ఆకాశంలో విహరిస్తూ

అక్షర కొరకు
అంశం :⁠- చిత్ర కవిత
తేది:⁠- 03/11/2026
శీర్షిక:⁠- ఆకాశంలో విహరిస్తూ…

                        అనగనగా ఒక ఊరిలో వింత విన్యాసాలు చేసే మల్లిగాడు ఉన్నాడు. అతను చేసే విన్యాసాలు చూసి ఊరిలో కొంతమంది అతనికి పిచ్చి పట్టింది అనుకుంటారు. మరి కొంతమంది ఊహల్లో విహరిస్తాడు అని అంటారు.
ఒకరోజు స్నేహితులతో... కలిసి తాగడానికి కోసం ఒక మంచి ప్రదేశం వెతకడానికి వెళ్తాడు.
అక్కడ కొబ్బరి చెట్టు దగ్గర ఒక పెద్ద కుండలో తాటికల్లు ఉంది. అది చూసి మల్లిగాడు స్నేహితులు ఆశ్చర్యపోయి చేరో సగం తాగుతూ ఉంటారు.
అరగంట తర్వాత మల్లిగాడు స్నేహితులు అక్కడే తాగేసి పడిపోయారు. మల్లిగాడు మాత్రం తాను ఒక పెద్ద అరిటాకు మీద ఆకాశంలో విహరిస్తున్నట్టుగా , తన రెండు చేతుల్ని బార్గా చాపి చుట్టూ తిరుగుతూ ఉన్నాడు.
ఆ అరిటాకు మీద కూర్చొని చేతిలో కాఫీ కప్పు పట్టుకొని ప్రపంచమంతా చూసుకుంటూ హాయిగా తాగుతున్నంత సంతోషం కలిగింది.
ఇలా విహరించడం చూసిన ఊరి జనం కొంతమంది మల్లిగాడి భార్యకు విషయం చెప్పారు.
మల్లిగాడి భార్య అసలే రాకాసి. మల్లిగాడు తాగి ఇలా చేస్తున్నాడు అని తెలిస్తే మాత్రం అస్సలు ఊరుకోదు. ఇంకా ఈ విషయం తెలిసి ఊరుకోక ఇంట్లో ఉన్న రోకలిబండ పట్టుకొని పరిగెత్తుకొని వెళ్ళింది.
మల్లి గాడిని కాకుండా తన స్నేహితులను మొదట మల్లిగాడి భార్య కొట్టడంతో... వారికి అక్కడే మత్తు దిగిపోయింది.
మల్లి గాడిని వెతుక్కుంటూ వెళ్తే...
ఊరు చివర్లో సమాధిపై కూర్చొని తాను విహరిస్తున్నట్టుగా ఊహల్లో ఉన్నాడు మల్లిగాడు.
అది చూసి కొందరు ఆశ్చర్య పోతే... మరికొందరు పగలబడి నవ్వారు.
రోజురోజుకీ మల్లిగాడి వింత విన్యాసాలు చూడలేని అతని భార్య అతన్ని కొట్టి మరీ ఇంటికి తీసుకొని వెళ్ళింది.
అది మరి కొందరు నవ్వి ఇంటికి వెళ్లిపోయారు.
ఇలా ఆకాశంలో విహరించుకుంటూ ఇంటికి చేరుకొని మరుసటి రోజు ఉదయం ఒళ్ళు నొప్పులతో... కళ్ళు తెరిచాడు.

మాధవి కాళ్ల..
హామీ పత్రం :⁠-
                      ఈ కథ నా సొంతం అని హామీ ఇస్తున్నాను..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *