ఆకర్షణ A Type of Attraction 4

ఆకర్షణ

హలొ ఏంటి నువ్వు నిన్నటి నుండి రిప్లై లేదు అన్నాడు లక్కీ, బుoగమూతి పెట్టుకుని కూర్చున్న లిల్లి తో, గంట సేపటి నుండి ఎదురుచూస్తుంటే ఇప్పుడు వచ్చింది కాక, రాగానే ఏమి మాట్లాడకుండా బుంగ మూతి వేసుకుని కూర్చుంది లిల్లి..

అబ్బా చంపకే చెప్పు ఏమైంది ,నువు చెప్పక పోతే నాకు ఎలా తెలుస్తుంది అన్నాడు లక్కీ, అయినా మూతి బింగించింది లిల్లీ, ప్లెజ్ చెప్పు బంగారం,నా కన్నా కదూ,బంగారం కదా, చెప్పవే,పోని నీ కాళ్ళు పట్టుకొనా అంటూ వంగి కాళ్ళు పట్టుకున్నాడు లక్కీ..

Man, Woman, Composing, Dispute

 అప్పుడు కిల కిల నవ్వుతూ హే వద్దులే రా, అయినా ఇడియట్ వి నువ్వు,నాకు ఎందుకు కోపం వచ్చిందో తెలుసా అంది చక్రాల్లాంటి కళ్ళు విచిత్రంగా తిప్పుతూ, ఎందుకు వచ్చింది బంగారం అన్నాడు లక్కీ,మరేమో,మరేమో నా ఫోన్ లో బ్యాలెన్స్ అయిపోయింది మరి నువ్వు ఎందుకు వేయించలేదమ్మ అంది గారంగా..

ఆకర్షణ

A Boy and Blonde Girl Hugging Each Other

అవునా నాకు చెప్పాలి కదా అన్నాడు. ఏంటి నీకు చెప్పేది,ఎప్పుడు నువ్వే కదా వెయిస్తావు అంది లిల్లీ, సరే వేయిస్తా లే ఇప్పుడు, ఏమైనా ఇచ్చేది ఉందా మరి అడిగాడు లక్కీ ఆశగా, హమ్మో ఆశ ముందు వేయించు, తర్వాతే ఏదైనా అంది లిల్లి. లక్కీ నిరాశగా అంతే నా అన్నాడు, అంతే అంది లీల్లి, సరే అని వెళ్ళిపోయాడు బ్యాలెన్స్ వేయించ డానికి,

సాయంత్రం ఆరుగంటలకు లక్కీ తన స్నేహితులతో  చిట్ చాట్ మాట్లాడుతూ నిలబడ్డాడు. మాటల్లో ఎరా నీ లిల్లి ఏముంటుంది రా అన్నారు వాళ్ళు . ఏముంది రా ఎప్పుడూ బ్యాలెన్స్ అంటుంది.తిరగాలి,షాపింగ్ లు చేయించాలి. అంతకన్నా ఏముంది, దానికి బ్యాలెన్స్ లు వే యించడానికి నేను మా అయ్యా జేబు కొట్టాల్సి వస్తుంది అంటూ తన బాధ చెప్పుకున్నాడు లక్కీ..

మరి అంత బాధ పడుతూ దాన్ని ఎందుకు రా భరించడం , పెళ్లి చేసుకుంటావా తనని అని అడిగారు వాళ్ళు . పెళ్లా దాన్న, ఏరోయి దాన్ని చేసుకుంటే మా అయ్యా ఆస్తులు అమ్ముకోవాలి రా,అది దాని ఓవర్ యాక్షన్,అన్నాడు లక్కీ,మరి ప్రేమిస్తున్నా అన్నావు..

ఇదంతా నిజం కాదా అన్నాడు ఒకడు.ఏమి లేదురా మనకు ఒక లవర్ ఉందని చెప్పుకోవడానికి,చిలక కొట్టుడు కొట్టడానికి,సరదాగా తిరగడానికి తప్పా, అది దేనికి పనికి రాదు,మా నాన్న నా మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ఇదంతా తెలిసింది అనుకో చంపేస్తాడు అన్నాడు లక్కీ మాటలకు అందరూ బిగ్గరగా నవ్వారు

ఇదే సంభాషణలు ఇంకో దగ్గర లిల్లి తన స్నేహితులతో అంటుంది వాడొట్టి వెస్ట్ గాడే ఊరికే తిరుగుదాం అంటాడు, ఎక్కడెక్కడికో తీసుకుని వెళ్తాడు.ఏదేదో చేస్తా అంటాడు.మరి నువ్వు అతనితో చాలా క్లోజ్ గా ఉంటున్నావు గా అంది ఒక స్నేహితురాలు అవునే మరి ఉండకుంటే  ఎలా మన సరదాలు, సంతోషాలు, చిన్న చిన్న కోరికలకు డబ్బు ఎలా వస్తుంది, ఇలా ఎవడినో ఒక్కడిని పట్టుకుని సరదాలు తీర్చుకోవడమే బెస్ట్ కదా అంది లీల్లి..

మరి పెళ్లి కూడా చేసుకుంటావా వాడిని అంది,పెళ్లా వాడినా ఏముంది వాడి దగ్గర వాడి అయ్యకు ఆస్థి ఎక్కువ లేదు.మంచి ఆస్థి పరుడిని చూసి పెళ్లి చేసుకుంటా,వాడు ఫారిన్ లో ఉండే వాడిని చూస్తారు మా వాళ్ళు అందుకే సరదాలు, ఇంట్లో అడిగితే అంత డబ్బు ఇవ్వరు మనకి షాపింగ్ లు ,సరదాలు తీరుతాయి, వాడికి సరదాలు తీరుతాయి ఇద్దరికీ లాభమే అంది లిల్లి.

మరి నీ భర్తని మోసం చేసినట్టు కాదా ఇది అందామే, మోసమా అని నవ్వుతూ వాడు కూడా ఇలా చేయలేదని నమ్మకం ఏంటి, అందరూ ఇంతేనే తెలియనంత వరకు మంచి వాళ్లే,తెలిస్తే దొంగలు అంది లోకాన్ని చదివినట్టు మరి నిజమే నా????

Related Posts

3 Comments

  1. ఉన్నారేమో నాకు తెలిసినంత వరకు ఎవరూ అలాంటి వాళ్ళు నాకు తారస పడలేదు

Comments are closed.