ఆడతనపు ఊపిరిని..కమ్ముకున్న నల్లని మేఘాల దాపున

 

శీర్షిక: ఆడతనపు ఊపిరిని
********
కమ్ముకున్న నల్లని మేఘాల దాపున
కన్నీటి ధారలతో కరిగిపోతున్న కుందనపు బొమ్మను నేను…

సృష్టికి మూలం నేనే అని తెలిసిన ఉదరంలోని ఊచకోతకు గురవుతున్న ఆడతనపు ఊపిరిని నేను….

నీలాకాశంలో స్వేచ్ఛావిహంగమై విహరించాలనే పురి విప్పిన ఆశల రెక్కలను రాబందులు తమ కబంధహస్తాలతో తుంచేస్తున్న రేపటి ఆశ కై ఎదురుచూస్తున్న చకోర పక్షిని నేను…

అనునిత్యం ఆంక్షాల వలయంలో చిక్కుకొని నా ఉనికినే కొల్పోతున్న
మహ ప్రస్థానాన్ని నేను….

పురివిప్పిన ఆశలను తుంచుతున్న వసంత ఋతువునై మరల చిగురిస్తున్న ఆశను నేను…

అమ్మగా,అక్కగా,ప్రేయసిగా,ఆలిగా మకరందపు సువాసనను వెదజల్లు తున్న అడుగడుగున ఆగమవుతున్న పడతిని నేను…

అణుకువ తో అలరాడుతున్న కామాంధుల కబంధ హస్తాలలో నలిగి పోతున్న మగువను నేను….

పసి మొగ్గలు అనికూడా చూడకుండా కాలరాస్తున్న మృగాలతో మసలుతు మౌన వేదనను మదిలో పదిలపరుచుకుంటున్న నిస్సహయురాలిని నేను….

కళ్యాణానికై కమ్మని కలలెన్నో కని ఏడడుగులు తనతో నడిచి సర్వస్వం సమర్పించిన చివరకు ఉరేతాడే శరణ్యమని చీకట్లో కలిసిపోతున్న పడతిని నేను…

ఊపిరి ఉన్న ఉషస్సును కోల్పోతున్న జగతిని నేను..

విశ్వ జగతిని వినమ్రతతో వేడుకుంటున్న ప్రతి ఆడపిల్లలో అమ్మతనాన్ని చూడుము..

కొత్త ప్రియాంక (భానుప్రియ

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *