ఆచ్చి వేణుగోపాలాచార్యులు
ఆచ్చి వేణుగోపాలాచార్యులు (1930-2016) ప్రముఖ సినీ గీత రచయిత. తెలుగు సినిమారంగంలో ఎన్టీఆర్ సలహామేరకు వేణుగోపాల్ గా మార్చుకున్నారు.
ఇతడు హైదరాబాద్ లోని కుత్బుల్లాపూర్‌లో 1930, జూన్ 12వ తేదీన జన్మించాడు. తెలుగుతో పాటు ఉర్దూ, హిందీ, సంస్కృత భాషల్లో ప్రవీణుడైన వేణుగోపాలాచార్యులు వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు. ప్రవృత్తిరీత్యా రచయిత. ఈయనకు భార్య కమలాదేవి, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. పట్నంలో శాలిబండ, పదవే పోదాము గౌరీ, జయజయజయ శ్రీ వేంకటేశ, నమో వేంకటేశ.. నమో తిరుమలేశా తదితరపాటల ద్వారా వేణుగోపాలాచార్యులు తెలుగువారికి సుపరిచితుడు. సంధ్యాదీపం, పచ్చని సంసారం, భాగ్యవంతుడు, అమరుడు తదితర మంచి చిత్రాల్లో పాటలను రాసి ఎంతో కీర్తి గడించారు వేణుగోపాలాచార్యులు. ఆయన రాసిన పాటలన్నీ తెలుగువారి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయి. తెలుగుతో పాటు హిందీ చిత్రం నాసిక్‌లో కూడా ఆయన పాటలు వ్రాశాడు.
సినిమా పాటల జాబితా
అమూల్య కానుక – ఏల మరచావో ఈశా నన్నేల మరచావో ఈశా – జి.కె.వెంకటేష్ – టి. జానకిరామ్ – 1961
అమూల్య కానుక – కాలం మారిపోయే అబ్బీ గరిటి చేతికొచ్చె – రాఘవులు – టి. జానకిరామ్ – 1961
అమూల్య కానుక – చక్కని వీణయిదే మట్టి కలసిన ఏమౌనో అమ్మా – వి.ఆర్.గజలక్ష్మి – టి. జానకిరామ్ – 1961
ఇతడు తన 91వయేట సికింద్రాబాద్ లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 2016, ఫిబ్రవరి 25వ తేదీన మరణించాడు.
మాధవి కాళ్ల