి హ అని అయ్యో వదినా నిజంగా నాకే పాపం తెలియదు.

మా వాళ్ళకి బాగా డబ్బుంది అని నేను పక్కింటి వారికి చెప్తుంటే వినిఇలా కొడుతున్నారునిజానికి మా వాళ్లకు పుటకు గతి లేని వాళ్ళు అని చెప్తే నమ్మడం లేదు అంది ఏడుస్తూ శుభ.

ఆ మాటలకు ఒక్కసారిగా ఉలిక్కిపడిన విద్య అన్ని రోజులుగా తాను అందరికి తన పుట్టింటి వారు బాగా ఉన్నవారు అని చెప్తున్న విషయం గుర్తుకు వచ్చింది.

తాను చేసిన తప్పేంటో తెలిసింది.అంటే తన భర్తకు నేను ఇలా చెప్పిన సంగతి తెలిస్తే తన పని కూడా ఇలాగే అవుతుందా అనే ఆలోచనలో పడిన విద్యని చూస్తున్న మనోహర్

వేళ్ళు  శుభ వెళ్లి ఆ డబ్బంతా తీసుకుని వస్తేనే ఇంటికి రాలేకుంటే ఇంట్లోకి రావద్దు అని శుభాని బయటకు గెంటేసితలుపులు వేసాడు. శుభతో పాటుగా విద్య కూడా బయటకు వచ్చేసితనని శుభ స్థానం లో ఉహించుకుంది.

అమ్మో తన భర్త కు తెలిస్తే ఇంకేమైనా ఉందా అని అనుకునిశుభ నీకు నిజంగా అంత ఆస్థి లేనప్పుడు నువ్వు అందరికి ఎందుకు అలా చెప్పవు అని అంది.

దానికి శుభ ఆ ఏముంది అక్కా నాకు గౌరవం ఇస్తారని అనుకున్నాకానీ ఈ రోజుల్లో మంచితనం తప్పాడబ్బుకు ఎవరూ విలువ ఇవ్వడం లేదని తెలిసి ఉరుకున్నాడబ్బు ఈ రోజు ఉంటుందిరేపు పోతుంది నీకు డబ్బే ముఖ్యమా అని పక్కింటి వాళ్ళు కూడా నాతో అన్నారు.

అందరూ మంచితనాన్ని చూస్తున్నారు.నలుగురికి సహాయం చేసేది చూస్తున్నారు తప్ప డబ్బుకు విలువ ఎవరూ ఇవ్వడం లేదు అని నేను తెలిసే సరికి నా భర్త నన్ను డబ్బు తెమ్మని అంటున్నాడు.

ఇంకా మీ ఆయన నయం ఏమి అనడం లేదు అంది శుభ విద్య తో. అవునా అని అంటూ ఎదో ఆలోచిస్తూ ఇంట్లోకి వెళ్ళి పోతున్న విద్యను చూస్తూ నవ్వుకుంది శుభ..

ఒక రెండు నెలలు అయ్యాక విద్యను అపార్ట్మెంట్ వాళ్ళు తమ ప్రసిడెంటు గా ఎన్నుకోవడం చూసిన మహిధర్ గారు విద్య మనోహర్లకు తన కృతజ్ఞతని తెలుపుకున్నాడు.

Related Posts